ఒకవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’, మరో వైపు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నట సింహం బాలయ్య యాక్షన్ ఫిల్మ్ ‘డాకు మహారాజ్’ వంటి పవర్ ఫుల్ సినిమాలు ఉన్నా... కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి అసలు సిసలైన ఎంటర్‌టైనర్ ఇదేనంటూ ‘సంక్రాంతికి వస్తున్నాం’తో దిగుతున్నాడు. హిలేరియస్ ఎంటర్‌టైనర్స్‌తో అపజయమెరుగని దర్శకుడిగా దూసుకెళుతోన్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సక్సెస్‌పుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజుకు చెందిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ‘గేమ్ చేంజర్’ సినిమాను కూడా ఇదే సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతి బరిలో ఉన్న ఈ రెండు చిత్రాలకు సంబంధించి ప్రస్తుతం మ్యూజిక్ ప్రమోషన్స్‌ని నిర్వహిస్తున్నారు. రీసెంట్‌గా ‘గేమ్ చేంజర్’ నుండి మూడో పాట ‘నానా హైరానా’ ను వదిలిన మేకర్స్.. మంగళవారం ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుండి ఫస్ట్ సింగిల్ ‘గోదారి గట్టు మీద’ను వదిలారు.
ఈ పాట స్పెషల్ ఏమిటంటే... రమణ గోగుల. ఆయన వాయిస్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు తన సంగీతంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన రమణ గోగుల..చాలా కాలం నుండి కామ్‌గా ఉంటున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఆయన సింగర్‌గా ఈ సినిమాకు పాట పాడటం విశేషం. అందుకే ఈ పాట తెలుగు ప్రేక్షకులకు చాలా చాలా స్పెషల్‌గా మారింది. ఆ స్పెషల్‌ని ఒక వారం నుండి మేకర్స్ చిన్న చిన్న గ్లింప్స్‌తో పరిచయం చేస్తూనే ఉన్నారు. రమణ గోగుల హమ్మింగ్ స్పెషల్‌గా సాగిన ఈ పాటకు, మరో స్వచ్ఛమైన తెలుగు సింగర్ మధు ప్రియ ఇచ్చిన వాయిస్ కూడా ఈ పాటను ఎక్కడికో తీసుకెళ్లింది. ఇంకా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత కూల్ సంగీతంతో, అర్థవంతమైన సాహిత్యంతో ఒక అందమైన పాట విన్న ఫీలింగ్ కలుగుతుంది. మరో కోణంలో చెప్పాలంటే చెవుల్లో అమృతం పోసినట్లుగా.. రిపీటెడ్ మోడ్‌లో వినాలనిపించేంత హాయిగా ఉంది. పాటని గమనిస్తే...
Also Read: పుష్ప 2 సెన్సార్ బోర్డు రివ్యూ... అల్లు అర్జున్ సినిమాలో హైలైట్స్ ఏంటో తెలుసా?
‘‘గోదారి గట్టుమీద రామసిలకవే..
గోరింటాకెట్టుకున్న సందమామవే..
ఊరంతా సూడు.. ముసుగే తన్ని నిద్దరపోయిందే
ఆరాటలన్నీ తీరకపోతే.. ఏం బాగుంటుందే
నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడ దిక్కువే..
నీ తోటి.. కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే..’’ అని మొగుడు అంటే..
‘‘గోదారి గట్టు మీద రామసిలకనే..
గీ పెట్టి గింజుకున్నా నీకు దొరకనే..’’ అంటూ భార్య ఆటపట్టిస్తుంటే వారిద్దరి మధ్య సరసం వర్ణించడానికి సందమామలు, రామసిలకలేగా కావాల్సింది. రచయిత భాస్కరభట్ల రవికుమార్ భార్యభర్తల మధ్య సరస సన్నివేశాన్ని అందమైన పదాలతో అల్లితే.. అందే అందంగా భీమ్స్ సిసిరోలియో స్వరపరిచారు. రమణ గోగుల హమ్మింగ్ మళ్లీ మళ్లీ ఈ పాటని వినాలనిపించేంతగా ఉందంటే.. దర్శకుడు అనిల్ రావిపూడి టేస్ట్ ఏంటో అర్థమవుతోంది. జనవరి 14న సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో స్టోరీ లైన్ కూడా ముందుగానే చెప్పేశారు మేకర్స్. చూద్దాం మరి వారి నమ్మకం ఎంత వరకు కరెక్ట్ అవుతుందో..
Also Read: 'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?