Sharmila On Laddu controversy: తిరుపతి లడ్డూ వివాదంలో నిజాలు నిగ్గుతేల్చే పని చేపట్టాలని సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల సూచించారు. దీన్ని రాజకీయంగా వాడుకోవడం కంటే కోట్ల మంది భక్తుల మనోభావాలు గుర్తించి వారి అనుమానాలు తీర్చే పనిచేయాలని హితవుపలికారు. ప్రస్తుతానికి వివాదం నడుస్తున్న తీరు చూస్తుంటే మాత్రం రాజకీయంగా వాడుకుంటున్నట్టు కనపిస్తోందని అన్నారు. అందుకే ఈ వివాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. 


పవిత్రమైన తిరుమలలో ఇంత పెద్ద వివాదం నడుస్తుంటే ఇన్ని రోజులు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో చెప్పడం చూస్తుంటే రాజకీయంగానే ఈ ఆరోపణలు చేశారనే అనుమానం కలుగుకుందన్నారు. చావుకబురు చల్లగా చెప్పినట్టు ఉందన్నారు. 


"తిరుమలలో లడ్డూ వివాదం చిన్న విషయం కాదు. జులై 12 న శాంపిల్స్ తీశారు. అదే రోజు బాబు సిఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు తీసుకున్న శాంపిల్స్ గత ప్రభుత్వం ఇచ్చిన నెయ్యి కాంట్రాక్టర్ వే. ఆ శాంపిల్స్‌లో బీఫ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ కంటెంట్స్ ఉన్నాయి అని రిపోర్ట్ వచ్చింది" అని చెప్పుకొచ్చారు. 


"తిరుమల లడ్డూ వివాదం సెంటిమెంట్‌కి సంబందించిన విషయం. ఇది తెలుసుకున్న దేశ విదేశాల్లో ఎంతో మంది భక్తులు ఆందోళనలో ఉన్నారు. - భక్తి శ్రద్ధలతో తిరుమల ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని తీసుకుంటారు. అలాంటి ప్రసాదాన్ని కల్తీ చేశారు. ఇంత పెద్ద విషయాన్ని ఇంతకాలం ఎలా క్యాజువల్‌గా తీసుకున్నారన్నారు. ఇప్పుడే ఎందుకు బయట పెట్టారని ప్రశ్నించారు. దీని సివియారిటీ బాబుకి ముందే తెలుసా? తెలిస్తే ఎందుకు ప్రజలకు చెప్పలేదు? జులై 23 న రిపోర్ట్ ఇస్తే ఎందుకు దాచారు. "


ఎప్పుడో విషయం తెలిస్తే ఇన్ని రోజులు దాచిపెట్టి వందల రోజుల పాలన సమావేశంలో చెప్పడాన్ని షర్మిల తప్పుపట్టారు. పాలనపై ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారని అందుకే డైవర్ట్ చేయడానికే ఈ వివాదాన్ని తెరిపైకి తీసుకొచ్చారా అని ప్రస్నించారు.  " మీ 100 రోజుల పాలన సమావేశంలో లడ్డూ వివాదాన్ని ఎందుకు చెప్పారు? మీ 100 రోజుల పాలన పై ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారు. ఈ విషయాన్ని గమనించి ఇష్యు డైవర్ట్ చేశారా? వైసిపి మీద బురద చల్లుతున్నారా? మీరు ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు. మీరు లైట్ తీసుకున్నా మేము మాత్రం వదిలి పెట్టం." అని హెచ్చరించారు. 
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ కోరతామన్నారు షర్మిల. దీనిప కేంద్ర హోంశాఖ మంత్రికి లెటర్ రాస్తామన్నారు. " కేంద్ర హోం శాఖ మంత్రికి లెటర్ రాస్తున్నాం. తిరుమల లడ్డూ కల్తీపై CBI విచారణ జరగాలి. లడ్డూ కల్తీపై మేం గవర్నర్‌ను కలుస్తాం.