New Generation Renault Duster: రెనో డస్టర్ లాంచ్ అయినప్పటి నుంచి ప్రపంచ మార్కెట్‌లో మంచి ఆదరణ పొందింది. కంపెనీ లాంచ్ చేసిన అత్యంత విజయవంతమైన మోడళ్లలో ఇది ఒకటి. మోనోకోక్ ఛాసిస్ ఆధారంగా రూపొందిన ఈ ఎస్‌యూవీ కారు పాకెట్ ఫ్రెండ్లీ బడ్జెట్‌లో వస్తుంది. ఈ ఎస్‌యూవీ భారతదేశంలో రెనో బ్రాండ్‌ను పాపులర్ చేయడంలో సహాయపడింది. కంపెనీ కొత్త రెనో డస్టర్ (డాసియా డస్టర్)ని కొంతకాలంగా పరీక్షిస్తోంది. ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ / క్రాస్ఓవర్ సెగ్మెంట్‌లో చాలా సంచలనం సృష్టించింది. ఈ కారు భారతదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన స్పై షాట్లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.


కొత్త రెనో డస్టర్ లుక్ ఎలా ఉంది?
ఈ కొత్త రెనో డస్టర్ టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది రెండో తరం మోడల్ కంటే చాలా పెద్దది. ఇప్పుడు రానున్న మూడవ తరం మోడల్‌ను సీఎంఎఫ్-బీ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించారు. ఇది ఐసీఈ, హైబ్రిడ్, బీఈవీ పవర్ ట్రెయిన్‌ల్లో లాంచ్ కానుంది.


ఈ కారు డిజైన్ రెనో బిగ్‌స్టర్ కాన్సెప్ట్‌ను పోలి ఉంటుంది. అంతే కాకుండా చాలా అగ్రెసివ్‌గా కూడా కనిపిస్తుంది. డాసియా లేదా రెనో బ్యాడ్జ్‌ను ఈ కారు ముందువైపు మధ్యలో కనిపిస్తుంది. ఇంతకు ముందు కనిపించిన స్పై ఫొటోల్లో బయటవైపు ఎల్ఈడీ లైట్లు మాత్రమే కనిపించాయి. కొత్త ఫొటోల్లో సెంట్రల్ ఎల్‌ఈడీ లైటింగ్ బయటి భాగంలో కూడా ఆన్‌లో ఉంది.


17 అంగుళాల అలోయ్ వీల్స్‌తో...
ఈ కారులో భారీ గ్రిల్‌ ఉన్న బాక్సీ బంపర్‌ను చూడవచ్చు. ఈ కారులో 17 అంగుళాల అలోయ్ వీల్స్ కనిపించాయి. ఈ 5 స్పోక్ డిజైన్ అల్లాయ్ వీల్స్‌పై డార్క్ ఫినిషింగ్ అందించారు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 220 మిల్లీమీటర్ల నుంచి 230 మిల్లీమీటర్ల వరకు ఉంటుందని అంచనా. అలాగే ఇది ఏడబ్ల్యూడీ డ్రైవ్‌ట్రెయిన్‌ని పొందే అవకాశం ఉంది.


దీని ఇండియా మోడల్ లోపలి భాగంలో చాలా ఎక్కువ స్థలాన్ని అందించే అవకాశం ఉంది. ఇందులో వెనుక వైపు డిస్క్ బ్రేక్‌లు కూడా ప్రొవైడ్ చేస్తారు. దీని టెయిల్ లైట్లు అనేక భాగాలుగా డివైడ్ అయ్యాయి. ఇది నిస్సాన్ మాగ్నైట్ మాదిరిగానే స్పోర్టీ రూఫ్ స్పాయిలర్‌ను కూడా పొందనుంది. దీని డిజైన్‌ను మరింత మెరుగుపరుస్తారని అంచనా.


ఈ SUV ఇంటీరియర్ ఇప్పటివరకు బయటకు వచ్చిన స్పై ఫొటోల్లో బయటకు రాలేదు. కంపెనీ ఈ కారును 2024లో అన్‌వీల్ చేసి, 2025 నాటికి లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీ భారతదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


ఏ కార్లతో పోటీ?
ఈ కారు హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్‌లతో పోటీ పడనుంది. క్రెటాను డీజిల్, పెట్రోల్ ఇంజన్‌ల్లో కొనుగోలు చేయవచ్చు. అలాగే గ్రాండ్ విటారా హైబ్రిడ్ సిస్టమ్‌తో 1.5 లీటర్ పెట్రోల్, CNG పవర్‌ట్రెయిన్ ఆప్షన్‌ను పొందుతుంది.


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial