Satyabhama Today Episode : సత్య కనిపించకపోవడంతో అందరూ టెన్షన్ పడతారు. మొత్తం వెతుకుతారు. ఇక సత్య తీరికగా గుడి నుంచి వస్తుంది. హర్ష వాళ్లు చెప్పకుండా ఎందుకు వెళ్లావని అడిగితే క్రిష్ సత్యని లాగిపెట్టి ఒకటి కొడతాడు. తన బాధ అంతా చెప్తాడు.


క్రిష్: నిజమే రాత్రి నీకు ఇష్టం లేని పని చేశాను. కోపం తెప్పించా.. కొట్లాడా అందుకని నన్ను పట్టించుకోవా.. వదిలేస్తావా నేను ఏమీకానా నీకు.


చక్రవర్తి: ఆ మాట అనలేదు కదరా..


క్రిష్: నాకు చెప్పకుండా గుడికి వెళ్లడం కూడా తప్పే. నన్ను తీసి పక్కన పెట్టినట్లే కదా. ఆ పోకిరి గాళ్లు నిన్ను ఏం చేశారో అని ఇప్పటి వరకు ఏం అయిపోయావో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా. ఊపిరి ఆగినంత పని అయింది. నీకు ఏమైనా జరిగుంటే నేను ఏమైపోవాలి. నువ్వు ఒక్క నిమిషం కనిపించనందుకే లోకమంతా శూన్యమైపోయింది. చచ్చి బతికాను. నీకు అది అర్థం కాదు. మొత్తం నాటకం లెక్క అనిపిస్తుంది అంతే కదా. నీకే కాదు నాకు మనసు ఉంటుంది. దానికి ఫీలింగ్స్ ఉంటాయి. బాధ ఉంటుంది. కన్నీళ్లు ఉంటాయి. అది ఎప్పటికి తెలుసుకుంటావ్. ఎట్లా చెప్తే నీకు అర్థమవుతుంది. నేను చెప్పేవన్నీ నీజాలే కానీ అన్ని నిజాలకు రుజువులు ఉండవు. కళ్లలో బాధ చూసి నమ్మాలి కన్నీళ్లు చూసి నమ్మాలి. నువ్వు నీ కన్నోళ్లకే సొంతం కాదు. నిన్ను ఇష్ట పడే మనిషికి కూడా సొంతమే. ఈ మనిషికి కూడా నీ గురించి ఆలోచించే హక్కు ఉంది. నీ గురించిన బాధ్యత ఉంది. అంతకు మించి గుండె నిండా ప్రేమ ఉంది. ఎప్పుడూ అనుమానంతోనే కాదు ఒక్కసారి అయినా మనసుతో ఆలోచించు. ఈ జన్మకు కాకపోయినా కనీసం వచ్చే జన్మకు అయినా అర్థం అవుతుంది. అని క్రిష్ తన చేతిని చెట్టుకున్న మేకుకు కొట్టుకుంటాడు. అందరూ కంగారు పడతారు. క్రిష్ ఎవర్నీ దగ్గరకు రావొద్దు అంటాడు. నాకే ఏం కాదు. ఇంత కంటే పెద్ద గాయాలే తగిలాయి. బయటకు అయిన గాయాలే అందరికీ కనిపిస్తాయి. మనసుకి అయిన గాయాలు ఎవరికీ కనిపించవు. 


చక్రవర్తి: ఇన్నాళ్లు నువ్వు చూసిన క్రిష్ వేరు ఇప్పుడు చూస్తున్న క్రిష్ వేరు అనిపిస్తుంది కదా. మనసు కదిలితేనే కానీ కనీళ్లు వస్తాయి. వాడి బాధని అర్థం చేసుకో. కొట్టాడు అని కాదు. ఎందుకు కొట్టాడో అని ఆలోచించు. కోపంతో కాదు బాధతో కొట్టాడు. బాధతో మాట్లాడాడు. నువ్వు లేకపోతే ఏమైపోతానో అన్న ఊహ భరించలేక అరిచాడు. నీకు ఏమైపోయిందా అని ఈ కొద్ది సేపు వాడు పిచ్చొడిలా అయిపోయాడు. చిన్నా మొరటోడే కాని మంచోడమ్మా. వాడు నీకు ఇష్టం లేదు. కానీ వాడు కట్టిన తాళిని గుండెల మీద దాచుకున్నావు. తాళిని గుండెల మీద దాచుకోవడం కాదమ్మా. వాడి ప్రేమను గుండెల్లో దాచుకో. ఒక్క రోజులోనే మీ ప్రేమ గురించే నేను ఇంత తెలుసుకుంటే నెల రోజుల నుంచి వాడితో ఉన్న నీకు ఇంకెంత తెలియాలి. జరిగిన కథ నీకు నచ్చనప్పుడు మిగిలిన కథ అయినా నీకు నచ్చినట్లు మార్చుకో. 


నందిని, హర్ష క్రిష్ దగ్గరకు వచ్చి గాయానికి మందు పెట్టాలని చూస్తే క్రిష్ నందిని మీద అరిచి వెళ్లిపోమని చెప్తాడు. ఇక సత్య క్రిష్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. గదిలోకి వచ్చి క్రిష్ దగ్గరకు వస్తుంది. క్రిష్ సత్యని చూసి బయటకు వెళ్లబోతే ఒక్కనిమిషం ఉండమని అంటుంది. క్రిష్ పక్కనే కూర్చొని కట్టు కడుతుంది. 


సత్య: తప్పు నేనే చేస్తే నువ్వు ఎందుకు శిక్షించుకుంటావు. అన్ని బాధలు బాధనే ఇస్తాయి. కానీ కొన్ని బాధలే తృప్తిని ఇస్తాయి. మనసుని కరిగిస్తాయి. ఇంకొక్కసారి మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లను. ఇబ్బంది పెట్టను సారీ. 


మహదేవయ్య బయట కూర్చొంటే భైరవి కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది. పిల్లలు లేక ఏదోలా ఉంది అని అంటుంది. ఇక రుద్రని బయటకు వెళ్లమని అంటే నీ ఒక్కడిని వదిలిపెట్టి వెళ్లలేను అని అంటాడు. తన గురించి ఫికర్ చేయొద్దని మహదేవయ్య అంటాడు. ఇక రుద్ర అక్కడ ఉన్న నౌకరులకు తండ్రిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్తాడు. 


మరోవైపు క్రిష్ సత్య కోసం చీర కొని తీసుకురమ్మని తన బాబాయ్‌కి చెప్తాడు. చక్రవర్తి క్రిష్ సెలక్ట్ చేసిన చీరని తీసుకొని వస్తాడు. ఇక సత్య బట్టలు సర్దుతూ ఉంటుంది. క్రిష్ అక్కడికి చీర తీసుకొని వస్తాడు. సత్య దగ్గర బట్టలు చూసి అన్ని ఉంటే తాను ఇచ్చిన చీర కట్టుకోదు అని సత్య బట్టలను వెయిటర్‌ సంబంధానికి ఇస్తాడు. దాచేమని చెప్తాడు. ఇక సత్య వాళ్ల అమ్మ కాల్ మాట్లాడి వచ్చే సరికి బట్టలు కనిపించవు. సత్య విషయం అడిగితే క్రిష్ ఉతకడానికి సంబంధం తీసుకెళ్లాడని చెప్తాడు. ఇక సత్య సంబంధానికి కాల్ చేస్తే ఉతికేశా అంటాడు. దీంతో సత్య ఇప్పడేం కట్టుకోవాలి అని అంటే క్రిష్ తాను తీసుకొచ్చిన చీర ఇస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: మైత్రీ చేతికి కాజల్, ఆనంద్ దేవరకొండ సినిమాలు - చిన్న చిత్రాలకు సపోర్ట్ గా నిలుస్తున్న అగ్ర నిర్మాతలు!