Morning Top News:
ఆ ఉద్యోగులకు బిక్ షాక్ ఇచ్చిన హైకోర్టు
మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అర్హతల వివాదంపై దొడ్డి దారిన జీవోలు జారీ చేసి ప్రభుత్వం నియామకాలు చేపట్టడం చెల్లదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హెల్త్ అసిస్టెంట్ సంబంధిత అర్హతలపై గతంలోనే సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించి జీవోలు విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం నియామకాలు చేపడితే అవి చెల్లుబాటు కావని హైకోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుల అనంతరం ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ప్రభుత్వం మరో జీవో తెచ్చి నియామకాలు చేపట్టడం సరికాదని హైకోర్టు పేర్కొంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఏపీ వక్ఫ్ బోర్డు రద్దు
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ బోర్డును (Waqf Board) రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో 47ను ఉపసంహరించింది. రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టినట్లు సర్కారు తెలిపింది. త్వరలోనే కొత్త వక్ఫ్ బోర్డు నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
నీటి వాటాలు దక్కించుకోవాలని సీఎం ఆదేశం
కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన రికార్డులు, ఉత్తర్వులు, అవసరమైన సాక్ష్యాధారాలన్నీ సిద్ధంగా ఉంచాలని నీటి పారుదల శాఖ అధికారులను, న్యాయ నిపుణులను అప్రమత్తం చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తాం: చంద్రబాబు
ఏపీలో బెల్ట్ షాపులు పెడితే తాను బెల్ట్ తీస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం జిల్లా నేమకల్లులో ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. తాము తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెచ్చామన్నారు. వైసీసీ హయాంలో కల్తీ లిక్కర్ విక్రయించి ప్రజల జేబులు గుళ్ల చేశారని విమర్శించారు. దందాలు చేస్తే నాయకులైనా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
పవన్‌ను అడ్డుకున్నదెవరు? : కన్నబాబు
కాకినాడ పోర్టుకు వెళ్లిన పవన్.. తనను కొందరు పోర్టుకు రాకుండా అడ్డుకున్నారని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి కన్నబాబు స్పందించారు. పవన్‌ను ఆపాలంటే ఆయనకంటే పై స్థాయి వ్యక్తి అయ్యుండాలని, మరి ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు ఆపాలని ప్రయత్నించారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే బియ్యం ఎగుమతులపై దృష్టిపెట్టారని కన్నబాబు ఆరోపించారు. పవన్ కల్యాణ్ వ్యవహారం అంతా అనుమానాస్పదంగా ఉందన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై రుణభారం ఎంతంటే..?
బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని హైడ్రా ఇళ్లు కూల్చేసింది. కానీ అవన్నీ అనుమతులు పొందిన లేఅవుట్లు. బ్యాంక్ మేనేజర్ ప్రభుత్వ వ్యవస్దలపైనే ఆధారపడి హోమ్ లోన్స్ ఇస్తారు. ఇప్పటివరకూ హైడ్రా కూల్చిన ఇళ్లకు ఇచ్చిన లోన్స్ మొత్తం 10వేల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. లోన్స్ తీసుకున్నవారు తిరిగి చెల్లించకపోతే బ్యాంక్ లలో డిపాజిట్ చేసిన ఖాతాదారులకు తిరిగి డబ్బు చెల్లించడం బ్యాంకులకు సవాలుగా మారుతుంది. బ్యాంకింగ్ వ్యవస్ద కుదేలైయ్యే అవకాశాలు ఉన్నాయి.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
విశ్వబ్రాహ్మణులకు ఊరట
విశ్వబ్రాహ్మణులకు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల గణన సర్వేలో తమ కుల ప్రస్తావన లేదని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. కంచరి, కమ్మరి, కంసాలి, వడ్ల, శిల్పిలను విశ్వబ్రాహ్మణ కులంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
తీరాన్ని తాకిన ఫెంగల్ తుపాను
'ఫెంగల్' తుపాను పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకింది. మహాబలిపురం - కరైకాల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ ప్రక్రియ దాదాపు 4 గంటలు పట్టే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది. తుపాను ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
బీసీసీఐ దెబ్బకు దిగొచ్చిన పీసీబీ
ప్రపంచంలోనే ధనిక బోర్డు బీసీసీఐతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు మరోసారి తెలిసి వచ్చింది. భారత్ రాకపోయిన ఛాంపియన్స్ ట్రోఫీని తమ దేశంలోనే నిర్వహిస్తామని ఇప్పటి వరకూ ప్రగల్భాలు పలికిన పీసీబీ అడుగు వెనక్కి వేసింది. హైబ్రీడ్ పద్ధతిలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు అంగీకారం తెలిపింది. పీసీబీతో చర్చలు జరిపిన ఐసీసీ.. ఈ ట్రోఫీ హైబ్రీడ్ పద్ధతిలోనే జరుగుతుందని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
భారత యువతకు నరకంగా అగ్రరాజ్యం
అమెరికా రాను రాను భారత యువతకు నరకంగా మారుతోంది. అవకాశాలు రూ. కోటి ఖర్చు పెట్టుకుని తిరిగి ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.అమెరికాలో ఎంఎస్చేయడానికి వెళ్లిన వారి లక్ష్యం చదువు కాదు.. అక్కడ చదువుకుంటూనే ఉద్యోగం సాధించడం లక్ష్యం. గతంలో ఇలా అమెరికా వెళ్లిన వారికి ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఇప్పటికే ఉన్న వారికి సమస్యలు వస్తున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..