తెలంగాణలో కొలువుదీరిన ప్రజా ప్రభుత్వం


తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిశై సౌందర రాజన్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగిన  కార్యక్రమంలో ప్రమాణం చేయించారు. రేవంత్ అనే నేను అని .. పలకగానే స్టేడియం హోరెత్తిపోయింది. రేవంత్ తో  పాటు పదకొండు మంది మంత్రులు ప్రమాణం చేశారు. రేవంత్ రెడ్డి తర్వాత మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర్ రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు,  కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగలేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ , కొండా సురేఖ, సీతక్క,  తుమ్మల నాగేశ్వరరావు,  జూపల్లి కృష్ణారావు వరుసగా ప్రమాణం చేశారు. ఇంకా చదవండి


మేం పాలకులం కాదు మీ సేవకులం


ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలపై తొలి సంతకం చేశారు. ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత గవర్నర్ తో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు వెళ్లిపోయిన తర్వాత కృతజ్ఞతా సభ నిర్వహించారు. 'జై సోనియమ్మ' అంటూ సీఎంగా రేవంత్ రెడ్డి తన తొలి ప్రసంగం ప్రారంభించారు. ఎన్నో త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దశాబ్ద కాలంగా తెలంగాణలో మానవ హక్కులకు భంగం కలిగిందని అన్నారు. ఇందిరమ్మ రాజ్య ఏర్పాటుతో తెలంగాణ నలుమూలలా సమాన అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో పదేళ్ల బాధలను ప్రజలు మౌనంగా భరించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామని  హామీ ఇచ్చారు. ఇంకా చదవండి


తెలంగాణ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న కొత్త మంత్రుల ప్రొఫైల్‌ చూశారా


తెలంగాణలో కొత్త కేబినెట్ కొన్ని గంటల్లో కొలువు దీరనుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న రేవంత్ రెడ్డి.. మంత్రి వర్గంలో 11 మందికి చోటు కల్పించారు. పార్టీలో సుదీర్ఘకాలంగా పని చేస్తున్న నేతలకు ప్రాధాన్యత ఇచ్చారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గౌడ్, నల్గొండ నుంచి గెలుపొందిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వరంగల్ ఈస్ట్ నుంచి గెలుపొందిన కొండా సురేఖతోపాటు మరికొందరు సీనియర్లను తన టీంలోకి తీసుకున్నారు. కేబినెట్‌లో స్థానం దక్కించుకున్న వారి ప్రొఫైల్స్‌ ఓ సారి చూద్దాం. ఇంకా చదవండి


ఏపీలో ప్రత్యేక బృందాలతో పంట నష్టం అంచనా-జనవరిలో పరిహారం


మిగ్‌జామ్‌ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌ రైతులను నిండా ముంచేసింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట మొత్తం నీటిపాలైంది. తుఫాన్‌  ప్రభావిత జిల్లాల్లో ఎటు చూసినా నీట మునిగిన పొలాలు.. నేలకొరిగిన పంటచేలే కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నష్టపోయిన రైతన్నలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం  ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వీలైనంత త్వరగా వారికి నష్టపరిహారం అందించేందుకు కృషిచేస్తోంది. రైతులకు అండగా నిలవాలని అధికారులను కూడా ఆదేశించారు  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అంతేకాదు పంట నష్టం అంచనాలకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. వ్యవసాయ, ఉద్యాన శాఖలు,  రెవెన్యూ శాఖతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇంకా చదవండి


ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన


సీఎం జగన్ (CM Jagan) గురువారం ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) రూ.216 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ (Master Plan) ప్రకారం నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దుర్గగుడిని రూ.225 కోట్లతో పూర్తిగా అభివృద్ధి చేసేందుకు సర్కారు మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఈ క్రమంలో సీఎం వాటికి శంకుస్థాపన చేశారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకున్నారు. అంతకు ముందు ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఇంకా చదవండి