Ex Minister Yerneni Sita Devi Passed Away: మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి (Yerneni Sita Devi) కన్నుమూశారు. సోమవారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్‌లో (Hyderabad) ఆమె తుదిశ్వాస విడిచారు. సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి టీడీపీ తరఫున ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ కేబినెట్‌లో విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. సీతాదేవి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె పార్థీవదేహాన్ని సోమవారం సాయంత్రం స్వగ్రామానికి తరలించనున్నారు. అక్కడే అంత్యక్రియలు జరగనున్నాయి.


సీతాదేవి కుటుంబానికి సైతం రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె భర్త నాగేంద్రనాథ్ (చిట్టిబాబు) ఏపీ రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా, కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టా డ్రైనేజీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. ఆయన గతేదాడి కన్నుమూశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. నాగేంద్రనాథ్ సోదరుడు దివంగత యెర్నేని రాజారామచందర్ కైకలూరు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.


Also Read: Cyclone Remal: తెలుగు రాష్ట్రాల్లో రెమాల్ బీభత్సం, 24 గంటల్లో 15 మంది దుర్మరణం