కిడ్నాప్ కలకలం 


విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఎంపీ భార్య , కుమారుడితో పాటు ప్రముఖ ఆడిటర్ జీవిని కిడ్నాప్ చేశారు. రుషికొండ సమీపంలో ఎంపీ ఇల్లు ఉంది. ఆయన వ్యాపార వ్యవహారాల నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ సమయంలో ఇంట్లొకి చొరబడిన దుండగులు..  ఎంపీ భార్య, కుమారుడ్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారి ద్వారా ఆడిటర్ జీవీని కూడా పిలించి ..ఆయనను కూడా కిడ్నాప్ చేశారు. ఆడిటర్ జీవీ స్మార్ట్ సిటీ కార్పొరేష్ మాజీ డైరక్టర్ కూడా.  ఈ కిడ్నాప్ .. హైదరాబాద్‌లో ఉన్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పందించారు. ఈ ఘాతుకానికి పాల్పడింది రౌడీషీటర్ హేమంత్ అని చెబుతున్నారు. ఇంకా చదవండి


 


చెప్పు రాజకీయం


చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చేందుకే పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారు ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. రోజుకో డైలాగ్ చెప్పి అదో వ్యూహంగా అందర్నీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మొదటి నుంచి జనసేనను నడిపించేది చంద్రబాబు అని ఆరోపించారు. దీనిపై ఆయన చెప్పులు చూపిస్తే తాను రెండు చెప్పులు చూపిస్తానంటూ రెండు చెప్పులు తీసి చూపించారు పేర్ని నాని. ఇంకా చదవండి


 


కొనసాగుతున్న సోదాలు


ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గత రెండు రోజులుగా బిఆర్ఎస్ పార్టీకు చెందిన ఎమ్మెల్యేల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. భువనగిరికి చెందిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అలాగే నాగర్ కర్నూల్ కు చెందిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు నిర్వహిస్తోన్న సోదాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో ఉన్న మర్రి జనార్దన్ నివాసానికి భారీగా అనుచరులు చేరుకుంటున్నారు. ఇంకా చదవండి


 


బాసర ట్రిపుల్ ఐటిలో కలకలం


బాసర ఆర్జీయూకేటీలో ఏం జరుగుతోంది. వరుసగా విద్యార్థుల మరణాలు కలకలం రేపుతున్నాయి. వారం వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థినుల మృతి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. దీనిపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. వారం వ్యవధిలోనే మరో విద్యార్థిని చనిపోవడం బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం రేగింది. రెండు రోజుల క్రితం పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న దీపిక అనే విద్యార్థిని మూత్రశాలలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన నుంచి తేరుకోకముందే గురువారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల లిఖిత అనే విద్యార్థిని వసతి గృహం నాలుగో అంతస్తు నుంచి కిందపడి చనిపోయింది. అయితే లిఖితకు తీవ్ర గాయాలు కాగా.. విషయం గుర్తించిన విద్యార్థినులు యాజమాన్యానికి తెలిపారు. స్పందించిన యాజమాన్యం వెంటనే బాలికను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత భైంసా ఆసుపత్రికి.. మెరుగైన వైద్యం కోసం మళ్లీ నిర్మల్ కు పంపించారు. అయితే లిఖిత అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇంకా చదవండి


 


ఐసెట్ ఫలితాలు విడుదల 


ఏపీ ఐసెట్ ఫలితాలు జూన్ 15న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 24న ఈ పరీక్షను నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరిగింది. ఐసెట్‌లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా 2023 విద్యా సంవత్సరానికి ఫుల్‌టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 44 వేల మందికి పైగా విద్యార్థులు రాశారు. ఇంకా చదవండి