Director Sujeeth About Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఓజీ’. యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ ఎండింగ్ కు వచ్చింది. ఈ నేపథ్యంలోనే మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు దర్శకుడు సుజీత్.


పవన్ కల్యాణ్ కు వివపరీతమైన నాలెడ్జ్ ఉంది- సుజీత్


‘భజే వాయు వేగం’ ప్రమోషన్స్ లో భాగంగా ఆ సినిమా హీరో కార్తికేయ, దర్శకుడు సుజీత్ ను ఓ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ‘ఓజీ’ మూవీతో పాటు పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘ఓజీ’ ఫస్ట్ డే షూటింగ్ సమయంలోనే పవన్ కల్యాణ్ బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అని తెలిసిపోయిందన్నారు.“‘ఓజీ’ ఫస్ట్ డే షూట్ చేసేటప్పుడు బాంబేలో ఉన్నాం. గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర షూట్ చేస్తున్నాం. తొలి రోజే ఆయనకు చాలా నాలెడ్జ్ ఉందని అర్థం అయ్యింది. ఆయనకు సినిమాలో చేయబోయే తర్వాత సీన్లు ఏంటి అనేది ఈజీగా అర్థమైపోతుంది. మనం ఇచ్చే ఇన్ ఫుట్స్ ను బట్టే తను ఎలా చేయాలి అనేది 80 శాతం అర్థం చేసుకుంటారు. సీన్లు బాగా చదివి అర్థం చేసుకుంటారు. రెండో రోజు షూటింగ్ లో ఓ సీన్ చదివి చాలా ఎగ్జైట్ అయ్యారు. సీన్ బాగా చేయాలి అన్నారు. ఆ సినిమాకు ఆ సీన్ చాలా హెల్ప్ అయ్యింది” అని చెప్పుకొచ్చారు.


పవన్, ప్రభాస్ జెన్యూస్ పర్సన్స్- సుజీత్


ఇక పవన్ కల్యాణ్, ప్రభాస్ చాలా జెన్యూస్ పర్సన్స్ అని సుజీత్ చెప్పుకొచ్చారు. “పవన్ కల్యాణ్, ప్రభాస్ చాలా జెన్యూస్ పర్సన్స్. వాళ్లతో సినిమా చేస్తుంటే ఎలాంటి సమస్యలు రావు. వాళ్లతో ఇలా ఉండాలి. అలా ఉండాలి అనేలా ప్రవర్తించరు. వాళ్ల వర్క్ ఏదో వాళ్లు చేసుకుంటూ వెళ్లిపోతారు. ప్రభాస్ చిన్న వారికి కూడా చాలా గౌరవం ఇస్తారు. పవన్ కల్యాణ్  ఎప్పుడూ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఉంటారు. కంటిన్యూస్ గా బుక్స్ చదువుతూ ఉంటాడు. కొత్త విషయాలను తెలుసుకుంటాడు. ఆయనకు మనం చెప్పిన సీన్ నచ్చిందంటే అద్భుతంగా చేస్తారు” అని వెల్లడించారు.


పవన్ సినిమాలపై జపనీస్ సినిమాల ప్రభావం ఎక్కువ- సుజీత్


ఇక పవన్ కల్యాన్ సినిమాల్లో జపనీస్ మూవీస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని సుజీత్ అభిప్రాయపడ్డారు. ఫైట్స్ తో పాటు పాటల్లోనూ ఆ ప్రభావం కనిపిస్తుందన్నారు. ‘ఓజీ’ సినిమా కథ చెప్పే సమయంలో కేవలం ఒకే ఒక్క లైన్ చెప్పగానే తను మూవీ చేస్తున్నట్లు చెప్పారని సుజీత్ చెప్పారు. ‘ఓజీ’ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు.  


Read Also: వాళ్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.. ‘సలార్ 2’ రూమర్స్‌ పై అదిరిపోయే పంచ్