తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలువు అధికారులను విచారించి అరెస్టు చేశారు. లీడర్లకి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెప్పారు. ఈ మధ్య ఒకరిద్దర్ని విచారించారు. ఇంతలో మరో సంచలన నమోదు అయింది. ఇప్పుడు ఏకంగా మాజీ మంత్రి హరీష్‌రావుపైనే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయింది. ఫోన్ ట్యాప్ చేసి అక్రమ కేసులు పెట్టి వేధించారని చక్రధర్ అనే వ్యక్తి మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు



వైసీపీ లీడర్ ద్వారంపూడికి బిగ్ షాక్- ఫ్యాక్టరీ సీజ్‌ చేసిన పీసీబీ
వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి కాలుష్య నియంత్రణ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన రొయ్యల ఫ్యాక్టరీని సీజ్ చేశారు. అక్కడి నుంచి వ్యర్థాలను బయటకు వదులుతున్నారని నిర్దారించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి... ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ఈ పేరు కేంద్రంగా కాకినాడలో చాలా కాలం నుంచి రాజకీయాలు నడుస్తున్నాయి. వైసీపీలో కీలక వ్యక్తిగా ఎదిగిన ఆయన వివాదాలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా  ఉన్నారు. పూర్తి వివరాలు


మృతదేహాలు అప్పగించండి - ఏటూరు నాగారం ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు కీలక కామెంట్స్
రెండు రోజుల క్రితం ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ హైకోర్టు కీలక కామెంట్స్ చేసింది. విష ప్రయోగం చేసి మావోయిస్టులను చంపేశారన్న పిటిషన్లపై ఇవాళ విచారణ జరిపింది. కోర్టు ఆదేశాల మేరకు మృతదేహాలను ఇంకా బంధువులకు అప్పగించకుండా ఫ్రీజర్స్‌లో ఉంచారు. దీనిపై స్పందించిన కోర్టు... మృతుల బంధువులకు లాంటి అభ్యంతరం లేకపోతే వాటిని అప్పగించ వచ్చని ఆదేశాలు ఇచ్చింది. అనంతరం కేసు విచారణను ఐదో తేదీకి వాయిదా వేసింది. పూర్తి వివరాలు


పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్
తెలంగాణలో త్వరలోనే పంచాయతీ ఎన్నికలకు నగరా మోగనుంది. అయితే అది బీసీ కులగణన తర్వాతే. అందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణలో 12,992 పంచాయతీలు ఉన్నాయి. సర్పంచ్ కాల పరిమితి ముగియడంతో స్పెషల్ ఆఫీసర్ పాలనలో పంచాయతీలు నడుస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల పెంచుతామని కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల హమీ ఇవ్వడంతో అందుకు తగ్గట్టుగా ఇప్పుడు బీసీ కుల గణన జరుగుతోంది. పూర్తి వివరాలు


'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు
తెలంగాణ హైకోర్టులో 'పుష్ప 2' చిత్రానికి వ్యతిరేకంగా ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. ఆ కేసులో చిత్ర బృందానికి ఊరట లభించింది. అంతే కాదు... ఇప్పుడీ సినిమా విడుదలకు ఎటువంటి అడ్డంకులు లేవు. లైన్ క్లియర్ అయిందని చెప్పాలి అసలు కేసు ఏమిటి? ఏమైంది?. 'పుష్ప 2: ది రూల్' సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. దాని ప్రకారం విడుదలకు ముందు రోజున వేసే పెయిడ్ ప్రీమియర్లకు టికెట్ రేటు మీద 800 పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. పూర్తి వివరాలు