ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం


మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ చేత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. బాత్ రూంలో జారి పడటంతో తుంటికి గాయమైన కేసీఆర్ స్టిక్ సాయంతో మెల్లగా నడుస్తున్నారు. కొత్ బెంజ్ కారులో  వచ్చిన ఆయనకు అసెంబ్లీ వద్ద పార్టీ నేతలు స్వాగతం  పలికారు.  సీఆర్ వెంట బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనాచారి, మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కేసీఆర్ తన చాంబర్ లో ప్రత్యేక పూజల అనంతరం స్పీకర్ కార్యాలయంకు వెళ్లి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా చదవండి


రేవంత్ పాతమిత్రుడు , త్వరలో కలుస్తా - బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి


ఒకరి తర్వాత ఒకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకమాండ్ కు షాక్ ఇస్తున్నారు. తాజాగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ( MLA  Mallareddy ) తాను త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానన్నారు. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి కూడా మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. తెలంగాణ భవన్‌లో  మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.  నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేముంది అని ఆయన వ్యాఖ్యానించారు.  రేవంత్ రెడ్డి తనకు పాత మిత్రుడని.. గతంలో ఇద్దరం టీడీపీలో కలిసి పనిచేసిన వాళ్లమే అని అన్నారు. చర్చకు తావులేకుండా కలిసే ముందు మీడియాకు సమాచారం ఇస్తా అని చెప్పుకొచ్చారు. ఇంకా చదవండి


విశాఖ ఎంపీగా బరిలోకి జీవీఎల్‌


విశాఖపట్నం ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహరావు జోరుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా పోటీ చేసినా, ఒంటిరిగా పోటీ చేసినా ఇక్కడి నుంచి బరిలో దిగేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. గడిచిన నాలుగేళ్ల నుంచి విశాఖ వేదికగానే ఆయన రాజకీయ కార్యాకలాపాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు పేరుతో భారీ ఎత్తున పండగను నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను బీచ్‌ రోడ్డులో జీవీఎల్‌ ఆధ్వర్యంలో రెండురోజులపాటు ఉత్సాహ భరిత వాతావరణంలో నిర్వహించారు. ఇవన్నీ నిర్వహించడం వెనుక వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్‌ స్థానానికి జీవీఎల్‌ పోటీ చేయడమేనని చెబుతున్నారు. ఇందుకు కేంద్ర అధినాయకత్వం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు చెబుతున్నారు. పొత్తు కుదిరితే ఉమ్మడి అభ్యర్థిగా విశాఖ నుంచి ఆయన బరిలో ఉంటారు. పొత్తు లేకపోయినా పోటీ చేసేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇంకా చదవండి


కాంగ్రెస్‌ లోక్‌సభ టిక్కెట్లకు ఫుల్ డిమాండ్


పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్ధమయింది. జాతీయ  పార్టీకి అవసరమైన లోక్ సభ సీట్లను అంచనాలకు తగ్గట్లుగా అందించి  హైకమాండ్ వద్ద మరింత నమ్మకం  పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో పది కంటే ఎక్కువ స్థానాలు గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఊహించని స్థాయిలో బలపడుతుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మఖ్య నేతలంతా  లోక్‌సభ సీట్లలో గెలుపును అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకుంటున్నారు. ఇంకా చదవండి


ఏకతాటిపైకి ఆ ముగ్గురు నేతలు.. అచ్చెన్నాయుడును ఓడించడమే లక్ష్యమా?


ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ (Telugudesam) అధ్యక్షుడు (President) అచ్చెన్నాయుడు (Achennaidu)ను ఓడించేడమే లక్ష్యంగా అధికార వైసీపీ (Ycp) పావులు కదుపుతోంది. స్థానికంగా బలమైన సామాజిక వర్గానికి కీలక పదవులు కట్టబెట్టడం ద్వారా అచ్చెన్నాయుడుపై పైచేయి సాధించవచ్చని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. 1996, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో హరిశ్చంద్రాపురం నియోజకవర్గం నుంచి గెలుపొంది..హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నారు అచ్చెన్నాయుడు. నియోజకవర్గాల పునర్విభజనతో టెక్కలి అసెంబ్లీ స్థానానికి మారిపోయారు. 2009లో ఓటమి పాలయ్యారు. ఇంకా చదవండి