Family Stars Latest Promo: పలు షోలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న ఈటీవీ.. మరో కొత్త షోను మొదలు పెట్టింది. సుడిగాలి సుధీర్ యాంకర్ గా ‘ఫ్యామిలీ స్టార్‘ అనే షోను తీసుకొస్తోంది. జూన్ 2 నుంచి ఈ షో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. ఇందులో పాత తరం సీరియల్ నటీనటులతో పాటు యంగ్ యాక్టర్లు, యాంకర్లు పాల్గొని సందడి చేశారు.
సుధీర్ యాంకర్ గా ‘ఫ్యామిలీ స్టార్‘ షో
“చిన్న గ్యాప్ ఇచ్చారా మచ్చా.. ఇప్పుడు చూస్తారుగా మనం చేసే రచ్చా!” అంటూ సుడిగాలి సుధీర్ చెప్పే డైలాగ్ తో ప్రోమో మొదలవుతుంది. “ఎంటర్ టైన్మెంట్ త్రీడీలో కనపడుద్ది” అంటూ మరింత ఎలివేషన్ ఇస్తాడు. ఇక ‘ఫ్యామిలీ స్టార్’ స్టేజి మీద కస్తూరి, ప్రీతి నిగమ్ లాంటి సీనియర్ నటీమణులు అత్తల టీమ్ గా, కొత్త తరం అమ్మాయి కోడళ్ల టీమ్ గా రచ్చ చేశారు. యాంకర్లు భాను, స్రవంతి చొక్కారపు, అషూరెడ్డి సుధీర్ తో కలిసి స్టేజి మీద అదిరిపోయే డ్యాన్స్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చి ఆహా అనిపించారు. ఇక ఈ షోలో గేమ్స్ తో పాటు క్వశ్చన్స్ రౌండ్లను కూడా యాడ్ చేశారు. యాంకర్ అడిగే ప్రశ్నలకు ఫన్నీగా సమాధానం చెప్తూ నవ్వుల పువ్వులు పూయించారు. ఇక షోలోని బజర్ నొక్కేందుకు ముద్దుగుమ్మలు పడిన తిప్పలు అందరికీ ఎంటర్ టైన్మెంట్ కలిగించాయి. బంతి కోసం యాక్టర్ల ఫన్నీ కొట్లాట ఆకట్టుకుంది.
‘ఫ్యామిలీ స్టార్‘ స్టేజి మీద కంటతడి పెట్టిన నటీనటులు
ఈటీవీ గురించి, ఈటీవీతో ఉన్న అనుబంధం గురించి పలువు యాక్టర్లు కీలక విషయాలను వెల్లడించారు. ఈ రోజు తాము ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఈటీవీ అని చెప్పుకొచ్చారు. ఈ చానెల్ కారణంగానే తాము ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే అవకాశం కలిగిందన్నారు. ఈటీవీ గురించి ఎంత చెప్పుకున్నా రుణం తీర్చుకోలేమని ఎమోషనల్ అయ్యారు. ఇక మరికొంత మంది నటీనటులు తమ కెరీర్ లో ఎదురైన బాధాకరమైన అనుభవాలు, బాధించే విషయాలు గుర్తు చేసుకుని కంటతడి పెట్టారు. కాసేపు ‘ఫ్యామిలీ స్టార్’ స్టేజిని బాధలో ముంచెత్తారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘ఫ్యామిలీ స్టార్‘ ప్రోమో
ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షోతో ఈటీవీకి మంచి రేటింగ్ రావడం ఖాయం అనే టాక్ వినిపిస్తోదిం. ప్రతి ఆదివారం రాత్రి 7.30 నిమిషాలకు ‘ఫ్యామిలీ స్టార్’ షో ప్రారంభం కానుంది. జూన్ 2, 2024 నాడు తొలి ఎపిసోడ్ ప్రేక్షకులను అలరించనుంది. ఈ షో కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Read Also : సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా సొంతంగానే గుర్తింపు - 47వ వసంతంలోకి కార్తి, సహజ నటుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు