AP Government Cancelled Waqf Board: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వక్ఫ్ బోర్డును (Waqf Board) రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో 47ను ఉపసంహరించింది. రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టినట్లు సర్కారు తెలిపింది. త్వరలోనే కొత్త వక్ఫ్ బోర్డు నియమించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించింది. కాగా, వైసీపీ హయాంలో వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తూ జగన్ ప్రభుత్వం జీవో 47 జారీ చేసింది. అయితే, వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించగా బిల్లు రద్దు చేసింది. అటు, కేంద్ర ప్రభుత్వం సైతం ఇటీవల వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించి సవరణ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చింది. ఈ బిల్లును కూటమి పార్టీలు సమర్థించగా ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. ఏపీలో వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకించింది.
ఆ చట్ట సవరణకు ఆమోదం
మరోవైపు, ఏపీలో న్యాయాధికారుల ఉద్యోగ విరమణ వయసు చట్ట సవరణకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదముద్ర వేశారు. దీంతో న్యాయాధికారుల ఉద్యోగ విరమణను 61 ఏళ్లకు పెంచుతూ చేసిన చట్ట సవరణకు ఆమోదం పడింది. ఈ మేరకు సవరించిన చట్టాన్ని గెజిట్‌లో ప్రచురించాలని న్యాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా, రాష్ట్రంలో జ్యుడీషియల్ అధికారుల పదవీ విరమణ వయసును 60 నుంచి 61కి పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13న సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఆమోదముద్ర వేశారు. అనంతరం గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపించారు. తాజాగా, ఉద్యోగ విరమణ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు.
Also Read: PDS Rice At Kakinada Port: బియ్యం ఎగుమతుల్లో బినామీల బాగోతం, కాకినాడ పోర్టులో ఏం జరుగుతోంది?