ఇంటి పేరు ఒకటైతే బంధువులేనా


బోయిన్‌పల్లి సరిత... జెన్‌కోలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. మాజీ జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు ఈమెకు ఉద్యోగం ఇప్పించినట్టు ఆరోపణలు  వస్తున్నాయి. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్న బిడ్డే... బోయినపల్లి సరిత రావు అని. తెలంగాణ జెన్‌కోలో పరీక్ష రాయకుండానే ఆమెకి ఏఈ (అసిస్టెంట్  ఇంజనీర్) ఉద్యోగం ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. జెన్‌కో చైర్మన్‌గా ప్రభాకర్ రావే ఆమెకు ఈ ఉద్యోగం ఇచ్చారని... ఆమె ఉద్యోగానికి రాకుండా ఇంట్లోనే ఉంటూ నెలకి లక్షా  50వేల రూపాయల జీతం తీసుకుంటుందని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకా చదవండి


అలాంటివారు ఇంటికి పోవడమే - మంత్రి సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్!


ప్రజల విశ్వాసం లోకకళ్యాణార్థం జరుగుతున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు సకల సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. జాతరలో జరిగే పనుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ట్రాన్స్‌ఫర్లు ఉండవు.. కానీ ఇంటికి పోవడం ఖాయమని అధికారులను మంత్రి సీతక్క హెచ్చరించారు. ఆదివాసి సాంప్రదాయానికి ఎలాంటి ఆటంకం కలవకుండా, వనదేవతల పూజా విధానానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతరను నిర్వహిస్తామని మంత్రి అన్నారు. మేడారం పనుల సందర్శనలో భాగంగా మంత్రి సీతక్క ముందుగా అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. ఇంకా చదవండి


ఈ నెల 8న తెలంగాణ కేబినెట్ భేటీ - నెల రోజుల పాలన


తెలంగాణ కేబినెట్ ఈ నెల 8న (సోమవారం) భేటీ కానుంది. నెల రోజుల పాలన, 6 గ్యారెంటీల అమలుపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ పూర్తి కాగా, వాటి ప్రాసెస్ సహా అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా కార్యాచరణ రూపొందించడంపైనా మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. ఇంకా చదవండి


జగన్ రివర్స్ పాలనలో 30 ఏళ్లు వెనక్కు


సీఎం జగన్ (CM Jagan) దుర్మార్గపు పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో (Tiruvuru) ఆదివారం నిర్వహించిన 'రా కదలిరా' బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ కోలుకోలేని విధంగా దెబ్బతీశారని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రంలో నాతో సహా ప్రజలందరూ బాధితులేనని అన్నారు. ఓ పక్క హైదరాబాద్ వెలిగిపోతుంటే.. ఇక్కడ అమరావతి వెలవెలబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం జగన్ రివర్స్ పాలనే అని ప్రజలు గుర్తించాలని చెప్పారు. ఇంకా చదవండి


మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామికి అవమానం


అనంతపురం (Anantapuram)జిల్లా మడకశిర (Madakasira) నియోజకర్గం ఎమ్మెల్యే తిప్పేస్వామి (Thippeswamy)కి ఘోర అవమానం జరిగింది. సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy ) ని కలిసేందుకు ఎమ్మెల్యే తిప్పేస్వామి వచ్చారు. దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యేతో  సజ్జల మాట్లాడకుండా వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. మడకశిర వ్యవహారంపై మాట్లాడేందుకు ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి...అమరావతికి వచ్చారు. అనుచరులతో కలిసి సచివాలయానికి వెళ్లారు. ఇంకా చదవండి