Krishna Mukunda Murari Today Episode : మీరా ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికీ తెలిసిపోతుంది. మీరా తన ప్రెగ్నెన్సీకి కారణం మురారినే అని చెప్తుంది. దీంతో ఆదర్శ్‌ ఫైర్ అవుతాడు. గతంలో మురారి ప్రేమించిన అమ్మాయిని తనకు ఇచ్చి పెళ్లి చేసి భవిష్యత్ లేకుండా చేశాడని.. ఇప్పుడు ప్రెగ్నెంట్‌ని చేసిని అమ్మాయిని తనకిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నాడు అని అరుస్తాడు. 


రేవతి: ఆదర్శ్ చాలు.. నా కొడుకు ఒకరి కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తాడే తప్ప. ఒకరి జీవితాన్ని నాశనం చేయాలి అని వాడు ఎప్పుడూ అనుకోడు. నువ్వు ముకుందని ఇష్టపడుతున్నావు అని తెలిసి నీ కోసం తన ప్రేమనే త్యాగం చేశాడు. అంతే ప్రాణాన్నే ఇచ్చేశాడురా. వాడి మీద ఇంత అభాండం వేస్తావా.


ఆదర్శ్‌: కళ్ల ముందు ఇంత నిజం కనిపిస్తుంటే అభాండం అంటావ్ ఏంటి పిన్ని. వాడు అంటే నాకు ఇష్టమే కానీ ఇంత కంటే గొప్పగా మాట్లాడలేకపోతున్నాను. ప్రతీ సారి నా గుండెల్లో మంటలు రేపేది వాడే. 


భవాని: మధు మురారికి ఫోన్ చేయ్.


ఆదర్శ్‌: చెయ్‌రా స్విచ్ ‌ ఆఫ్‌ వస్తుంది. 


ముకుంద: మనసులో.. అవును మురారి ఎక్కడికెళ్లాడు. ఉండి ఉంటే సరోగసీ విషయం బయట పడిపోయేది. కృష్ణ ఎలాగూ ఇంటికి రాదు. మురారి వచ్చిన వరకు నేనే ఎలాగోలా మ్యానేజ్ చేయాలి. 


మధు: స్విచ్ ‌ ఆఫ్ వస్తుంది పెద్దమ్మ.


ఆదర్శ్‌: నేను చెప్పాకదా.


భవాని: ఆదర్శ్‌ అలా అనకు. నేను నిన్ను ఎలా పెంచానో వాడిని అలాగే పెంచాను. 


రజిని: అంటే ఏంటి వదినా మీరా అబద్దం చెప్పిందనా.. నిజం చెప్పు నువ్వు తల్లి కావడానికి కారణం ఎవరు.


ముకుంద: అసలు ఏం అనుకుంటున్నారు నా గురించి ఒక్కొక్క సారి అడిగితే ఒక్కో పేరు చెప్తా అనా. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు.


మధు: మరి ఇనాళ్లు చెప్పింది ఏంటి. నువ్వు తల్లి కావడానికి మురారి కారణం అయితే మరి ఆదర్శ్‌తో ఎందుకు పెళ్లికి రెడీ అయిపోయావు. 


భవాని: అడుగుతున్నాడు కదా చెప్పు. 


ముకుంద: ఎందుకు అని మురారి వచ్చాక అతన్నే అడగండి.


రజిని: అడగడానికి ఏం లేదు వదినా. ఇంటికి వచ్చాక ఇద్దరికీ లైన్ వేసింది. ఎవరు ఒకరు పడినా ఇంటి కోడలు అయిపోవచ్చు అనుకుంది. ఆదర్శ్‌ పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. ఈలోపు మురారితో ఇలా జరిగిపోయింది.


సంగీత: అమ్మా మురారి బావ గురించి తప్పుగా మాట్లాడొద్దు. ఆదర్శ్‌ బావ అంటే ఇష్ట పడ్డాడు. కానీ మురారి బావకి అంత అవసరం ఏంటి. బంగారం లాంటి కృష్ణ అక్క ఉంది. ఈ మీరా వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం కూడా లేదు. ఈ మీరా అబద్ధం చెప్తుంది.


ముకుంద: నాకు కూడా అంత అవసరం లేదు సంగీత. అయినా నా మాట మీద నమ్మకం లేకపోతే మురారినే అడగమని చెప్తున్నా కదా.


సంగీత: ఏం అవసరం లేదు. నీ మాటకు నీ ప్రవర్తనకు అసలు పొంతనే లేదు. నాకు ఆదర్శ్‌ బావకి పెళ్లి చేస్తాను అని మా అమ్మకి మాట ఇచ్చావ్. నువ్వు పెళ్లికి రెడీ అయిపోయావ్. ఇప్పుడు ఏకంగా నీ బిడ్డకు మురారి తండ్రి అంటున్నావ్. అత్తయ్య ఇదేదో పెద్ద ప్లాన్‌తోనే ఇంటికి వచ్చింది ముందు బయటకు పంపేయండి.


ముకుంద: ఆ పంపించండి.. నాలాంటి అనాథను ముందు ఇంటిలో చోటు ఇచ్చి తర్వాత తరిమేయడం మీ అందరికీ అలవాటే కదా. అయినా నేను చేసింది ఈ ఇంటి కోసమే కానీ మోసం చేయడానికి కాదు. కనీసం మురారి వచ్చిన వరకు అయినా ఎవరూ ఆగడం లేదు. ఎవరికి నచ్చి నట్లు వాళ్లు మాట్లాడుతున్నారు. అమ్మానాన్నలు లేకపోయినా ఆత్మాభిమానం ఉన్నదాన్ని ఎవరో బిడ్డకు మరెవరో తండ్రి అని చెప్తే నేను చచ్చినట్లే. ఒక వేళ మురారి అబద్ధం చెప్పినా డీఎన్‌ఏ టెస్ట్ చేయించండి. 


నందిని: ఒకవేళ అబద్ధం అని తేలితే.


ముకుంద: ఈ ఇంటి గుమ్మానికి నన్ను ఉరి తీయండి. ఎక్కడికీ పారిపోను. 


భవాని: మురారి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడితే మనకి నిజం తెలిసేది. సరిగ్గా మీరా తల్లి కాబోతుంది అని అది కూడా మురారి వల్లే అని తెలిసినప్పుడే మురారి కనిపించకుండా పోవడం ఏంటి. పైగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి. అయినా నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది. కానీ మురారి లేకపోవడం వల్ల మీరా ఎన్ని మాటలు అన్నా వినాల్సి వస్తుంది. పైగా డీఎన్ఏ టెస్ట్ చేయించుకోమని అంటుంది. 


రేవతి: ఆ ఒక్క మాటే కన్న బిడ్డ మీద ఎంత నమ్మకం ఉన్నా పోయినట్లు చేస్తుంది. నిజంగానే మురారి తప్పు చేశాడా అందుకే అంత నమ్మకంగా చెప్తుందా. 


మధు: పెద్దమ్మ మురారిని ఎవరైనా అనుమానించొచ్చు కానీ నువ్వు అనుమానించకూడదు. 


సంగీత: ఏమీ జరిగుండదులే అత్తయ్య. ఎవరితోనో తల్లి అయింది. ఈ లోపు ఆదర్శ్‌ బావతో పెళ్లి అనే బంగారం లాంటి అవకాశం వచ్చింది. దాన్ని వదులుకోలేక తల్లి కాబోతున్న సంగతి దాచింది. టైం బాగోలేక అది ముందే తెలిసిపోయింది. ఆదర్శ్‌ బావ అక్కడే ఉన్నాడు కదా తన పేరు చెప్తే ఎక్కడ తంతాడో అని అక్కడ లేని మురారి బావ పేరు చెప్పేసింది. ఇప్పుడు మురారి బావ వచ్చి కూడా అదే పని చేస్తాడు. దీని మాయతో టెస్ట్‌లు కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. 


భవాని: ఏంటో సమాయానికి కృష్ణ పుట్టింటికి వెళ్లింది కాబట్టి సరిపోయింది. ఇదంతా చూసి ఉండి ఉంటే కృష్ణ తట్టుకోగలిగేదా. 


మధు: మురారి కృష్ణ దగ్గరకు వెళ్లాడేమో.. కాల్ చేస్తా..


భవాని: వద్దురా రేపు నేను అక్కడికి వెళ్తాను మురారి ఉంటే మాట్లాడి వస్తాను.


మరోవైపు కృష్ణ మురారికి కాల్ చేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కంగారు పడుతుంది. ఇక కృష్ణ చిన్నాన్న రకరకాల పళ్లు తీసుకొని వచ్చి కృష్ణ ముందు ఉంచుతారు. తినలేను అంటే ప్రభాకర్ ఊరుకోడు. ఇంతలో భవాని అక్కడికి వస్తుంది. కృష్ణ మురారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని ఏమైందని అడుగుతుంది. దీంతో మురారి ప్రాజెక్ట్ పని మీద చాలా బిజిగా ఉన్నాడని చెప్తుంది. మనసులో మాత్రం మురారీ కనిపించడం లేదు అంటే ఈ తింగరి ఏమైపోతుందో అనుకుంటుంది. 


భవాని ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ముకుంద అక్కడికి వస్తూ మనసులో మురారి ఏంటి ఈ టైంలో నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్లిపోయావని అనుకుంటుంది. అందర్ని ఎలా ఫేస్ చేయాలి అని అనుకుంటుంది. ఇక ముకుంద వచ్చి భోజనానికి కూర్చొంటుంది. మధుకి ట్యాబ్లెట్స్ అయిపోయావి తీసుకురా అంటే అడిగినవన్నీ తీసుకురావడానికి ఇక్కడ సర్వెంట్ ఎవరూ లేరని అంటాడు. దానికి ముకుంద మనసులో నేనే ముకుంద అని తేలాక నిన్ను సర్వెంట్ చేసుకుంటా అనుకుంటుంది. ఇక ఆదర్శ్‌ కోపంతో చేయి కడిగి కోపంగా వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ఐదు నిమిషాలు ఇచ్చిన విజయ్ సేతుపతి 45 మినిట్స్ మాట్లాడారు - హీరో ఇంద్ర రామ్ ఇంటర్వ్యూ