తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 11,348 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 97,710 పోస్టులకుగాను 86,362 మంది మాత్రమే పనిచేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి అన్నపూర్ణ దేవి ఆగస్టు 2న రాజ్యసభకు తెలిపారు. ఇక ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ) పథకం కింద తెలంగాణలో 543 పాఠశాలలను ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి తెలిపారు. మొత్తం 14,500 పాఠశాలలను బాగు చేయాలన్నది లక్ష్యంగా కాగా తొలిదశలో 27 రాష్ట్రాల్లో 6,207 పాఠశాలలను ఎంపిక చేశామని, అందులో తెలంగాణ నుంచి 543 ఉన్నాయని మంత్రి వివరించారు.


ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ పాఠశాలల) పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా మొదటి దశలో మొత్తం 6448 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 1205 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిలో ఏపీ నుంచి 662 పాఠశాలలు, తెలంగాణ నుంచి 543 పాఠశాలలు ఉన్నాయి.


14,500 స్కూళ్లను అభివృద్ధే లక్ష్యం..
ఈ పథకాన్ని కేంద్రప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌ 7న ఆమోదించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 14,500 స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు కొన్ని మార్గదర్శకాలను నిర్దేశిస్తూ వాటి ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని అన్ని రాష్ట్రాల పాఠశాలలకు అవకాశమిచ్చింది. కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆన్‌లైన్‌ చాలెంజ్‌ పోర్టల్‌ ద్వారా స్కూళ్లు స్వయంగా వీటికి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ దరఖాస్తులను మూడుదశల్లో పరిశీలించి తుది ఎంపికను ఖరారు చేశారు. నిర్దేశిత బెంచ్‌మార్క్‌ ఆధారంగా పాఠశాలలను కేంద్రం గుర్తించింది. కేంద్ర విద్యాశాఖ నిబంధనల ప్రకారం అర్బన్‌ స్కూళ్లు 70 శాతానికిపైగా, గ్రామీణ ప్రాంత స్కూళ్లు 60 శాతానికిపైగా స్కోరు సాధించగలిగితేనే పీఎంశ్రీ పథకానికి అర్హమైనవిగా గుర్తించారు. పాఠశాలలను కేంద్ర విద్యాశాఖ బృందాలు భౌతికంగా కూడా సందర్శించి నిర్దేశిత ప్రమాణాలతో ఉన్నాయో లేదో పరిశీలించిన తరువాతే ఎంపిక చేశారు. మన రాష్ట్రం నుంచి అందిన దరఖాస్తుల్లో మొత్తం 662 స్కూళ్లను పీఎంశ్రీ పథకానికి ఎంపిక చేశారు. వీటిలో 33 ప్రాథమిక పాఠశాలలుండగా 629 సెకండరీ, సీనియర్‌ సెకండరీ స్కూళ్లు ఉన్నాయి.


ALSO READ:


ఏపీలో 39 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ, కేంద్రం వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతుల బోధనకు సంబంధించి 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీలపై ఆగస్టు 2న రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణదేవి ఈ మేరకు సమాధానమిచ్చారు. ఏపీలో 2020-21 విద్యాసంవత్సరంలో 22,609 ఖాళీలు ఉండగా.. 2021-22 విద్యాసంవత్సరం నాటికి 38,191కి చేరాయి. ఇక 2022-23 విద్యాసంవత్సరానికి మొత్తం ఖాళీల సంఖ్య 39,008కి పెరిగినట్లు ఆమె వెల్లడించారు. అంటే రాష్ట్రంలో రెండేళ్లలో ఖాళీలు 16,399 మేర పెరిగాయి. 1,56,895 టీచర్‌ పోస్టులకుగాను ప్రస్తుతం 1,17,887 మంది పనిచేస్తున్నట్లు అన్నపూర్ణదేవి తెలిపారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


సీజీఎల్ 2023 'టైర్-1' ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం
కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్‌)-2023 టైర్-1 పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆగస్టు 1న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రూల్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అందుబాటులో ఉంచింది. 
ఆన్సర్ కీ, అభ్యంతరాల నమోదు కోసం క్లిక్ చేయండి..


యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ షెడ్యూలు ఖరారు, పరీక్షలు ఎప్పుడంటే?
సివిల్ సర్వీసెస్‌ మెయిన్స్ పరీక్షల షెడ్యూలును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ రెండు సెష‌న్లలో పరీక్షలు జరుగనున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరీక్షలు హైదరాబాద్, విజయవాడ నగరాల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షల ద్వారా  మొత్తం 1105 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు తుది ఎంపిక చేస్తారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 ప్రిలిమ్స్ పరీక్షను మే 28న నిర్వహించగా.. జూన్‌ 12న ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...