హైడ్రా కూల్చివేతలు కొన్ని నెలల నుంచి కలకలం రేపుతున్నాయి. బాధితుల నిరసన, ప్రతిపక్షాల ఆందోళనతో కొన్ని రోజులపాటు హైడ్రా సైలెంట్ అయింది. ఇటీవల మళ్లీ కూల్చివేతలు చేపట్టింది. అయితే ఇళ్లు లేకున్నా ఈఎంఐ కట్టాల్సి వస్తోందని బాధితులు చెబుతున్నారు. తమకు కనీసం ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఇందిరమ్మ ఇండ్లు అయినా ఇవ్వాలని కొందరు అడుగుతుంటే, నష్టపరిహారం చెల్లించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే అధికారులు ఇచ్చిన అనుమతితో, బ్యాంకుల నిర్ధారించి లోన్ ఇచ్చిన తరువాత ఇల్లు కట్టుకున్నామని చెబుతున్నారు. దీనిపై ఏబీపీ దేశం పలు విషయాలు ఇక్కడ ఎక్స్‌క్లూజివ్‌గా అందిస్తోంది.


ABP Desam: హైడ్రా కూల్చివేతల వల్ల హోమ్ లోన్స్ ఇచ్చిన బ్యాంక్ లు నష్టపోతున్నాయా.. బ్యాంకులపై ఎంత భారం పడే అవకాశం ఉంది ?


రాంబాబు (ఆల్ ఇండియా బ్యాంకర్స్ అసోసియేషన్ కార్యదర్శి) : మున్సిపల్, జిహెచ్ ఎంసీ, హెచ్ ఎండిఏ ఇలా వీటి అనుమతి ఉన్న లేఅవుట్ లో నిర్మించిన ఇళ్లకు మాత్రమే బ్యాంక్ లు హోమ్ లోన్స్ ఇస్తాయి. లోన్ కోసం బ్యాంక్ వద్దకు వస్తే, బ్యాంక్ ఏర్పాటు చేసిన ఓ న్యాయవాది వద్ద లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. లీగన్ ఒపీనియన్ ఇచ్చే న్యాయవాది బార్ కౌన్సిల్ గుర్తింపు పొందిన వ్యక్తి. ప్రభుత్వ వ్యవస్దలు ఇచ్చిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ను క్షేత్రస్దాయికి వెళ్లి పరిశీలించిన తరువాత ఆ టైటిల్ డీడ్ అనేది బ్యాంక్ కు ట్రాన్స్‌ఫర్ అవుతుంది అనే ఒపీనియన్ ఇచ్చిన తరువాత మాత్రమే లోన్ తీసుకునేందుకు అనుమతి లభిస్తుంది.


బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని హైడ్రా ఇళ్లు కూల్చేసింది. కానీ అవన్నీ అనుమతులు పొందిన లేఅవుట్లు. బ్యాంక్ మేనేజర్ ప్రభుత్వ వ్యవస్దలపైనే ఆధారపడి హోమ్ లోన్స్ ఇస్తారు. మేనేజర్ ఎక్కడా క్షేత్రస్దాయికి వెళ్లరు. ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులు అక్రమం ఎలా అవుతాయి. ఇప్పటివరకూ హైడ్రా కూల్చిన ఇళ్లకు ఇచ్చిన లోన్స్ మొత్తం 10వేల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. లోన్స్ తీసుకున్నవారు  తిరిగి చెల్లించకపోతే బ్యాంక్ లలో డిపాజిట్ చేసిన ఖాతాదారులకు తిరిగి డబ్బు చెల్లించడం బ్యాంకులకు సవాలుగా మారుతుంది. బ్యాంకింగ్ వ్యవస్ద కుదేలైయ్యే అవకాశాలు ఉన్నాయి. స్దలం మీద హక్కులేదు, ఇళ్లు లేదు కాబట్టి రికవరీ చేయడం బ్యాంకులకు అంత ఈజీ కాదు. ఇవన్నీ చట్టరీత్యా తేలాల్సిన అంశాలు.




ABP Desam: హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి  తిరిగి చెల్లించకపోతే బ్యాంకులు ఏం చేస్తాయి. వసూలు విధానం ఎలా ఉంటుంది.?


రాంబాబు: హైడ్రా ఎందుకు కూల్చింది అనే వివాదంలోకి బ్యాంక్ వెళ్లదు. లోన్ తీసుకున్న సమయంలో బ్యాంక్ కు ఇచ్చిన అగ్రిమెంట్ ను మాత్రమే చూస్తుంది. ఇప్పుడున్న పరిస్దితుల్లో గ్యారెంటీ ఉన్న  వ్యక్తి వద్ద నుండి లొన్ వసూలు చేసేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తాయి. ఇవ్వకపోతే కోర్టకు వెళ్లి చర్యలు తీసుకుంటాయి. లోన్ తీసుకున్న వ్యక్తి ఉద్యోగి అయితే ఆ కంపెనీని సంప్రదించి వసూలు చేస్తాయి. ఇతర ఆస్తులు, గ్యారెంటీ ఉన్నవారి ఆస్తులు జప్తు చేస్తారు. ఎట్టి  పరిస్దితుల్లోనూ లోన్ రికవరీ చేయకుండా బ్యాంకులు వదిలిపెట్టవు. ఇదే హైడ్రా బాధితులకు సైతం వర్తిస్తుంది.  


ABP Desam: ఇంటిని తనఖా పెట్టుకుని మీరు లోన్ ఇచ్చారు. హైడ్రా బాధితులకు ఇప్పుడు ఇళ్లే లేదు. బాధితులపై ఎందుకు చర్యలు తీసుకుంటారు..?


రాంబాబు: ఇళ్లు కూల్చేసినా, లోన్ తీసుకునే సమయంలో బాధితులు ఇచ్చిన టైటిల్ డీడ్ బ్యాంక్ వద్ద ఉంటుంది. కానీ ఇప్పడు ఆ టైటిల్ డీడ్ చెల్లదని హైడ్రా అంటోంది. ఈ ప్రత్యేక పరిస్దితుల్లో చట్టం దీనికి ఒప్పుకుంటుందా.. ఒకవేళ లోన్ కట్టకపోతే బ్యాంక్ లు డిపాజిట్ దారులకు సమయానికి డబ్బు చెల్లించలేవు. కాబట్టి లోన్ కట్టకపోతే బ్యాంక్ లు కోర్టుకు వెళతాయి. వసూలు చేసుకునేందు తమ వద్ద ఉన్న వ్యవస్దను పూర్తి స్థాయిలో ఉపయోగిస్తాయి. 



ABP Desam: బ్యాంక్ లకు సవాలుగా మారిన హైడ్రా కూల్చివేతలను బ్యాంకులు  ప్రత్యేకంగా పరిగణిస్తాయా...?


రాంబాబు: ఇలాంటి పరిస్దితులు దేశంలో గతంలో ఎప్పుడూ జరగలేదు. పార్టీలు మారినప్పుడుల్లా గత ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులు తప్పు అంటే కోర్టులు సమర్ధించే అవకాశాలు తక్కువ. హైడ్రాను బ్యాంక్ లు ప్రత్యేకంగా పరిగణించవు. రాని బాకీల క్రింద ఏర్పడన తరువాత సూట్ ఫైల్ అకౌంట్స్ కూడా ఫెయిల్  అయిన తరువాత డిక్రీలు కూడా ఎగ్జికూట్ కాని పరిస్దితులలో మాత్రమే  లోన్ రద్దు అవుతుంది.


ABP Desam: హైడ్రా కూల్చిన ఇళ్లకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ అధికారులే లోన్స్ కట్టించాలనే ప్రశ్నలకు మీరు ఏమంటారు?


రాంబాబు: అన్ని అనుమతులు ఉన్నాయని, అడ్వకేట్ ద్రువీకరీస్తారు. దానికి ఆధారాలను జతచేస్తారు. అధికారులు ఇచ్చిన అనుమతులు ఇప్పుడు కాదంటే కోర్టులో చెల్లదు. ప్రభుత్వరంగ సంస్దలైనా, ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు ఆధారంగానే హోమ్ లోన్స్ ఇస్తాయి. కూల్చిన అన్ని ఇళ్లకు అనుమతులు ఉన్నాయి. లేఅవుట్ అనుమతులు, రిజిస్ట్రేషన్ చేసిన అధికారులే దీనికి బాధ్యులు. వీళ్లే లోన్ రీపే (Loan RePay) చేయాలనేది న్యాయబద్దమైన డిమాండ్. ఈ దిశగా ముందుకు వెళితే హైడ్రా బాధితులకు కోర్టులు న్యాయం చేసే అవకాశం ఉంది. 



Also Read: Telangana News: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు