మద్దతిస్తే మైనార్టీలకు కోపం - ఇవ్వకపోతే బీజేపీకి ఆగ్రహం! యూసీసీపై వైసీపీ విధానమేంటి?


ఉమ్మడి పౌరస్మృతి చట్టం దిశగా కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. దానిలో భాగంగా.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రం బిల్లును తీసుకురానుంది. ఈ మేరకు.. న్యాయవ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని పౌరులు అందరికీ ఒకే చట్టం ఉండాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. దేశ ప్రజలందరికీ ఒకే పౌర చట్టాన్ని తీసుకురావాలనే యోచనలో ఉంది. అందుకే.. ఉమ్మడి పౌరస్మృతి చట్టానికి సంబంధించి వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు తీసుకురావాలని చూస్తోంది మోదీ సర్కార్‌. ఇంకా చదవండి


ఉజ్జయిని మహాంకాళి బోనాలు ప్రారంభం, మంత్రి తలసాని కుటుంబం తొలిబోనం


ఉజ్జయినీ మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఆషాఢ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తొలి బోనం సమర్పించారు. ఆయన కుటుంబసభ్యులతో కలిసి నేడు (జూలై 9) వేకువజామున 3.30 గంటలకే ఆలయానికి చేరుకుని, కుటుంబ సమేతంగా బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి కుటుంబానికి పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని మంత్రి, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. నేడు, ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్సీ కవిత మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఆదమయ్య నగర్‌ కమాన్‌ వద్ద పూజల్లో పాల్గొంటారు. ఇంకా చదవండి


గోదావరి జిల్లాల నుంచే వైసీపీ పతనం ప్రారంభం- వారాహి విజయయాత్ర కమిటీలతో భేటీలో పవన్ కళ్యాణ్


జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించారు. జులై తొమ్మిదో తేదీ సాయంత్రం ఏలూరులో బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు జనవాణి కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు ఏలూరు నియోజక వర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం అవుతారు. ఇక పదకొండో తేదీన మధ్యాహ్నం 12 గంటలకు  దెందులూరు నియోజక వర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం జరుగుతుంది. ఇంకా చదవండి


నా కడుపులో కత్తులు దింపిన వారిని క్షమిస్తున్నాను- అక్బరుద్దీన్ ఒవైసీ సంచలనం


ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచల వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను చంపేందుకు ప్రయత్నించిన వారిని క్షమిస్తున్నానని ప్రకటించారు. ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్న సందర్భంగా ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. తనను హత్య చేసేందుకు యత్నించిన వారిని క్షమిస్తున్నానని ప్రజల సమక్షంలో ప్రకటిస్తున్నానంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సలాలా బార్కాస్‌లో ఒవైసీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కు చెందిన 11వ పాఠశాల భవనాన్ని అక్బరుద్దీన్ ఒవైసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అక్బరుద్దీన్.. క్షమించడం, విద్యను అందించడం లాంటి విషయాలు మనుషుల మధ్యను ప్రేమను పెంచి అంతా ఐక్యమత్యంగా చేసేందుకు దోహదం చేస్తాయన్నారు. ఇంకా చదవండి


రూ.20 వేల కోట్లు గుజరాత్ కు! తెలంగాణకు మాత్రం రిపేర్ షాప్- ప్రధాని మోదీకి కేటీఆర్ కౌంటర్


కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల 45 ఏళ్ల కల, డిమాండ్ అని.. తెలంగాణకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ సభలో రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు, చవాకులు పేలారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. గుజరాత్ కి 20 వేల కోట్ల లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఇచ్చిన ప్రధాని, 520 కోట్ల రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం రాష్ట్ర ప్రజలను అవమానించడమే అన్నారు. దేశ చరిత్రలోనే అత్యధిక నిరుద్యోగం సృష్టించిన ప్రధాని మోదీ అని, 9 ఏళ్లలో దేశ యువత కోసం చేసిన ఒక్క మంచి పనైనా ప్రధాని చెప్తే బాగుండేదంటూ సెటైర్లు వేశారు. ఇంకా చదవండి


'సలార్' 2000 కోట్లు కలెక్ట్ చేస్తుందన్న సప్తగిరి - ప్రభాస్ ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు


భారతీయ బాక్సాఫీస్ బరిలో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించిన చిత్రం ఏది? మన తెలుగు హీరో, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో వచ్చిన 'బాహుబలి 2'. బాక్సాఫీస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టింది. ఆ తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు ఆశించిన రీతిలో విజయాలు సాధించలేదు. అయితే, ఆ లోటు 'సలార్' తీర్చేలా ఉందని వీరాభిమానులు ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళకు కిక్ ఇచ్చే మాట చెప్పారు హీరో కమ్ కమెడియన్ సప్తగిరి. ఇంకా చదవండి


ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి కారణమిదే! ఆ బోగీలోనే మంటలు చెలరేగాయన్న క్లూస్ టీమ్


యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఫలక్​నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్​ప్రెస్ రైలు ప్రమాదంపై కీలక అప్ డేట్ వచ్చింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే రైలులో అగ్ని ప్రమాదం జరిగిందని క్లూస్ టీమ్ అనుమానం వ్యక్తం చేసింది. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించిన టీమ్.. ఎస్ 4 కంపార్ట్ మెంట్లో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే మంటలు చెలరేగాయని అధికారులు భావిస్తున్నారు. వేడి కారణంగా వైర్లు కాలిపోవడం లేదా ఒక్కసారిగా విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల కారణంగా విద్యుదాఘతం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఎస్4 బోగీ నుంచే ఇతర బోగీలకు మంటలు వ్యాపించాయని ప్రాథమికంగా గుర్తించారు. ఎక్స్ ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరిగిన బోగీలు మొత్తం పరిశీలించిన క్లూస్ టీమ్ వందకు పైగా శాంపిల్స్ కలెక్ట్ చేసింది. వీటిని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించనున్నారు. ల్యాబ్ లో చెక్ చేశాక వచ్చే నివేదికలో ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలపనుంది. ఇంకా చదవండి


ఆంధ్రలో ఓటర్లను తక్కువ అంచనా వేయొద్దు - 'యాత్ర 2' దర్శకుడు


ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది పైగా సమయం ఉంది. అయితే, ఆల్రెడీ రాజకీయ పార్టీల అధినేతలు సమర శంఖం పూరించారు. ప్రత్యర్థుల మీద విమర్శల బాణాలు ఎక్కు పెడుతున్నారు. తెలుగు సినిమాలనూ ఆ ఎన్నికల వేడి తాకుతోంది. ఏపీ ఎన్నికలకు ముందు రాజకీయ నేపథ్యంలో కొన్ని సినిమాలు రానున్నాయి. వాటిలో ముఖ్యమైనది 'యాత్ర 2'. ఇంకా చదవండి


నేను విన్నాను నేనున్నాను - క్రికెట్ అభిమానులకు ‘ఓయో’ గుడ్ న్యూస్


వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో   అక్టోబర్ - నవంబర్ లో ప్రపంచకప్ మ్యాచులు జరుగబోయే  నగరాల్లో హోటల్  రూమ్ రెంట్స్ కొండెక్కుతున్న వేళ  ఆతిథ్య రంగంలో సంచలనాలు నమోదుచేస్తున్న ‘ఓయో’.. క్రికెట్ అభిమానులకు  క్రేజీ  న్యూస్ చెప్పింది.  భారత్ - పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరుగబోయే  మ్యాచ్ కు గాను అక్కడి హోటల్స్ లో  గదులు అద్దెకు కావాలంటే  రోజుకు రూ. 70 వేల నుంచి లక్ష రూపాయలు వెచ్చించినా దొరకడం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఓయో కీలక నిర్ణయం తీసుకుంది.  రాబోయే మూడు నెలల్లో  ప్రపంచకప్ జరుగబోయే  పది నగరాలలో  ఏకంగా 500 కొత్త హోటల్స్ ను తెరవనుంది. ఇంకా చదవండి


'జీఎస్టీ' నెట్‌వర్క్‌ ఇక మనీలాండరింగ్ నిరోధక చట్టం పరిధిలోకి!


ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్‌టీ నెట్‌వర్క్‌ను (జీఎస్‌టీఎన్) మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) పరిధిలోకి తీసుకువచ్చింది. ఈ మేరకు కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక నుంచి జీఎస్‌టీ విషయంలో అవకతవకలపై, ఉల్లంఘనలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరింత నేరుగా పీఎంఎల్‌ఏ పరిధిలో చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుంది. తప్పుడు మార్గాలలో జీఎస్‌టీ రాయితీలు పొందడం, నకిలీ ఇన్వాయిస్ వంటి జీఎస్‌టీ నేరాలను ఇక పీఎంఎల్‌ఏ పరిధిలో విచారించేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా చదవండి