మోత మోగించిన టీడీపీ క్యాడర్


చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేశారని సీఎం జగన్ ను వినిపించేలా ఏడు గంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకూ మోత మోగిద్దాం అనే కార్యక్రమాన్ని టీడీపీ క్యాడర్ విస్తృతంగా నిర్వహించింది. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో టీడీపీ అభిమానులు తమకు నచ్చిన పద్దతిలో మోత మోగించారు. ఢిల్లీలో నారాలోకేష్ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. ఇంకా చదవండి


చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు


బీఆర్ఎస్ నేతలు రూటు మార్చేస్తున్నారా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ సెటిలైన సీమాంధ్ర ఓటర్లే లక్ష్యంగా అధికార పార్టీ పావులు కదుపుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లోని 24 నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే శక్తి సీమాంధ్ర ప్రజలకు ఉంది. వారు ఎటు వైపు మొగ్గు చూపితే...ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రతి నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లు రాయలసీమ, ఆంధ్రా ప్రజలే ఉన్నారు. ఎన్నికల ముందు వారిని తమ వైపు తిప్పుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మైలేజ్ పెరిగింది. ఆ పథకాల గురించే తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇంకా చదవండి


బీజేపీకి సమస్యగా చంద్రబాబు అరెస్టు ఇష్యూ


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు 14 ఏళ్లు సీఎంగా చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నారు. జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్నారు. అలాంటి నేతను ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం సాధ్యమా ?. అరెస్టు చేసేటప్పుడు ఏ కేసో కూడా చెప్పకుండా నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. 73 ఏళ్ల వయసులో ఉన్న ఆయనను  పన్నెండు గంటల పాటు రోడ్లపై జర్నీ చేయించి.. మరో పన్నెండు గంటల పాటు నిద్ర కూడా పోనివ్వకుండా విచారణ జరిపి.. మరో పదహారు గంటల పాటు కోర్టులో కూర్చోబెట్టారు. దేశంలోని అత్యంత సీనియర్ లీడర్లలో ఒకరు అయిన చంద్రబాబుపై ఇంత క్రూరత్వం ఎందుకు చూపించారు ? ఇలాంటివి కేంద్రం మద్దతు లేకుండా జరుగుతాయా ?.  స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో కనీస ఆధారాలు లేవని తెలుస్తున్నా కోర్టుల్లోనూ చంద్రబాబుకు ఊరట దక్కకపోవడం .. రాజమండ్రి సెంట్రల్ జైల్లో పాతిక రోజులుగా ఉండటం సాధ్యమేనా ? అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇంకా చదవండి


నేడు మహబూబ్​నగర్​కు ప్రధాని మోదీ 


ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం (అక్టోబరు 1) తెలంగాణలో పర్యటించనున్నారు. మహబూబ్​నగర్​ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రధాని మోడీ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో మధ్యాహ్నం 1.35 గంటలకు మహబూబ్ నగర్ కు బయలుదేరతారు. మధ్యాహ్నం 2.10 గంటలకు మహబూబ్ నగర్ హెలిపాడ్ వద్దకు చేరుకోనున్న మోడీ, మధ్యాహ్నం 2.15 నుంచి 2.50 గంటల వరకు మహబూబ్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంకా చదవండి


ఢిల్లీలో నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు - ఎప్పుడు రమ్మన్నారంటే ?


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సీఐడీ అధికారులు 41ఏ నోటీసులు జారీ చేశారు. 14వ తేదీన ఉదయం గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి హాజరు కావాలని  నోటీసుల్లో పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో  ఇటీవల ఏ 14గా లోకేష్ పేరు చేర్చారు. అయితే తర్వాత ఎఫ్ఐఆర్ మార్చామని హైకోర్టుకు చెప్పారు.. ఎలా మార్చారు.. సాక్షిగా మార్చారా లేకపోతే.. నిందితుడిగానే ఉంచారా అన్నదానిపై స్పష్టత లేదు. ఇంకా చదవండి


ఇస్రో కీలక అప్‌డేట్, సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య L1


ఆదిత్య ఎల్ 1 ప్రయోగంపై శనివారం ఇస్రో కీలక అప్డేట్ ఇచ్చింది. సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ‘ఆదిత్య- ఎల్ 1’  ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ఉపగ్రహం లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నట్లు ఇస్రో తెలిపింది. ఈ వ్యౌమనౌక ఇప్పటికే భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్లకుపైగా దూరం ప్రయాణించినట్లు ఇస్రో పేర్కొంది. ఈ క్రమంలోనే భూ గురుత్వాకర్షణ పరిధిని విజయవంతంగా దాటినట్లు వెల్లడించింది. ఇంకా చదవండి


ఎట్టకేలకు నోరు విప్పిన సిద్ధార్థ్, బెంగళూరు అవమానంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్


తమిళ నటుడు సిద్ధార్ నటించిన తాజా చిత్రం ‘చిత్తా’ (తెలుగులో ‘చిన్నా’). ఈ నెల 28న తమిళంతో పాటు కన్నడలో ఒకేసారి విడుదల అయ్యింది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్ కోసం కర్నాటకకు వెళ్లిన సిద్ధార్థ్ కు ఘోర అవమానం జరిగింది. బెంగళూరులోని ఓ హోటల్ లో మూవీ ప్రమోషన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సిద్ధార్థ్ మాట్లాడుతుండగా, కావేరీ జలాల పోరాట సమితి సభ్యులు అడ్డుకున్నారు. తమిళోడివి నీకు కర్ణాటకలో ఏం పని? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రెస్ మీట్ ఆపేయాలని డిమాండ్ చేశారు. ఇంకా చదవండి


రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ - నిర్మాత కుమార్తె?


రౌద్రం రణం రుధిరం' సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జోడీగా ఆలియా భట్ నటించారు. హిందీ దర్శకుడు మహేష్ భట్, నటి సోనీ దంపతుల కుమార్తె ఆమె. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్ పూర్తి స్థాయి హీరోగా నటిస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. అందులో కియారా అడ్వాణీ హీరోయిన్. ఆమె తాతయ్య నటుడు. బాలీవుడ్ భాషలో చెప్పాలంటే... స్టార్ కిడ్! 'గేమ్ ఛేంజర్' తర్వాత రామ్ చరణ్ నటించబోయే సినిమాలో హీరోయిన్ కూడా స్టార్ కిడ్ అని టాక్. ఇంకా చదవండి


ఇదే నా చివరి ప్రపంచ కప్ - కెరీర్ గురించి రవిచంద్రన్ అశ్విన్ ఏమన్నాడంటే?


రెండు నెలల క్రితం వరకు ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 భారత జట్టులో రవిచంద్రన్ అశ్విన్ పేరు అస్సలు లేదు. ప్రపంచకప్‌ కోసం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించినప్పుడు కూడా అశ్విన్ అందులో భాగం కాలేదు. దీని తర్వాత అక్షర్ పటేల్‌కు గాయం అయిన కారణంగా అశ్విన్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం జట్టులో చేరాడు. ఇంకా చదవండి


రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త 


రూ.2000 నోట్లను మార్చుకోలేని వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉపశమనం కలిగించింది. డినామినేషన్ చేసిన రూ. 2,000 నోట్ల మార్పిడితో పాటు డిపాజిట్ గడువును అక్టోబర్ 7, 2023 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఈ పెద్ద నోటు మార్పిడికి, బ్యాంకులో డిపాజిట్లకు ఆర్బీఐ ఇచ్చిన తుది గడువు సెప్టెంబర్ 30, 2023తో ముగియనుంది. కొందరు ఇంకా నోట్లు మార్చుకోవడం వీలుకాలేదని రిక్వెస్ట్ లు రావడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంకా చదవండి