Uttam Vs Maheshwar Reddy : మీ సీఎంను మీరే అనుమానిస్తున్నారు - మంత్రి ఉత్తమ్‌పై మహేశ్వర్ రెడ్డి ఫైర్

BJP LP leader Maheshwar Reddy : తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి ఫైరయ్యారు. సీఎం రేవంత్‌ను మీరే అనుమానిస్తున్నారని అన్నారు.

Continues below advertisement

Telangana Politics :   తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై జరుగుతున్న రాజకీయంపై బీజేపీ వర్సెస్ మంత్రి ఉత్తమ్ అన్నట్లుగా సీన్ మారింది. ఉత్తమ్ ఆరోపణలపై బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించాు.  తాను చేసిన ఆరోపణల మీద ఇన్ని రోజులకైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించినందుకు ధన్యవాదాలని.. కానీ  తాను 19 ప్రశ్నలతో సీఎం కు లేఖ రాశానని..  ఇందులో ఒక్క ప్రశ్నకు మాత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డి  సమాధానం ఇచ్చారన్నారు. తాను  మాట్లాడిన మాటలకు మంత్రి నాపై పర్సనల్ ఎటాక్ చేస్తున్నారని..  తాను పైరవీ చేసి BJLP పోస్ట్ తెచ్చుకున్నానని చేసిన  కామెంట్ సరికాదున్నారు.  

Continues below advertisement

బీజేపీ లో అందరి సమన్వయంతో  తనను బీజేఎల్పీ నేతగా ఎన్నుకున్నారని గుర్తు చేశారు.  ఉత్తమ్‌తో కలిసి  పదేళ్లు పని చేశాను  .. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు పీసీసీ ఎలా తెచ్చుకున్నారో నాకు తెలీదా అని  ప్రశ్నించారు.  మీలా దిగజారి ఆరోపణలు చేయలేను .. మా అధ్యక్షుడు అనుమతితో నే నేను సీఎం ను కలవడానికి వెళ్ళాననని స్పష్టం చేశారు.  నీవు దాన్ని కూడా అనుమాన పడేలా మాట్లాడితే అది మీ సీఎం ను అవమానించడమేనని స్పష్టం చేశారు.  R ట్యాక్స్, B ట్యాక్స్ పై మాట్లాడినప్పుడు స్పందించలేదు .. U ట్యాక్స్ పై మాట్లాడినప్పుడు మాత్రం స్పందించారంటే అవినీతి ఎంత జరిగిందో అర్థం అవుతుందని స్పష్టం చేశారు.  బకాయిలు ఉన్న రైస్ మిలర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.. ?  డి - ఫాల్టర్ల పేర్లను బయట పెడతారా ? అని సవాల్ చేశారు. 

తరుగు పై మంత్రి ఏనాడైనా క్షేత్ర స్థాయిలో ఎపుడైనా పరిశీలించారా లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.  కుంభకోణాలు కళ్లముందు కనిపిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.  ఏప్రిల్ 18న జలసౌధలో మిల్లర్ల తో జరిగిన చర్చల వివరాలను ఎందుకు బయట పెట్టడం లేదో చెప్పాలన్నారు.  
35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు 4 కంపెనీలకు అప్పజెప్పారు .. మీకు FCI ఇచ్చిన గడువు మే 15 న ముగిసింది .. FCI ఇచ్చిన గడువు కంటే కాంట్రాక్టర్ల కు మరో నాలుగు నెలలు అదనపు సమయం ఇవ్వడం ఎంటని ప్రశ్నించారు. 

90 రోజుల్లో ధాన్యం లిఫ్ట్ చేయని కాంట్రాక్టర్ల మీద చర్యలు ఏమైనా తీసుకుంటారా?   రైస్ మిల్లర్లకు భయపెట్టి వంద రూపాయల స్టంప్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకుంది వాస్తవం కాదా అనేది చెప్పాలన్నారు.  మిల్లర్లు సంతకాలు పెట్టిన బాండ్ పేపర్ బయట పెడుతున్నానన్నారు.  గడువు ముగిసిన ఒక్క బస్తా  ధాన్యం కూడా fci కి ఇవ్వలేదుని..  దీని వెనకున్న మతలబేంటో చెప్పాలన్నారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి కి  మహేశ్వర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ ఇచ్చారు. తాను  రాజకీయంగా మాట్లాడితే .. మీరు పర్సనల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తాను పర్సనల్ గా తీసుకుంటే మీరు చాలా నష్టపోక తప్పదు.. ఇది బాగోదు జాగ్రత్త అని హెచ్చరించారు.  వేలెత్తి చూపిస్తే ... మీ కుందేళ్ళ సప్పుడుకి  ఇక్కడ ఎవరు భయపడరని..  సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో జరిగిన అవినీతి పై సిట్టింగ్ జడ్జితో తో విచారణ లేదా సీబీఐ కి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు.  

 

Continues below advertisement