Mulugu Encounter News Today: రెండు రోజుల క్రితం ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ హైకోర్టు కీలక కామెంట్స్ చేసింది. విష ప్రయోగం చేసి మావోయిస్టులను చంపేశారన్న పిటిషన్లపై ఇవాళ విచారణ జరిపింది. కోర్టు ఆదేశాల మేరకు మృతదేహాలను ఇంకా బంధువులకు అప్పగించకుండా ఫ్రీజర్స్‌లో ఉంచారు. దీనిపై స్పందించిన కోర్టు... మృతుల బంధువులకు లాంటి అభ్యంతరం లేకపోతే వాటిని అప్పగించ వచ్చని ఆదేశాలు ఇచ్చింది. అనంతరం కేసు విచారణను ఐదో తేదీకి వాయిదా వేసింది.
ములుగు జిల్లాలో రెండు రోజుల క్రితం సంచలనం సృష్టించిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తైంది. ఏటూరు నాగారం ప్రాంతీయ ఆస్పత్రిలో కాకతీయ వైద్య కళాశాల డాక్టర్ల బృందం పర్యవేక్షణలో పోస్ట్ మార్టం జరిగింది. ఇందులో ఆరుగురికి మాత్రమే పోస్ట్ మార్టం నిర్వహించగా, మహిళ మావోయిస్టు యమునకు పోస్ట్ మార్టం నిర్వహించలేదు. ఎన్ కౌంటర్ పై పౌర హక్కుల సంఘాలు అనుమానులు ఉన్నాయని మావోయిస్టులపై విషప్రయోగం చేసి చంపారని హై కోర్టుకు వెళ్ళారు. దీంతో మంగళవారం వరకు మృత దేహాలను భద్రపరచాలి హై కోర్టు అదేశించింది. హై కోర్టు ఆదేశాలతో పోలీస్ లు మృత దేహాలను ఫ్రీజర్ లో భద్రపరిచారు.
Also Read: నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య - ప్రిన్సిపాల్‌ను పరిగెత్తించి కొట్టిన పేరెంట్స్, బంధువులు
పోలీస్‌ల తరుపు న్యాయవాది... హక్కుల సంఘాల తరుపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది. మృతదేహాలను అప్పగించాలని నిన్నటి నుంచే బంధువులు ఆసుపత్రికి చేరుకొని ఎదురు చూస్తున్నారు.
ఏటూరు నాగారం భారీ బందోబస్తు...
ఏటూరు నాగారం ఆస్పత్రిలో మావోయిస్టుల మృతదేహాలను భద్రపర్చడంతో పోలీస్ బలగాలు భారీగా మోహరించారు. అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతుంది. ఏటూరు నగరంలోకి అడుగుపెట్టే ప్రతి వాహనాన్ని పోలీస్ తనిఖీ చేస్తున్నారు. నార్మల్‌గా తిరిగే పబ్లిక్‌ను సైతం ప్రశ్నిస్తున్నారు. వివరాలు సేకరిస్తున్నారు. ఓవైపు మావోయిస్టుల మృతదేహాలు ఆస్పత్రిలో ఉండడంతోపాటు పిఎల్జిఏ వారోత్సవాలు కొనసాగుతూ ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు.
మృత దేహాలు పూర్తిగా గాయాలతో నిండి ఉన్నాయని. ముట్టు కుంటే శరీరం ఊడిపోయే విధంగా మృతదేహాలు ఛిద్రమై ఉన్నాయని మధు భార్య తెలిపారు. ఇది ఎన్ కౌంటర్ కాదని విష ప్రయోగం చేసి చిత్ర హింసలకు గురిచేసి చంపారని ఆరోపించారు.
Also Read: రైతు మొహంపై గాండ్రించిన మచ్చల పులి- తర్వాత ఏమైందీ.