Telangana High Court verdict on Recruitment of Multi Purpose Health Assistant | హైదరాబాద్: మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ నోటిఫికేషన్‌ అర్హతల వివాదంపై దొడ్డి దారిన జీవోలు జారీ చేసి ప్రభుత్వం నియామకాలు చేపట్టడం చెల్లదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హెల్త్ అసిస్టెంట్ (2002) సంబంధిత అర్హతలపై గతంలోనే సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించి జీవోలు విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం నియామకాలు చేపడితే అవి చెల్లుబాటు కావని హైకోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుల అనంతరం పరిస్థితులు కుదుటపట్టాక, తీర్పులను ఉల్లంఘిస్తూ ప్రభుత్వం మరో జీవో తెచ్చి నియామకాలు చేపట్టడం సరికాదని హైకోర్టు పేర్కొంది. 


కోర్టు తీర్పుతో తొలగింపు, మళ్లీ విధుల్లోకి ఉద్యోగులు


గతంలో కోర్టు ఉత్తర్వులతో 1200 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ లను తొలగించాలరు. అయితే కోర్టు తీర్పులకు విరుద్ధంగా మరో జీవో 1207 తీసుకొచ్చి ఆ తొలగించిన 1200 మందిని కాంట్రాక్ట్ పద్ధతిలో తిరిగి విధుల్లోకి తీసుకోవడం చట్ట విరుద్ధమని పేర్కొంది. అదే సమయంలో కోర్టు తీర్పుల స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం సరికాదని, చట్టానికి విరుద్ధంగా చేసిన చర్యగా అభివర్ణించింది. కోర్టు తీర్పులను ఉల్లంఘించి, రూల్స్ అతిక్రమించి ప్రభుత్వాలు ఆ విధంగా ఉద్యోగులను నియమించుకుంటే అది మరో పెద్ద వివాదానికి కారణం అవుతుందని అభిప్రాయపడింది. పోనీలే అనుకుని కోర్టులు ఆ జీవోను సమర్థి్స్తే రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పునే కోర్టులు పునరావృతం చేసినట్లు అవుతుందని రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికైనా 3 నెలల్లోగా అర్హులతో జాబితా సిద్ధం చేసి నియామక ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


గతంలోనే వారిని తొలగించిన అప్పటి ప్రభుత్వం


2002లో ప్రభుత్వం మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే అభ్యర్థుల అర్హతకు సంబంధించిన వివాదం తలెత్తింది. అభ్యర్థుల అర్హతకు సంబంధించి ట్రైబ్యునల్, హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎస్ఎస్‌సీ గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిప్లొమా ఇన్ హెల్త్ అసిస్టెంట్ అర్హతగా పరిగణించాలని హైకోర్టు గతంలోనే తీర్పు వెలువరించింది. ఆ తీర్పు మేరకు మెరిట్ జాబితాను సిద్ధం చేయాలని అప్పటి ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా దిగువ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో అర్హత లేని 1200 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్‌లను తొలగిస్తూ అప్పటి ప్రభుత్వం 2012లో జీవో సైతం జారీ చేసింది.



Also Read: Current Affairs: పోటీ పరీక్షలకు స్పెషల్ కరెంట్ అఫైర్స్ - ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి 


బాధితులకు న్యాయం ఓకే, చట్టాలను పాటించకపోతే ఎలా అని కోర్టు ప్రశ్న


తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేయడంతో అప్పటి కేబినెట్ సానుకూలంగా స్పందించింది. కోర్టు తీర్పుతో ఉద్యోగాల నుంచి తొలగించిన 1200 మందిని 2013లో కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటూ జీవో 1207 జారీ చేసింది. కానీ కోర్టు తీర్పులను ఉల్లంఘించి దొడ్డిదారిన కొత్త జీవోలు తీసుకొచ్చి, వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవడం చట్ట విరుద్ధమని.. వారి నియామకం చెల్లదంటూ హైకోర్టు షాక్ ఇచ్చింది.