Suma Adda Latest Promo Out Now: యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘గం గం గణేశా’ మూవీ త్వరలోనే థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. దీంతో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆనంద్, ఇమాన్యుయెల్, యావర్, నయన్ సారిక.. ‘సుమ అడ్డా’ షోకు వచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలయ్యింది. ప్రోమోను బట్టి చూస్తే ఆనంద్ దేవరకొండతో పాటు ‘గం గం గణేశా’ను ప్రమోట్ చేయడానికి వచ్చిన జబర్దస్త్ ఇమాన్యుయెల్ కామెడీ.. ఎపిసోడ్‌కే హైలెట్‌గా నిలిచేలా ఉందని తెలుస్తోంది. అంతే కాకుండా వీరంతా కలిసి చేసిన ‘బేబి’ మూవీ స్పూఫ్ కూడా ఆడియన్స్‌ను నవ్విస్తుంది.


యావర్ ప్రేతాత్మ..


‘‘గం గం గణేశాలో నేను, ఆనంద్ బెస్ట్ ఫ్రెండ్స్. నా పేరు టాటూ కూడా వేయించుకున్నాడు’’ అంటూ ఆనంద్ మెడపై ఉన్న టాటూను చూపించాడు ఇమాన్యుయెల్. దీంతో ‘‘ఎలా దొరికాడు ఇలాంటి ఫ్రెండ్ మీకు’’ అని సుమ వేసే పంచ్‌తో ప్రోమో మొదలవుతుంది. ఆ తర్వాత కూడా ‘‘ఆనంద్.. ఇమాన్యుయెల్‌లో ఏం చూసి టాటూ వేయించుకున్నాడు’’ అంటూ ఆశ్చర్యపోయింది సుమ. దానికి సమాధానంగా ‘‘వాడి హెయిర్ స్టైల్‌ నాకు చాలా ఇష్టం’’ అన్నాడు ఆనంద్. ఇమాన్యుయెల్, యావర్ కలిసి రెండు దేహాలు, ఒక ఆత్మలాగా ఆడాలి అని సుమ అనగానే.. యావర్‌ను ప్రేతాత్మ అంటూ కౌంటర్ ఇచ్చాడు ఇమాన్యుయెల్.


నైట్ లైఫ్ అంటే కేపీహెచ్‌బీ..


నైట్ లైఫ్‌కు సంబంధించిన ప్రశ్న రాగానే తనకు ముందుగా కేపీహెచ్‌బీ గుర్తొస్తుందని అన్నాడు ఇమాన్యుయెల్. ‘‘కుర్రాలంతా మెట్రోల కింద తిరుగుతారు’’ చెప్పాడు. ఎందుకు అని సుమ అడగగా.. యావర్‌నే అడగాలి అంటూ నవ్వాడు. షోలో కూడా హీరోయిన్‌ను ఫ్లర్ట్ చేయడం ఆపలేదు ఇమాన్యుయెల్. ‘‘అల్లం బెల్లం మీరు నా పెళ్లాం’’ అంటూ నయన్ సారికను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత టీమ్ అంతా కలిసి ఒక కామెడీ స్కిట్‌ను చేశారు. అందులో ఆనంద్.. పక్షవాతం వచ్చిన వ్యక్తిలాగా నటించాడు. తనను మామూలు మనిషిని చేయడానికి ఒక జోక్ చెప్పమని ఇమాన్యుయెల్‌ను అడిగింది సుమ. తను జోక్ చెప్తే మొత్తం పోతుంది అనగానే అందరూ నవ్వుకున్నారు.


‘బేబి’ స్పూఫ్..


స్టేజ్‌పై ‘బేబి’ సినిమాను రీక్రియేట్ చేశారు ‘గం గం గణేశా’ టీమ్. అందులో వైష్ణవిగా ఇమాన్యుయెల్, విరాజ్‌గా యావర్ నటించారు. ముందుగా వైష్ణవిగా ఎంట్రీ ఇచ్చిన ఇమాన్యుయెల్.. ‘‘ముందుగా ఆనంద్‌ను ప్రేమించాను, ఆ తర్వాత విరాజ్‌ను ప్రేమించాను. చివరికి వీడిని పెళ్లి చేసుకున్నాను’’ అని డైలాగ్ చెప్పాడు. ‘‘ఇంతమందిని ఎలా ప్రేమించావు’’ అని సుమ అడగగానే మనసుతో అని కౌంటర్ ఇచ్చాడు. అలా వైష్ణవి పాత్రలో ఇమాన్యుయెల్ చేసిన కామెడీ, సుమ వేసిన కౌంటర్లు.. ఆడియన్స్‌ను నవ్వించాయి. చివరిగా యావర్, ఇమాన్యుయెల్ కలిసి ఒక రొమాంటిక్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. అది చూసి ఆనంద్ షాకయ్యాడు.



Also Read: బేబీ లీక్స్... సాయి రాజేష్ వెన్నుపోటుపై శిరిన్ శ్రీరామ్ బుక్!