Morning Top News:


నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు ఈ రోజు(శుక్రవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఓ జాతీయ మీడియా నిర్వహించనున్న లీడర్‌షిప్‌ సదస్సులో బాబు పాల్గొంటారు. అయితే సీఎం ఈ ఉదయం అసెంబ్లీ సమావేశాలకు హాజరై మధ్యాహ్నం ఒంటిగంటకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి 1.30 గంటలకు ఢిల్లీకి ప్రయాణమవుతారు. ఈ పర్యటనలో కేంద్ర ఆర్థికమంత్రి సహా పలువురు మంత్రులను సీఎం చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ


లగచర్ల దాడి ఘటనలో పోలీసులు తాను పేర్కొంటున్నట్లు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టు పూర్తిగా తప్పని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం  జైలు నుంచి సంచలన లేఖ విడుదల చేశారు. నేను ఎవరి పేరూ చెప్పలేదు. కావాలనే అలా రిమాండ్ రిపోర్ట్ సృష్టించారన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..



డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతల స్వీకరణ
 ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎంత సంచలనం సృష్టించిందో.. రాజకీయాల్లో డిప్యూటీ స్పీకర్‌ రఘురామ అంత సంచలనం సృష్టించాలని సీఎం చంద్రబాబు అన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు చేపట్టిన తర్వాత అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. తెలుగుబిడ్డగా పంచెకట్టులో వచ్చిన రఘురామ.. స్పీకర్‌ స్థానానికి నిండుతనం తీసుకొచ్చారు. కొత్త పదవిలో ఆయన్ని చూస్తే సంతోషంగా ఉందన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. విజయనగరం స్థానిక సంస్థల ఉప ఎన్నికను రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని హైకోర్టు పేర్కొంది. ఈనెల 28వ తేదీ ఈ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? : కేటీఆర్‌
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన సొంత నియోజకవర్గంపై కూడా పట్టులేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొడంగల్ లో ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. తాము సీఎం నియోజకవర్గంలోనే కలెక్టర్ పై దాడి చేసేంత బలమైన వ్యక్తులమా? అని నిలదీశారు. ఫోర్త్ సిటీ, ఏఐ సీటి అని సీఎం రేవంత్ మాటలు చెబుతున్నారు.. కానీ అవి సాధ్యం కాదన్నారు. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


అవినాష్‌ను జగన్ వదులుకోవాల్సిందేనా..?

 ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియా కేసులు వైసీపీకి కొత్త తలనొప్పులు తెస్తున్నాయి. అరెస్టు అవుతున్న వారంతా వైసీపీకి, వైసీపీ ముఖ్య నేతలకు ఆత్మీయులే కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. అలాగని వారిని గట్టిగా సమర్థించలేకపోతున్నారు. కొంత మంది అసలు తమ పార్టీ నేతలు అని చెప్పుకోవడానికి జంకే పరిస్థితి వస్తోంది. ఆస్తుల వివాదంలో ఇప్పటికే కుటుంబంలో అవినాష్ రెడ్డి వైపు బంధువులు తప్ప జగన్ కు అందరూ దూరమయ్యారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా కేసుల వల్ల అవినాష్ రెడ్డినీ జగన్ దూరం పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది. ఇది వైసీపీ అధినేతను కలవరపాటుకు గురి చేస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

కాంగ్రెస్ రిస్క్ చేస్తోందా..

తెలంగాణ రాజకీయాల్లో అరెస్టులు ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడంట్ కేటీఆర్ అరెస్ట్ అన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్‌పై త్వరలో తాము బాంబులు వేయబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రటించిన తర్వాత అది మొదటగా కేటీఆర్ పైనే పడుతుందన్న సంకేతాలు వచ్చాయి. బీఆర్ఎస్ కూడా కేటీఆర్ అరెస్టును అలాగే ఉపయోగించుకునేలా ప్రణాళిక సిద్దం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

బోరుగడ్డ వివాదం.. మరోసారి పోలీసులు సస్పెండ్

గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ గురువారం అరండల్ పేట పోలీస్ స్టేషన్కు సంబంధించిన ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు. బోరుగడ్డ అనిల్ అరండల్ పేట పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉన్న సమయంలో అధికారులు నిబంధనలను ఉల్లంఘించి అనిల్ మేనల్లుడిని లోనికి అనుమతించారు. ఈ అంశంలో హెడ్ కానిస్టేబుళ్లతో పాటు ఒక కానిస్టేబుల్ ప్రమేయం ఉండటంతో సస్పెండ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 


సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన


సీఎం రేవంత్ రెడ్డి   తెరపైకి కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితిని తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఎన్‌సీఈఆర్‌టీలో విద్యార్థులు నిర్వహించిన అండర్ - 18 మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో ఆయన గురువారం పాల్గొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


 ఖలీస్థానీ సపోర్టర్ల కొత్త డిమాండ్


కెనడాలో ఖలీస్థానీ సపోర్టులు ఇప్పుడు కొత్త వాదన తెరపైకి తెచ్చారు.  కెనడా మాదే అని, అక్కడ ఉంటున్న తెల్ల జాతీయులంతా యూరోప్‌కు..ఇజ్రాయిల్‌‌కు వెళ్లిపోవాలని అంటున్నారు. ఈ డిమాండ్‌తో ఖలీస్థానీలు నిర్వహించిన ఓ ర్యాలీలో చేసిన డిమాండ్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..