Reason for Falaknuma Express Fire Accident: యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఫలక్​నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్​ప్రెస్ రైలు ప్రమాదంపై కీలక అప్ డేట్ వచ్చింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే రైలులో అగ్ని ప్రమాదం జరిగిందని క్లూస్ టీమ్ అనుమానం వ్యక్తం చేసింది. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించిన టీమ్.. ఎస్ 4 కంపార్ట్ మెంట్లో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే మంటలు చెలరేగాయని అధికారులు భావిస్తున్నారు. వేడి కారణంగా వైర్లు కాలిపోవడం లేదా ఒక్కసారిగా విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల కారణంగా విద్యుదాఘతం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఎస్4 బోగీ నుంచే ఇతర బోగీలకు మంటలు వ్యాపించాయని ప్రాథమికంగా గుర్తించారు. ఎక్స్ ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం జరిగిన బోగీలు మొత్తం పరిశీలించిన క్లూస్ టీమ్ వందకు పైగా శాంపిల్స్ కలెక్ట్ చేసింది. వీటిని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించనున్నారు. ల్యాబ్ లో చెక్ చేశాక వచ్చే నివేదికలో ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలపనుంది. 


శుక్రవారం ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం..
ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదంపై అధికారులు కేసు నమోదు చేశారు. నల్గొండ జి.ఆర్.పి స్టేషన్లో అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో 5 బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు రైల్వే యాక్ట్‌ సెక్షన్‌ 80/2023 కింద కేసు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. ఒక బోగీ పాక్షికంగా దగ్దమైనట్లు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి - బోమ్మాయిపల్లి స్టేషన్ల మధ్య ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశించామని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు. ఉన్నతాధికారులతో కలిసి ఆయన రైలు ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని సందర్శించారు.
Also Read: KTR About PM Modi: రూ.20 వేల కోట్లు గుజరాత్ కు! తెలంగాణకు మాత్రం రిపేర్ షాప్- ప్రధాని మోదీకి కేటీఆర్ కౌంటర్


పశ్చిమ బెంగాల్​లోని హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్​నుమా రైలులో యాదాద్రి జిల్లా పగిడిపల్లి- బొమ్మాయిపల్లి మధ్య మంటలు చెలరేగాయి. వెంటనే రైలు నిలిపివేసి ప్రయాణికుల్ని దించేయడంతో ప్రాణనష్టం తప్పింది.  ఐదు బోగీలు పూర్తిగా కాలిపోగా, మరికొన్ని బోగీలులకు సైతం మంటలు వ్యాపించాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఎస్4, ఎస్5, ఎస్6 బోగీలు పూర్తిగా దగ్గం కాగా, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం రైల్వే అధికారులు మిగతా బోగీలను సికింద్రాబాద్ స్టేషన్ కు తరలించారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులను సైతం సికింద్రాబాద్ స్టేషన్ కు తరలించారు. ఇటీవల కోరమండల్ ఎక్స్ ప్రెస్ జరిగిన కారణంగా ఎక్కడ రైలు ప్రమాదం జరిగిందన్న ఆందోళన అధికం అవుతోంది. ఒడిశాలో జరిగినట్లు పెద్ద రైలు ప్రమాదం జరిగితే తమ ప్రాణాలు పోయేవని ప్రయాణికులు చెబుతున్నారు.
Also Read: RS Praveen Kumar: సిర్పూర్ నుంచే ఎన్నికల బరిలోకి - అధికారికంగా ప్రకటించిన ప్రవీణ్ కుమార్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial