Trinayani Today Episode : తిలోత్తమ వెంట ఉలూచి, గాయత్రీ పాపలు సర్ప దీవికి వెళ్తారు. ఇంకా తిరిగి రాలేదు అని ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. సుమన అయితే ఉలూచి కోసం ఇంకా ఎక్కువ టెన్షన్ పడుతుంది. ఏం కాదు అని హాసిని అంటే.. నీ కొడుకు పుండరీనాథం కూడా అత్తయ్య వెంట వెళ్లుంటే అప్పుడు నీకు నా బాధ తెలిసేదని అంటూ సుమన హాసినిని బలి తీసుకుంటానని చేతిలో నిప్పు పట్టుకుంటుంది. 


నయని: విశాలాక్షిని విడిపిస్తే నీ ప్రాణం తీసుకుంటానన్న దానివి హాసిని అక్కని ఎందుకు బలి తీసుకుంటున్నావ్. 


సుమన: నేను పోతే ఉలూచిని నువ్వు పెంచి పెద్ద చేస్తావ్ కదా అక్క. కానీ నా కన్న బిడ్డను నీ చేతిలో పెట్టినట్లు అవుతుంది అనే హాసిని అక్కని పైకి పంపించాలి అనుకున్నాను.


నయని: హేయ్.. 


విశాల్: హేయ్.. పుండరీనాథ్‌ అనాథ అవ్వడా..


సుమన: దత్తత తీసుకోండి బావగారు. 


విక్రాంత్: ఇది పిచ్చిది బ్రో దాన్ని పట్టించుకోకండి.


వల్లభ: మరి పట్టుకున్న అగ్గి పుల్లని విసిరేస్తే.


విశాలాక్షి: వెలిగీయమనండి.  


దురంధర: ఊరుకోవమ్మా నువ్వు నిజంగానే అది ఆ పని చేస్తుంది.


విశాలాక్షి: చేయలేదు. ఎందుకంటే ఆ రెండు వేల మధ్యనే ఆ అగ్గి పుల్ల అలాగే వెలుగుతూ ఉంటుంది.


సుమన: అగ్గిపుల్ల కింద పడదేంటి.


విశాలాక్షి: బిడ్డలు వచ్చే వరకు అది అలాగే వెలుగుతూ ఉంటుంది. 


సుమన తన గదికి వస్తుంది. విక్రాంత్ కూడా వచ్చి సుమనను తిడతాడు. తోటి కోడలిని చంపాలి అన్న ఆలోచిన దుర్మార్గమని సుమన బుద్ధి పూర్తిగా నాశనం అయిందని అంటాడు. విశాలాక్షి నిన్ను శిక్షించి మంచి పని చేసిందని, కళ్లల్లో నిప్పులు వేసుకున్న నువ్వు ఇప్పుడు చేతిలోనే పోసుకున్నట్లు అయిందని అంటాడు. దానికి సుమన కోపంతో నాకు కానీ తిక్క రేగింది అంటే ఇదే మంటను విశాలాక్షికి పెడతాను అంటుంది. విశాలాక్షి వాళ్లు శివభక్తులు అని వాళ్లకు మంట పెడితే అది హారతిగానో, దీపంగానో మారిపోతుందని విక్రాంత్ అంటాడు. మరోవైపు విశాల్ ఆరుబయట ఉంటే నయని, హాసినిలు అక్కడికి వస్తారు. 


విశాల్: సుమన ప్రవర్తన నన్ను కలచివేసింది నయని. అగ్గిపుల్ల మీద పడలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏమయ్యేది.


హాసిని: నేను బుగ్గిపాలు అయిపోయేదాన్ని. మరి అంత మెంటల్‌ది ఏంటి నయని చిట్టీ. మధ్యలో నా కొడుకు ఏం చేశాడు. నన్ను లేపేసి తనని అనాథని చేస్తా అంటుంది. 


విశాల్: సుమన ఇలా చేస్తుందని నీకు ముందే తెలుస్తుంది కదా నయని.


హాసిని: అవును చెల్లి కాస్త అయినా హింట్ ఇచ్చే దానివి. తిలోత్తమ అత్తయ్య ఇంటికి రాకపోతే ఈ తింగరి హాసిని ఈ ఇంటికి మహారాణి కావడం ఏంటా అని మనసులో ఏమైనా పెట్టుకున్నావా ఏంటి. 


నయని: అక్కా.. అలా ఎందుకు అనుకుంటా. నువ్వు నూరేళ్లు జీవించాలి. ఏదైనా గండం వస్తే నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు వేస్తాను. నా ఆయుష్షు నువ్వు తీసుకున్నా పర్వాలేదు అనుకునే దాన్ని నేను. 


హాసిని: నీ గురించి నాకు తెలుసు చెల్లి. కాస్త నోరు జారాను. 


విశాల్: ఇవన్నీ కాదు కానీ పిల్లలు రావడం ఇంకా ఆలస్యం అయితే లేనిపోని సమస్యలు వచ్చేలా ఉన్నాయి. 


హాసిని: రేపు మార్నింగ్ వస్తారు కదా. 


నయని: నయని విశాల్ షాక్ అవుతూ రేపు ఉదయం వస్తారా ఎవరు చెప్పారు.


హాసిని: నీకు ముందే ఆపదలు తెలిసినట్లు నేను కొన్ని మాటలు గబుక్కున అనేస్తే అవి జరిగిపోతాయి. నీకు తెలుసు కదా నా నాలుక మీద మచ్చ ఉంది.


నయని: నీ నోటి మాట ద్వారా అలాగే జరిగితే అంత కన్నా మంచి ఏముంది. తిలోత్తమ అత్తయ్య కాస్త ఆలస్యంగా రావొచ్చు కానీ పిల్లులు అయితే వచ్చేస్తారు కదా. 


హాసిని: ఇద్దరూ కదా విశాల్.


విశాల్: వదినా.. వెళ్లింది ఇద్దరైతే ముగ్గురు వస్తారా.


నయని: ఎవరి సంగతి ఏమో కానీ గాయత్రీ, ఉలూచి తొందరగా రావాలి అక్క. నా ఎడమ కన్ను అదురుతుంది అంటే మంచి జరుగుతుంది. 


విశాల్: అయితే రేపు ఉదయం అమ్మ వచ్చేస్తుంది.


నయని: పిల్లలు బాబుగారు.


హాసిని: మీ ఆయన అంటుంది కన్న తల్లి గురించి. 


నయని: కన్న తల్లా పెంచిన తల్లి కదా తిలోత్తమ అత్తయ్య గారు. 


విశాల్: నాదే మిస్టేక్ తిలోత్తమ అత్తయ్య ఇప్పుడు రాదు అని విశాలాక్షి చెప్పింది కదా.


ఉదయం దురంధర, డమ్మక్క, పావనామూర్తి, విశాలాక్షి హాల్‌లో ఉంటారు. పావనా మూర్తి అందరికి హాల్‌లోకి పిలుస్తాడు. అందరికి గుడ్ చెప్పాలి అని అనుకుంటున్నాను అంటాడు. ఇక దురంధర ఇంట్లో వాళ్ల సంఖ్య తగ్గిపోతుంది అని అంటుంది. దానికి అందరూ ఎందుకు అని అడిగితే సుమన అత్తయ్య పిల్లలు వస్తే కదా అని అంటుంది. వెంటనే విశాలాక్షి వస్తారు.. పిల్లలు.. అని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. 


వల్లభ: ఏయ్ గారడీ పాప ఈ మాటే నిన్నటి నుంచి చెప్తున్నావ్ నువ్వు.


హాసిని: ఎస్ రాజా నీ తల్లి రాదు. చెల్లి పిల్ల, చిట్టి పిల్ల ఇద్దరూ వస్తారు అని విశాలాక్షి చెప్తుంది.


విశాల్: అయితే అమ్మ రాదా.


హాసిని: ఎందుకు వస్తుంది విశాల్ వెంట గాయత్రీ వెళ్లింది కదా. 


విక్రాంత్: గాయత్రీ పాప తోడు వెళ్తే అమ్మ తిరిగి రాదు అన్నట్లు చెప్పావ్ ఏంటి వదినా. 


హాసిని: అయితే అర్థమైంది అన్నమాట.


విక్రాంత్: వదినా కన్‌ఫ్యూజ్ చేయకు.


విశాల్: ఒక్క నిమిషం ఆగరా. పిల్లలు అయినా ఎప్పుడు వస్తారు.


దురంధర: ఇప్పుడు వస్తారు అని విశాలాక్షి చెప్పినందుకే మిమల్ని పిలిచాం.


డమ్మక్క: వచ్చేది ఇద్దరు కాదు ముగ్గురు. 


వల్లభ: మా మమ్మీ కూడా వస్తుంది అయితే.


విశాలాక్షి: తను రాదు పిల్లలు వస్తారు.


నయని: విశాలాక్షి ముగ్గురు వస్తారు అని డమ్మక్క చెప్తుంది. తిలోత్తమ అత్తయ్య రాదు అని నువ్వు చెప్తున్నావ్. మరి ముగ్గురు ఎవరు. 


విశాలాక్షి: పిల్లలు ఇద్దరినీ తీసుకొని రావడానికి ఎవరో ఒకరు రావాలి కదా అమ్మ. 


అదిగో వచ్చేస్తున్నారు చూడండి అని విశాలాక్షి అనగానే ఇంట్లో విపరీతంగా గాలి వీస్తుంది. ఇక అందరూ షాక్ అయితే సర్పదీవి నుంచి పిల్లలు వస్తున్నందుకు పంచభూతాలు ప్రణవిల్లుతాయని డమ్మక్క అంటుంది. ఇక గురువుగారు వస్తారు. ఒక చేతితో గాయత్రీ పాప చేయి పట్టుకొని మరో చేతిలో తెల్లని వస్త్రం కప్పి తీసికొస్తారు. 


పావనామూర్తి: స్వామి వస్త్రం కప్పి తీసుకొచ్చారు ఏంటి.


గురువుగారు: సర్ప దీవిలో కరడి సర్పం శిరస్సు మీద తిలోత్తమ వెలిగించిన జ్యోతి కాంతి ప్రభావం వల్ల ఇలా వస్త్రం కప్పి తీసుకొని రావాల్సి వచ్చింది. గాయత్రీ మీ అమ్మ దగ్గరకు వెళ్లు. సుమన ఉలూచిని తీసుకో సుమన.


సుమన ఉలూచి అని దగ్గరకు వెళ్లి గట్టిగా అరుస్తుంది. అది తన బిడ్డ కాదు అని వేరెవరినో గురువుగారు తీసుకొని వచ్చారని అంటుంది. అందరూ షాక్ అయి ఈ చంటి పాప ఎవరు అని అడిగితే ఉలూచినే అని గురువుగారు చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కొడుకుని చూసి గర్వపడుతున్న మహేష్ బాబు - గౌతమ్ గ్రాడ్యుయేషన్ డే పిక్స్ వైరల్