Guppedanta Manasu Serial Today Episode : తన తండ్రి విషయంలో తనను ప్రతి ఒక్కరూ ఎంతో బాధపెట్టేవారని మను, వసుతో బాధపడతుంటాడు. వసు ఓదారుస్తుంది. దీంతో దత్తత కార్యక్రమం జరిగే ముందు రోజు మీరు నాకు కాల్‌ చేశారని ఆ రోజ మీరు చెప్పినందుకే నేను అక్కడకు రాలేదని.. నాకు దత్తత కార్యక్రమం ఇష్టమేనని అనుపమ మేడంకు అర్థం కావాలని, నా తండ్రి ఎవరో త్వరగా తెలుసుకోవచ్చని వచ్చానని చెప్తాడు మను. నా తండ్రి గురించి అనుపమ మేడంను అడిగారా? నా తండ్రి ఎవరో మీకు తెలుసా? అంటూ నిలదీస్తాడు మను. దీంతో వసు మౌనంగా లేచి వెళ్లిపోతుంది. దీంతో నా తండ్రి ఎవరో మీకు తెలిసినట్లు ఉంది. ఆ విషయం మీరు ఎవరి కోసం దాచిపెడుతున్నారో నాకు తెలుసు మేడం అని మనసులో అనుకుంటాడు. తర్వాత మను ఒంటరిగా ఆలోచిస్తుంటే వాళ్ల బామ్మ జ్యూస్‌ తీసుకుని వస్తుంది.


మను: ఎందుకు ఓల్డీ ఎందుకు నాకే ఇలా జరుగుతుంది. ఎందుకు నా లైఫే ఇలా తగలడింది.


బామ్మ: అలా అనకు నాన్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమస్య ఉంటుంది.


మను: కానీ నా లాంటి సమస్య ఎవరికి ఉండదు. ఏళ్ల తరబడి తీరని సమస్య ఎవ్వరికీ ఉండదు. నా కన్నతండ్రి ఎవరో  తెలుసుకోకపోవడం నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నా తండ్రి గురించి ఎవరెవరికో తెలుసు కానీ నాకు మాత్రం తెలియదు.


బామ్మ: ఎవరికో తెలుసు అంటే ?


అని బామ్మ ప్రశ్నించగానే ఆఫీసులో జరిగిన విషయం చెప్పి.. వసుధారకు తెలుసని నాకు డౌట్‌గా ఉందంటాడు మను. ఏదైనా ప్రాబ్లమ్‌ అవుతుందని నాతో దాస్తుందేమో అంటాడు మను. దీంతో వాళ్ల బామ్మ నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను అంటుంది. దీంతో మరైతే నువ్వైనా చెప్పొచ్చు కదా అని అడుగుతాడు. దీంతో  ఆమె షాక్‌ అవుతుంది. మరోవైపు వసుధార, మహేంద్రతో మాట్లాడుతుంది.  


వసు: మామయ్యా.. శైలేంద్ర మాటిమాటికి తండ్రి ప్రస్తావన తీసుకొస్తూ మనును ఇబ్బంది పెడుతున్నాడు.  


మహేంద్ర: ఆ శైలేంద్ర గాడి గురించి తెలిసిందే కదమ్మా..! వాడి మాటలు పట్టించుకోకు లైట్‌ తీసుకో..


వసు: అలా లైట్‌ తీసుకుటే ఎలా మామయ్య.. మీరు నేను లైట్‌ తీసుకోగలం కానీ మను అలా లైట్‌ తీసుకోలేడు కదా? శైలేంద్ర మాట్లాడిన ప్రతి మాట తన గుండెల్లో గుచ్చుకుంటుంది.


మహేంద్ర: చూడు వసుధార మను పెయిన్‌ను నేను అర్థం చేసుకోగలను. ఈరోజు కాదు బోర్డు మీటింగ్‌లో  శైలేంద్ర మాటలు విన్నాను. ఆరోజు మను బాధ చూసే కదా ఇంటికొచ్చి అనుపమ మీద సీరియస్‌ అయ్యింది.


వసు: మీరు మాటల్లో చెప్పినంత ఈజీ కాదు మామయ్యా అది. భరించే వాడికి సహించే వాడికి ఆ పెయిన్‌ తెలుస్తుంది. ఒకవైపు తల్లి బాధపెడుతుంది. మరోవైపు బయటి నుంచి అవమానాలు. అయినా తన తండ్రి పక్కనే ఉన్నా తెలుసుకోలేని దురదృష్టవంతుడు మను


అని వసు చెప్పగానే ఒక్కసారిగా అనుమప, మహేంద్ర షాక్‌ అవుతారు. ఏంటి వసుధార నువ్వు మాట్లాడేది అంటాడు మహేంద్ర. దీంతో తేరుకున్న వసుధార అదే మామయ్య తండ్రి లాంటి మీరు పక్కన ఉన్నారని అంటున్నాను అనగానే ఇంతలో మను వస్తాడు. 


మను: మీరు ఎన్నో సార్లు నాకు సాయం చేశారు. ఇంకొక్క సాయం చేయండి సార్‌..


మహేంద్ర: ఏంటి మను ఆ సాయం చెప్పు..


మను: నా తండ్రిగా ప్రకటించుకున్న మీరు నా నిజమైన తండ్రి ఎవరో  కనిపెట్టాలి సార్‌.


అనగానే అందరూ షాక్‌ అవుతారు. అనుపమ కోపంగా నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావని మనును నిలదీస్తుంది. దీంతో మను నా దారి నేను వెతుక్కుంటున్నాను అంటాడు. నా నిజమైన తండ్రిని కనిపెట్టి తీసుకురండి సార్ అని మహేద్రను ప్రామిస్‌ చేసి చెప్పమని మను అడుగుతాడు. దీంతో మహేంద్ర ప్రామిస్‌ చేసి చెప్పడంతో వసుధార, అనుపమ షాక్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ: కొడుకుని చూసి గర్వపడుతున్న మహేష్ బాబు - గౌతమ్ గ్రాడ్యుయేషన్ డే పిక్స్ వైరల్