మీ సీఎంను మీరే అనుమానిస్తున్నారు - మంత్రి ఉత్తమ్‌పై మహేశ్వర్ రెడ్డి ఫైర్
తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై జరుగుతున్న రాజకీయంపై బీజేపీ వర్సెస్ మంత్రి ఉత్తమ్ అన్నట్లుగా సీన్ మారింది. ఉత్తమ్ ఆరోపణలపై బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించాు.  తాను చేసిన ఆరోపణల మీద ఇన్ని రోజులకైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించినందుకు ధన్యవాదాలని.. కానీ  తాను 19 ప్రశ్నలతో సీఎం కు లేఖ రాశానని..  ఇందులో ఒక్క ప్రశ్నకు మాత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డి  సమాధానం ఇచ్చారన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కౌంటింగ్‌కు ఇంకా 8 రోజుల సమయం - ఆ మూడు జిల్లాపైనే అధికారులు స్పెషల్ ఫోకస్
ఏపీలో ఓట్ల లెక్కింపునకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియడానికి మరో వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఓట్ల లెక్కింపు దగ్గర పడుతుండడంతో ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ తర్వాత ఘర్షణలు జరిగిన నేపథ్యంలో దృష్ట్యా కౌంటింగ్‌కు గట్టి జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల వద్ద  మూడు అంచెల భద్రత ఏర్పాట్లు చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తర్వాత తెగిపోనున్న ఉమ్మడి బంధం- ఇంకా తేలని హైదరాబాద్‌లో ఆస్తుల పంచాయితీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (Telangana) విభజన (Andhra Pradesh Bifurcation) జరిగి దాదాపు 10 ఏళ్లు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం (AP Re-Organisation Act) ప్రకారం హైదారాబాద్ 10 ఏళ్లపాటు ఉమ్మడి రాజధాని గా నిర్ణయించారు. ఈ మేరకు 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 1 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.  జూన్ రెండో తేదీతో ఈ గడువు ముగియనుంది. దాని తరువాత హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత - రాజకీయ ప్రముఖుల సంతాపం
మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి (Yerneni Sita Devi) కన్నుమూశారు. సోమవారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్‌లో (Hyderabad) ఆమె తుదిశ్వాస విడిచారు. సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి టీడీపీ తరఫున ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ కేబినెట్‌లో విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. సీతాదేవి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తెలంగాణ అధికారిక చిహ్నంలోనూ కీలక మార్పులు
తెలంగాణ రాష‌్ట్ర పదో అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని కూడా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు.   తెలంగాణ తల్లి, రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలని రాష్ట్ర కేబినెట్​లో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవం ప్రతిబించించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకువస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.  త్తందార్లపై తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ, రజాకార్లపై తుపాకీ ఎక్కుపెట్టిన మల్లు స్వరాజ్యం వంటి వారి ఉద్యమస్ఫూర్తి కనిపించేలా విగ్రహం రూపుదిద్దుకుంటున్నట్లు పేర్కొన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి