Skanda: టాలీవుడ్ లో రాబోతున్న మాస్ యాక్షన్ సినిమాల్లో బోయపాటి శ్రీను, హీరో రామ్ కాంబోలో వస్తున్న ‘స్కంద’ మూవీ ఒకటి. ఈ మూవీలో టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ కు సరైన హిట్ పడలేదు. మధ్యలో ‘వారియర్’ అంటూ వచ్చినా అది అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు ‘స్కంద’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రామ్. ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘నీ చుట్టూ చుట్టూ’ అని సాగే ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన రామ్, శ్రీలీల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 


‘నీ చుట్టూ చుట్టూ’ అంటోన్న రామ్..


రామ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ‘స్కంద’ ఫస్ట్ సింగిల్ సాంగ్ వచ్చేసింది. నేడు(ఆగస్టు 3) ఉదయం 9:36 నిమిషాలకు ‘నీ చుట్టూ చుట్టూ’ ఫస్ట్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ పాట ప్రోమోకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఫుల్ సాంగ్ రిలీజ్ అవ్వడంతో రామ్ అభిమానులు మంచి కిక్ ఇచ్చినట్టయ్యింది. ఇక సాంగ్ విషయానికొస్తే.. ప్రోమోలో చూసినట్టే రామ్, శ్రీలీల డాన్స్ అదరగొట్టారు. ‘నీ చుట్టూ చుట్టూ’ అంటూ రామ్, శ్రీలీల వేసే స్టెప్స్ కూడా అదిరిపోయాయి. సాధారణంగా రామ్ ఎంత ఎనర్జీగా డాన్స్ చేస్తారో తెలిసిందే. అలాంటి హీరో పక్కన శ్రీలీల లాంటి యాక్టీవ్ గర్ల్ ఉంటే ఎలా ఉంటుంది. ఇక అభిమానులకు ట్రీట్ అనే చెప్పాలి. నిజంగా అలాగే ఫుల్ ఎనర్జీతో రామ్, శ్రీలీల డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఇక తమన్ అందించిన సంగీతం కూడా బానే ఉంది. ఈ పాటకు రఘురామ్‌ సాహిత్యం అందించగా.. సిద్‌ శ్రీరామ్‌, సంజన కల్‌మంజీ ఆలపించారు. ఇప్పుడీ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 


అదిరిపోయిన రామ్, శ్రీలీల కాంబో..


తెలుగు సినిమాల్లో హీరోల డాన్స్ లకు అభిమానులు ఉంటారు. అందుకే ఒకప్పుడు కమర్షియల్ సినిమాల్లో హీరోలతో పాటు హీరోయిన్లు కూడా డాన్స్ లు చేసేవారు. అది క్రమేపీ తగ్గింది. మళ్లీ ఇప్పుడు వచ్చే హీరోయిన్లు కూడా హీరోలతో పాటు పోటీగా డాన్స్ లు వేయడానికి హీరోయిన్లు కూడా రెడీ అంటున్నారు. అలా ఈ మధ్య కాలంలో వచ్చిన హీరోయిన్లలో సాయి పల్లవి తన డాన్స్ తో ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. ఆమె తర్వాత ఇప్పుడు శ్రీలీల ఫుల్ ఫామ్ లో ఉంది. ఆమె అందానికే కాదు ఆమె డాన్స్ కు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ పాటను తెలుగులో మాత్రమే కాకుండా ‘మే పీచే పీచే’ పేరుతో హిందీలో, ‘ఒన్న సుతి సుతి’ పేరుతో తమిళంలో, ‘నిన్ సుత సుత’ పేరుతో కన్నడలో, ‘నీ తొట్టు తొట్టా’ పేరుతో మలయాళంలో ఒకేసారి రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు రామ్. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌‌పై శ్రీనివాస చిట్టూరి మూవీను నిర్మించారు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 



Also Read: అదా శర్మకు తీవ్ర అస్వస్థత - హాస్పిటల్‌కు తరలింపు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial