Aditya L1: ఆదిత్య ఎల్ 1 ప్రయోగంపై శనివారం ఇస్రో కీలక అప్డేట్ ఇచ్చింది. సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ‘ఆదిత్య- ఎల్ 1’  ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ఉపగ్రహం లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నట్లు ఇస్రో తెలిపింది. ఈ వ్యౌమనౌక ఇప్పటికే భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్లకుపైగా దూరం ప్రయాణించినట్లు ఇస్రో పేర్కొంది. ఈ క్రమంలోనే భూ గురుత్వాకర్షణ పరిధిని విజయవంతంగా దాటినట్లు వెల్లడించింది.






ప్రస్తుతం లెగ్రేంజ్‌ పాయింట్‌ 1 దిశగా పయనిస్తున్నట్లు ఇస్రో చెప్పింది. ‘ఎల్‌ 1’ పాయింట్‌ భూమి నుంచి సూర్యుడి దిశగా సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భూ గురుత్వాకర్షణ పరిధిని దాటి ఓ వ్యౌమనౌకను ఇస్రో విజయవంతంగా పంపడం ఇది వరుసగా రెండోసారి. అంగారకుడిపై పరిశోధనలకు ఉద్దేశించిన ‘మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌’ మొదటిసారి ఈ ఘనత సాధించినట్లు ఇస్రో తెలిపింది. 


‘చంద్రయాన్‌-3’ విజయవంతం తర్వాత ఇస్రో ‘ఆదిత్య ఎల్‌1’ను ప్రయోగించింది. సెప్టెంబరు 2న పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఆదిత్య-ఎల్‌1లో మొత్తం ఏడు పేలోడ్లు ఉన్నాయి. ‘లెగ్రేంజ్‌ పాయింట్‌ 1’ వద్ద భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ బలాలు సమానంగా ఉంటాయి. అక్కడి నుంచి ఉపగ్రహాలు నిరంతరం సూర్యుడిని కనిపెట్టుకోవటానికి వీలుంటుంది.


ఆదిత్యలోని పేలోడ్స్ ఏం చేస్తాయంటే?
1. విజిబుల్‌ ఎమిజన్ లైన్‌ కొరొనాగ్రాఫ్‌(VELC)
సూర్యుడి అవుటర్ మోస్ట్ పార్ట్ ని కొరోనా అంటారు. ఈ కొరోనా సూర్యుడివెలుగులో మనకు అస్సలు కనిపించదు. ఏవైనా స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ తోనే చూడాల్సి ఉంటుంది. సో ఆదిత్య L1 లో 170 కిలోల బరువు ఉండే ఈ VELC ఇన్స్ట్రుమెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్ పెరిమెంట్ చేస్తుంది అదేంటంటే...సూర్యగ్రహణాన్ని ఆర్టిఫీషియల్ గా సృష్టిస్తుంది. సూర్యుడికి మొత్తం ఎదురుగా వెళ్లటం ద్వారా నీడను సృష్టించి కొరోనోగ్రాఫ్ ను తయారు చేస్తుంది. అంటే సూర్యుడు నిరంతం మండుతూ ఉంటాడు కదా. ఇలా ఎప్పుడూ కూడా సూర్యుడి నుంచి మాస్ ఎజెక్షన్స్ అవుతూ ఉంటాయి. సో అవి ఎలా వస్తున్నాయి ఏంటీ లాంటివి మ్యాపింగ్ చేయటంతో పాటు సూర్యుడి మాగ్నటిక్ ఫీల్డ్ మీద కూడా ఓ అంచనాకు వచ్చేందుకు అవకాశం లభిస్తుంది.


2. సోలార్‌ ఆల్రావైలెట్‌ ఇమేజింగ్‌ టెలీస్కోప్‌(SUIT)
 దీన్నే సూట్ పేలోడ్ అంటున్నారు. ఇది 35 కిలోల బరువు మాత్రమే ఉండే ఓ చిన్న టెలిస్కోప్. ఇది సూర్యుడిని 200-400 నానో మీటర్ వేవ్ లెంత్ రేంజ్ నుంచి గమనిస్తుంది.11 వేర్వేరు ఫిల్టర్లను వాడుతూ సూర్యుడి డిఫరెంట్ లేయర్స్ ను ఫోటోలు తీస్తుంది. ఇంత తక్కువ వేవ్ లెంత్ రేంజ్ లో సూర్యుడిని ఫోటోలు తీసిన టెలిస్కోప్ మరొకటి లేనే లేదు.


3. ఆదిత్య సోలార్‌ విండ్ పార్టికల్‌ ఎక్స్‌పర్మెంట్‌(ASPEX)
 ఆస్పెక్స్ గా పిలుస్తున్న ఈ ఇన్ స్ట్రుమెంట్ సూర్యుడి నుంచి వస్తున్న అతి తీవ్రమైన గాలులను, ఆ స్ప్రైక్ట్రల్ క్యారెక్టరస్టిక్స్ ను స్టడీ చేస్తుంది.


4. ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్ ఆదిత్య (PAPA)
   ఇదిగో ఇలా లావాలా ఉబుకుతుందే దీన్నే ప్లాస్మా అంటారు. సూర్యుడి మీద అనేక గ్యాసెస్ ఉంటాయి అవన్నీ కలిసి ఇలా ప్లాస్మా రూపంలో ఉంటాయి. చూడటానికి ఇది కూడా గ్యాస్ స్టేట్ లోనే కనిపిస్తున్నా చాలా పార్టికల్స్ అయనైజ్డ్ అయిపోయి ఉంటాయి. సో ఈ ప్లాస్మా ఎలా ఫార్మ్ అవుతుంది ఏంటీ అనేది పాపా ఇన్ స్ట్రుమెంట్ కంప్లీట్ విశ్లేషిస్తుంది.


5. సోలార్‌ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్(SoLEXS)
  సూర్యుడి నుంచి మనకు కనిపించే విజుబుల్ లైట్ కాకుండా కాంతి ఎక్స్ రే ల రూపంలో, ఇన్ ఫ్రారెడ్ కిరాణాల రూపంలో, ఆల్ట్రా వైలెట్ రేస్ రూపంలో వస్తూ ఉంటుంది. సో సూర్యుడి ఉపరితలం కాకుండా కొరోనా అంటే అవుటర్ మోస్ట్ అట్మాస్పియర్ నుంచి నుంచి వచ్చే లోఎనర్జీ ఎక్స్ రే స్ ను అనలైజ్ చేసే బాధ్యత ఈ సోలెక్స్ ఇన్ స్ట్రుమెంట్ ది.


6.హై ఎనర్జీ ఎల్‌1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్(HEL1OS)
 సూర్యుడు ఒక్కోసారి ఉన్నట్టుండి వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సూర్యుడి మీద ఏర్పడే తుపాన్లు విశ్వానికి ప్రమాదం అని శాస్త్రవేత్తలో ఓ ఆందోళన. అందుకే సూర్యుడి కొరోనాలో జరుగుతున్న మార్పులు, ఆ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా జరుగుతుందో తెలుసుకోవటం అవసరం. అందుకే ఈ ఇన్స్ట్రుమెంట్ .


7.మాగ్నెటోమీటర్-Magnetometer
 భూమికి ఉన్నట్లే సూర్యుడికి అతిపెద్ద అయస్కాంత క్షేత్రం ఉంటుంది. సౌర కుటుంబంలో ఇన్ని గ్రహాలను, వాటి చందమామలను తన చుట్టూ తిప్పుకోగలుగుతున్న ఆ అతి పెద్ద అయస్కాంత క్షేత్రం లక్ష్యంగా పరిశోధనలు చేయటం ఈ మాగ్నటో మీటర్ పని.


L1కి చేరుకున్నాక..?
ఒక్కసారి L1 ఫేజ్‌కి చేరుకున్న తరవాత ఆదిత్య L1 ఇంజిన్‌ల సాయంతో పాథ్ మార్చుతారు. అక్కడి నుంచి క్రమంగా L1 Halo Orbitలోకి ప్రవేశిస్తుంది. ఆ పాయింట్ వద్దే ఇది స్టేబుల్‌గా ఉంటుంది. సరిగ్గా ఈ పాయింట్ వద్ద భూమి గురుత్వాకర్షణ శక్తి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి బ్యాలెన్స్ అవడం వల్ల ఆదిత్య L1 అక్కడే స్థిరంగా ఉంటుంది. అయితే...సైంటిస్ట్‌లు చెబుతున్న వివరాల ప్రకారం...అది అక్కడ స్టేబుల్‌గా ఉండకుండా చాలా నెమ్మదిగా కదులుతుంది. 


అక్కడి నుంచే సూర్యుడికి సంబంధించిన కీలక వివరాలు సేకరిస్తుంది. రోజుకి 14 వందలకు పైగా ఫొటోలు తీసి పంపుతుంది. లగ్రాంజియన్ పాయింట్‌కి చేరుకున్న తరవాత Visible Emission Line Coronagraph (VELC) సాయంతో అక్కడి నుంచి ఫొటోలు పంపనుంది ఆదిత్య L1. రోజుకి 1,440 ఫొటోలు పంపుతుందని ఇస్రో ప్రకటించింది. ఈ ఫొటోల ద్వారా సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు వీలవుతుంది. ఆదిత్య L1లో అతి పెద్ద పే లోడ్ VELC. ఈ మిషన్ మొత్తంలో ఇదే అత్యంత కీలకం. Indian Institute of Astrophysics ఇస్రోతో కలిసి ఈ పేలోడ్‌ని తయారు చేసింది.