Telangana Symbol Change :  తెలంగాణ రాష‌్ట్ర పదో అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని కూడా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు.   తెలంగాణ తల్లి, రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలని రాష్ట్ర కేబినెట్​లో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవం ప్రతిబించించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకువస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.  త్తందార్లపై తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ, రజాకార్లపై తుపాకీ ఎక్కుపెట్టిన మల్లు స్వరాజ్యం వంటి వారి ఉద్యమస్ఫూర్తి కనిపించేలా విగ్రహం రూపుదిద్దుకుంటున్నట్లు పేర్కొన్నాయి. తెలంగాణ చిహ్నంలోనూ ఉద్యమ స్ఫూర్తి, అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా మార్పులు చేస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి రాచరిక పోకడల్ని తీసేస్తామని ప్రకటించారు.    


మార్పు చేర్పులపై రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ చర్చలు               


తెలంగాణ చిహ్నంపై  తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. పలు నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేసి కొత్త చిహ్నం రెడీ చేయిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఫైనల్ చేసి రెండో తేదీన అవతరణ దినోత్సవం రోజున ప్రకటించే అవకాశం ఉంది.    ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ సాధనలో పనిచేసిన వాళ్లను ఘనంగా సన్మానించాలని భావిస్తున్నారు.                   


తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది తామేనంటున్న కాంగ్రెస్             


తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది తామేనని చెబుతున్న కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఉత్సవాలు కావడంతో అత్యంత భారీగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.  అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ పాటను తెలంగాణ గీతంగా ప్రకటించారు. ఇప్పుడు దానికి ట్యూన్​ కంపోజ్​ చేయిస్తున్నారు. రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ చేతుల మీదుగా జూన్​ 2న రాష్ట్ర గీతాన్ని రిలీజ్​ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోనియా గాంధీ చేతుల మీదుగా వీటిని విడుదల చేయనున్నారు.   సబ్బండ వర్గాల ఆత్మగౌరవం ప్రతిబిబించేలా.. చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం ఉంటాయని చెబుతున్నారు.          


జూన్ రెండో తేదీన  భారీగా అవతరణ దినోత్సవం  నిర్వహణ           


తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చిన  బీఆర్ఎస్ పార్టీ అన్నీ రాచరిక పోకడలతో  పాలన చేసిందని రేవంత్ రెడ్డి విమర్శిస్తూ ఉంటారు. కాకతీయ కళాతోరణాన్ని కూడా ఆయన రాచరిక పోకడగానే చెబుతారు. ప్రస్తుతం తెలంగణ చిహ్నంలో ఉన్న ఆ తోరణాన్ని తొలగించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని గమనించి  బీఆర్ఎస్ పార్టీ నేతలు.. కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ చిహ్నంలోనుంచి తీసేసే ప్రయత్నం చేస్తున్నారన.ి. వరంగల్ యువత తిరగబడాలని పిలుపునిచ్చారు.