AP SI Selection List: ఏపీ పోలీస్ ఎస్‌ఐ తుది ఎంపిక జాబితా విడుదల, 409 మందికి ఉద్యోగాలు

AP Police SI Final Results: ఎస్ఐ ఉద్యోగాల ఎంపిక జాబితాను రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) తాజాగా విడుద‌ల‌ చేసింది.

Continues below advertisement

AP SI Posts Selection List: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐ ఉద్యోగాల ఎంపిక జాబితాను పోలీసు నియామక మండలి (ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) డిసెంబరు 21న విడుద‌ల‌ చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఎంపిక ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థుల ఎంపిక జాబితాతోపాటు కటాఫ్‌ మార్కుల వివరాలను కూడా పోలీసు నియామక మండలి విడుద‌ల చేసింది. మొత్తం 409 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీటిలో ఎస్‌ఐ సివిల్ పోస్టులకు సంబంధించి విశాఖపట్నం రేంజ్‌లో 48 మంది, ఏలూరు రేంజ్‌లో 105 మంది అభ్యర్థులు, గుంటూరు రేంజ్‌లో 55 మంది అభ్యర్థులు, కర్నూలు రేంజ్‌లో 105 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇక ఆర్‌ఎస్‌ఐ(ఏపీఎస్సీ) పోస్టులకు సంబంధించి మొత్తం 96 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

Continues below advertisement

రాష్ట్రవ్యాప్తంగా 411 ఎస్సై పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్‌లో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన ఇవ్వగా.. మొత్తం 1,73,047 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 19న జరిగిన ప్రిలిమినరీ రాత పరీక్షకు 1,51,288మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫిబ్రవరి 28న ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు విడుదల చేయగా.. 57,923మంది అభ్యర్థులు ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యారు. వీరిలో 49,386 మంది పురుషులు, 8537 మహిళలు ఉన్నారు. వారందరికీ దేహదారుఢ్య పరీక్ష పీఎంటీ/పీఈటీకు హాల్‌టికెట్లు జారీ అయ్యాయి. అయితే, దేహదారుఢ్య పరీక్షలో క్వాలిఫై అయిన 31,193 మంది అభ్యర్థులకు తుది రాత పరీక్షకు హాల్‌టికెట్లు ఇచ్చారు. తుది రాత పరీక్ష నాలుగు పేపర్లకు నిర్వహించిన అధికారులు డిసెంబరు 3న తుది ఫలితాలు వెలువరించారు. తాజాగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను అధికారులు విడుదల చేశారు.

Press Note

Selection list to the post of SCT SI (Civil) (Men & Women)

Selection list to the post of SCT RSI (APSP) (Men)

Cut off marks to the post of SCT SI (Civil) (Men & Women)

Cut off marks to the post of SCT RSI (APSP) (Men)

దేహదారుఢ్య పరీక్ష(PMT)లో తమకు అన్యాయం జరిగిందని పిటిషన్ వేసిన పలువురు అభ్యర్థులకు హైకోర్టు(AP High Court) షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఎత్తు విషయంలో పిటిషనర్లు అర్హులేనంటూ ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన ధ్రువపత్రాల వాస్తవికతను తేల్చాలంటూ గుంటూరు ఐజీని న్యాయస్థానం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని కోరింది. మరోవైపు ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల పర్యవేక్షణలో వైద్యులు ముగ్గురు అభ్యర్థుల ఎత్తును కొలవగా అనర్హులని తేలింది. దీంతో ఎత్తు కొలవాలనే అభ్యర్థనను ఉపసంహరించుకుంటారా? లేక షరతు ప్రకారం రూ.లక్ష చొప్పున ఖర్చుల కింద చెల్లిస్తారా అని ధర్మాసనం ప్రశ్నించింది. సొమ్ము చెల్లించకపోతే జైలుకు పంపుతామని హెచ్చరించింది.

పోస్టుల వివరాలు..

* సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టులు 

ఖాళీల సంఖ్య: 411

1) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) ఎస్‌ఐ- సివిల్ (మెన్/ఉమెన్): 315 పోస్టులు

జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..

జోన్ జిల్లా/ఏరియా పోస్టులు
జోన్-1 (విశాఖపట్నం) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 50
జోన్-2 (ఏలూరు) తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా 105
జోన్-3 (గుంటూరు) గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 55
జోన్-4 (కర్నూలు) చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప 105
  మొత్తం  315

2) స్టైపెండరీ కేడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్- ఏపీఎస్‌పీ (మెన్/ఉమెన్): 96 పోస్టులు

జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు..

జిల్లా ఖాళీల సంఖ్య
ఎచ్చెర్ల- శ్రీకాకుళం  24
రాజమహేంద్రవరం 24
మద్దిపాడు - ప్రకాశం  24
చిత్తూరు 24
మొత్తం 96

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement