అమరావతిలో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే
అమరావతిలో వివాదమైన ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. అమరావతిలోని ఆర్5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ ప్రాంతంలో రాజధానిలో ఉన్న వారికి కాకుండా వేరే ప్రాంతాల వారికి స్థలాలు ఇచ్చారని రాజధాని ప్రాంత రైతులు కోర్టులో కేసులు వేశారు. రాజధాని ప్రాంత రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ సంఘాలు వేసిన పిటిషన్ విచారించిన త్రిసభ్య ధర్మాసనం స్టే ఇచ్చింది. ఇప్పిటేక ప్రభుత్వం ఇక్కడ వివిధ వర్గాలకు ఇళ్లు కట్టించేందుకు 1402 ఎకరాలు కేటాయించింది. ఇందులో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వారిని లబ్ధిదారులుగా చేసింది. దీనిపైనే అమరావతి రైతులు పోరాటం చేస్తున్నారు. ఇంకా చదవండి
నా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని డిసైడ్ చేసేది నేనే- మల్లారెడ్డి కామెంట్స్
తన వ్యాఖ్యలతో, తన మ్యానరిజంతో ఎప్పుడూ సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. ఆయన మైక్ పట్టుకున్నారంటే.. డైలాగుల వరద పారుతుంది. ఒక్కో డైలాగు ఒక్కో ఆణిముత్యంలా మారిపోయి.. మల్లారెడ్డిని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుంది. తనదైన శైలి వ్యాఖ్యలతో అలరిస్తుంటారు. ఒక్కోసారి ఆయన చేసే కామెంట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా కూడా మారుతుంటాయి. అలాంటి వ్యాఖ్యలే మరోసారి చేశారు మంత్రి మల్లారెడ్డి. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇంకా చదవండి
ఈటల - కేటీఆర్ పదినిమిషాల ముచ్చట్లు - ఏం మాట్లాడుకున్నారో?
అసెంబ్లీ సమావేశాలు అంటేనే ఎప్పుడూ ఉప్పూ నిప్పులా ఉండే నేతలు ఎదురు పడే ప్రదేశం. ప్రెస్ మీట్లలో ఒకరిపై ఒకరు తీవ్రంగా ఎదురుపడి.. వీరిద్దరే కానీ ఎదురెదురుగా ఉంటే.. ఘర్షణ ఖాయం అనుకునేలా ఉండే నేతలు అసెంబ్లీలో మాత్రం ఏమీ తెలియనట్లుగా ఆప్యాయంగా మాట్లాడుకుంటూ కనిపిస్తారు. తెలంగాణ అసెంబ్లీ తొలి రోజు సమావేశాల్లో ఇలాంటి సన్ని వేశాలు కనిపించాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో పది నిమిషాలు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇంకా చదవండి
వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పే ఆలోచనలో ప్రభుత్వం
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం త్వరలో వాలంటీర్లకు జీతాలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు ఏపీ సీఎం జగన్ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి నెల ఒకటో తారీఖున వృద్ధాప్య, వితంతు ఫించన్లను వాలంటీర్లు ఇంటి వద్దకే తీసుకుని వచ్చి అందిస్తున్నారు. ఇంకా చదవండి
ఎటు చూసినా టీడీపీ కార్యక్రమాలే - ప్రచారబరిలో చంద్రబాబు పక్కా వ్యూహం ఫలిస్తోందా ?
పులివెందులలో చంద్రబాబు, వినుకొండలో లోకేష్.. ఉత్తరాంధ్రలో బస్సు యాత్ర.. మరో జిల్లాలో మహిళా శక్తి కార్యక్రమం ఇలా రాష్ట్రంలో ఏ మూల చూసినా టీడీపీ కార్యక్రమాలే జరుగుతున్నాయా అన్నంతగా తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్తోంది. ఒక దాని తర్వాత ఒకటి కాకుండా.. ఒకటి కొనసాగుతూండాగనే మరో ప్రచార కార్యక్రమం ప్లాన్ చేసుకున్నారు. ఎక్కడా గందరగోళం లేకుండా నేతలంతా ఏదో ఓ కార్యక్రమంలో బిజీ అయ్యేలా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూడటంతో.. టీడీపీ మాత్రమే సీరియస్‌గా రాజకీయాలు చేస్తోందా అన్న అభిప్రాయం కల్పించేలా చేస్తున్నారు. ఇంకా చదవండి