Virat Kohli: అనుకున్నట్టే జరిగింది. మైదానంలో పరుగుల వరద పారించి, రన్ మెషీన్గా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ(Virat Kohli) ఐపిఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడుగా ఆరెంజ్ కేప్(Orange Cap) అందుకున్నాడు. అంతే కాదు 17 ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో రెండోసారి ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఏకైక భారత ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టించాడు.  అవార్డు స్వీకరించటానికి   కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో  కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరెంజ్ క్యాప్​ను అందుకున్నాడు. 


కోహ్లీ  15 మ్యాచ్ లు ఆడి వాటిలో  1 సెంచరీ, 5 హాఫ్ సెంచరీలతో మొత్తం  741 రన్స్ చేశాడు. అత్యధిక పరుగులతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఎందుకంటే కోహ్లీ తరువాత స్థానంలో ఉన్నాడు చెన్నై సూపర్ కింగ్స్(CSK) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ . అతడు  మొత్తం 14 మ్యాచ్ లు ఆడి  1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో 583 రన్స్ చేశాడు.. ఈ లెక్కన కోహ్లీకి, రుతురాజ్ కి తేడా సుమారు 150 పరుగుల పైమాటే. తరువాత మూడవ స్థానంలో ఉన్నాడు రాజస్థాన్ రాయల్స్(RR) ప్లేయర్ రియాన్ పరాగ్.  రియాన్ కూడా రుతురాజ్ లాగానే  14 ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ లేకపోయినా  4 హాఫ్ సెంచరీలతో 573 రన్స్ చేశాడు. ఇక్కడ వీరిద్దరికీ తేడా పది పరుగులు మాత్రమే. ఇక ఆ తరువాత స్థానంలో వరుసగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఉన్నాడు. విచిత్రం ఏంటంటే  ఐపీఎల్ 2024 ట్రోఫీ అందుకున్న  కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున టాప్ 10లో ఒకే ఒక్క బ్యాటర్, అది కూడా 9 వ స్థానంలో ఉన్నాడు. అతనే  సునీల్ నరైన్.  నరైన్  14 ఇన్నింగ్స్ లో 1 సెంచరీ, 3 హాఫ్ సెంచరీతో 488 పరుగులు చేశాడు. ఇక చివరి మ్యాచ్లో అయితే ఘోరంగా విఫలం అయ్యారు. అయినా సరే సమిష్టి కృషితో కోల్‌కతా విజయం సాధించింది. 


ఫైనల్ ఫైట్​లో విజయం అయ్యర్ సేనదే.. 


చెన్నై  చెపాక్ స్టేడియంలో జరిగిన ఫైనల్ ఫైట్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ను 8 వికెట్ల భారీ తేడాతో ఓడించిన అయ్యర్ సేన ముచ్చటగా మూడవసారి ఛాంపియన్​గా అవతరించింది.   టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసిన సన్​రైజర్స్​ 18.3 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. సైకిల్ స్టాండ్ లో మాదిరి వికెట్లన్నీ కుప్పకులాయి, గత మ్యాచ్ లలో  సెంచరీలు బాదిన ఒక్క ఆటగాడు కూడా 25 పరుగులు దాటలేకపోయాడు అంటేనే తెలుస్తుంది కొలకత్తా ఎంత గట్టిగా బౌలింగ్ చేసిందో. తరువాత  ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన కేకేఆర్ అదే  లెవెల్ లో అద్భుతం చేసింది . నిర్ణీత లక్ష్యాన్ని 10.3 ఓవర్లలోనే  అందుకుంది. కీలకమైన 2 వికెట్లు తీసిన  మిచెల్ స్టార్క్​కు ప్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఐపిఎల్ టోర్నీ అంతా  అటు బౌలింగ్ , ఇటు బ్యాటింగ్ లో అదరగొట్టిన సునీల్ నరైన్​కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్  దక్కింది. ఇక, కప్పు కొట్టలేకపోయినా  ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రేజీ రికార్డ్ క్రియేట్ చేశాడు.  మొత్తం 15 మ్యాచ్‌లలో 61.75 సగటు , 154.69 స్ట్రైక్ రేట్‌తో 741 పరుగులు చేశాడు.  ఐపిఎల్ లో ఓ సెంచరీ కూడా చేశాడు. వీటితోపాటూ  17 ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో రెండోసారి ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఏకైక భారత ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టించాడు.