వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐకి స్టేట్‌మెంట్ ఇచ్చా, ఆ వివరాలు బయటకు ఎలా? - అజేయకల్లాం!


వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  తన స్టేట్‌మెంట్ సీబీఐ నమోదు చేసిందని ఏపీ ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరు అయిన అజేయకల్లాం ప్రకటించారు. కొన్ని మీడియాల్లో ఆయన స్టేట్ మెంట్ సీబీఐ నమోదు చేసిందని ..  గుండెపోటుతో మరణించారని చెప్పారని.. సమయం మాత్రం గుర్తు లేదన్నారని ప్రచారం జరిగింది. దీంతో  వివరణ ఇచ్చేందుకు ఆయన మీడియా సమావేశం పెట్టారు. సీబీఐకి తాను ఇచ్చిన స్టేట్‌మెంట్ ఎందుకు లీకయిందని ఆయన ప్రశ్నించారు. ఇదంతా రహస్య సమాచారం అని.. సీబీఐ దగ్గర నుంచి ఎలా లీక్ అయిందని ప్రశ్నించారు. వీటిని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. మీడియాలో తాను వివేకానందరెడ్డి గండెపోటుతో చనిపోయారని  జగన్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోందని.. తన నోటి వెంట అసలు గుండెపోటు అనే మాటే  రాలేదని ఆయన స్ఫష్టం చేశారు. తనపై వచ్చిన వార్తలపై అవసరం అయితే కోర్టుకు వెళ్తానని అజేయ కల్లాం హెచ్చరించారు. ఇంకా చదవండి


ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు షరతులపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం


వివేకా హత్య కేసు నిందితుడు గంగి రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై సీజేఐ చంద్రచూడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బెయిల్‌ను రద్దు చేసి మళ్లీ ఫలానా రోజున విడుదల చేయాలంటూ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఉత్తర్వులను పరిశీలించిన సీజేఐ ధర్మాసనం ప్రతివాదులకు  నోటీసులు జారీ చేసింది. విచారణను వెకేషన్ బెంచ్‌కి బదిలీ చేసింది. సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ వచ్చేవారం విచారణ జరపనుంది. ఇంకా చదవండి


హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రోకు 9 స్టేషన్లు, భవిష్యత్తులో మరో 4 ఏర్పాటు చేసే యోచన


హైదరాబాద్‌లోని రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిలో మీటర్ల మార్గంలో తొమ్మిది మెట్రో స్టేషన్లు నిర్మించాలని హైదారాబ్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ భావిస్తోంది. రాయదుర్గం వద్ద మొదటి స్టేషన్ ప్రారంభం కాగా ఆ తర్వాతి స్టేషన్లు.. బయోడైవర్సిటీ కూడలి, నానక్ రాంగూడ కూడలి, నార్సింగి, అప్పా కూడలి, రాజేంద్రనగర్, శంషాబాద్ పట్టణం, విమానాశ్రయంలో జారీయ రహదారికి కొద్ది దూరంలో, విమానాశ్రయం టెర్మినల్ లో భూగర్భ మెట్రోస్టేషన్‌తో ముగియనున్నట్లు తెలుస్తోంది. అయితే వంపులు లేని చోట్ల స్టేషన్లు నిర్మిస్తారు. సమస్యలు ఉంటే మార్పులు, చేర్పులకు అవకాశం ఉండేలా స్టేషన్ల మార్కింగ్ ఉండనుంది. మెట్రో ప్రయాణ వేగం, బ్రేకింగ్ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని వాటిని ఖరారు చేస్తారు. అయితే భవిష్యత్తులో మరో నాలుగు స్టేషన్లు కూడా ఏర్పాటు చేసుకునేలా అలైన్ మెంట్ ను డిజైన్ చేశారు. భవిష్యత్తులో నార్సింగి, అప్పాకూడలి మధ్య మంచిరేవుల వద్ద ఒక స్టేషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అలాగే అప్పాకూడలి, రాజేంద్రనగర్ మధ్యలో కిస్మత్ పూర్ లోనూ ఓ స్టేషన్ నిర్మిస్తారట. రాజేంద్రనగర్ నుంచి శంషాబాద్ పట్టణం మధ్యలో చాలా దూరం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఓ స్టేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జనావాసాలు పెరిగితే మరో స్టేషన్ ను కూడా నిర్మించే యోచనలో హెచ్ఏఎంఎల్ ఉంది. ఇంకా చదవండి


తెలంగాణకు అమెరికా వైద్య పరికరాల దిగ్గజం


అమెరికాకు చెందిన మరో భారీ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకిరంచింది.  వైద్య పరికరాల తయారీ రంగంలో పేరొందిన మెడ్‌ ట్రానిక్ ‌ కంపెనీ 3 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లో ఈ భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌తో... కంపెనీ ప్రతినిధులు చర్చలు జరిపారు. అనంతరం ఈ ప్రకటన చేశారు. మెడ్ ట్రానిక్‌ నిర్ణయాన్ని స్వాగతించారు మంత్రి కేటీఆర్‌. వైద్య పరికరాల తయారీ, అభివృద్ధి రంగంలో హైదరాబాద్‌ గ్లోబల్‌ హబ్‌గా మారిందని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ బహుళ జాతి కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరిస్తున్నారు. హైదరాబాద్‌కు వచ్చిన బహుళజాతి కంపెనీల గురించి వివరిస్తున్నారు. ఇంకా చదవండి


ఫాస్ట్ 10 రివ్యూ: ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్‌లో లేటెస్ట్ సినిమా ఎలా ఉంది?


ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ మూవీ ఫ్రాంచైజీల్లో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్’కు మంచి క్రేజ్ ఉంది. ఫైట్ అయినా, ఛేజ్ అయినా, సినిమాలో యాక్షన్‌కు సంబంధించిన ఏ ఎలిమెంట్ అయినా అది కార్లతోనూ, రేసింగ్‌తోనూ ముడిపడి ఉండటం దీని స్పెషాలిటీ. ఈ సిరీస్‌లో 10వ సినిమా ‘ఫాస్ట్ X’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ స్టార్ కాస్టింగ్, నమ్మశక్యం కాని యాక్షన్ సీన్లు ఇందులో ఉండనున్నట్లు టీజర్, ట్రైలర్‌లను చూస్తే అర్థం అవుతుంది. మరి సినిమా ఎలా ఉండబోతుంది? ఇంకా చదవండి