Note For Vote Case: ఓటుకు నోటు కేసును బదిలీచేయాలన్న బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మాజీ మంత్రి పిటిషన్ ఎంటర్‌టైన్ చేయలేమని చెబుతూనే కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసును రేవంత్ ప్రభావితం చేస్తారనేది అపోహ మాత్రమేనంది. విచారిస్తున్న ఏబీసీ నేరుగా రేవంత్ రెడ్డికి కేసు విషయాలు రిపోర్టు చేయొద్దని సూచించింది.  


కేసు విషయంలో జోక్యం చేసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశించింది సుప్రీంకోర్టు. ఆయన ఏమైనా ప్రభావితం చేస్తే మాత్రం సుప్రీంకోర్టుకు తెలియజేయాలని పిటిషన్ జగదీష్‌రెడ్డికి సూచించింది.  ఈ కేసు విచారణ సందర్భంలోనే కనీసం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్డితో పర్యవేక్షణలోనైనా విచారణ చేయాలన్న జగదీష్ అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది.


Also Read: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్