తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుపతి లడ్డూ వివాదంలో నిజాలు నిగ్గుతేల్చే పని చేపట్టాలని సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల సూచించారు. దీన్ని రాజకీయంగా వాడుకోవడం కంటే కోట్ల మంది భక్తుల మనోభావాలు గుర్తించి వారి అనుమానాలు తీర్చే పనిచేయాలని హితవుపలికారు. ప్రస్తుతానికి వివాదం నడుస్తున్న తీరు చూస్తుంటే మాత్రం రాజకీయంగా వాడుకుంటున్నట్టు కనపిస్తోందని అన్నారు. అందుకే ఈ వివాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. పవిత్రమైన తిరుమలలో ఇంత పెద్ద వివాదం నడుస్తుంటే ఇన్ని రోజులు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
లడ్డూ వివాదంపై ప్రభుత్వం సీరియస్- సాయంత్రంలోపు రిపోర్ట్ ఇవ్వాలని చంద్రబాబు ఆదేశం!
తిరుమల లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. శ్రీవారి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలకు భంగం కలిగించిన వారి ఎవర్నీ వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వం హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు సాయంత్రం లోపు రిపోర్టు ఇవ్వాలని టీటీడీ ఈవోను ఆదేశించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు - 14 రోజుల రిమాండ్
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను (Jani Master) నార్సింగి పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్‌ను శుక్రవారం తెల్లవారుజామున గోవా నుంచి హైదరాబాద్ (Hyderabad) తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో విచారించారు. పలు కీలక అంశాలపై ఆరా తీశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటుకు నోటు కేసును బదిలీచేయాలన్న బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మాజీ మంత్రి పిటిషన్ ఎంటర్‌టైన్ చేయలేమని చెబుతూనే కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసును రేవంత్ ప్రభావితం చేస్తారనేది అపోహ మాత్రమేనంది. విచారిస్తున్న ఏబీసీ నేరుగా రేవంత్ రెడ్డికి కేసు విషయాలు రిపోర్టు చేయొద్దని సూచించింది. కేసు విషయంలో జోక్యం చేసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశించింది సుప్రీంకోర్టు. ఆయన ఏమైనా ప్రభావితం చేస్తే మాత్రం సుప్రీంకోర్టుకు తెలియజేయాలని పిటిషన్ జగదీష్‌రెడ్డికి సూచించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
వంద రోజుల్లో అన్ని వర్గాలను ఏపీ సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. వాటి నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇది నిజంగా అన్నింటి కంటే ఎక్కువ ఆశ్చర్యం కలిగించే డైవర్షన్ అని, దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకోవాలనే ఆలోచన ఉన్న చంద్రబాబు లాంటి అన్యాయమైన వ్యక్తి ఎవరూ ఉండరన్నారు. ఒకవైపున వంద రోజుల చంద్రబాబుపాలనపై ప్రజల్లో కోపం ఉంది. సూపర్ సిక్స్ స్కీమ్స్ ఏమయ్యాయని ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి