Brahmamudi Serial Today Episode: రాజ్‌ బెడ్‌ రూంలో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో కావ్య రావడంతో రాజ్‌ కోప్పడతాడు. ఇంతసేపు ఎక్కడికి వెళ్లావని నిలదీస్తాడు. నా పరిస్థితి ఏంటో అర్థమవుతుందా నీకు అంటాడు. పులికి మేకను ఎర వేసి వెళ్తే ఎలా అంటూ బాధపడతాడు.  దీంతో ఏం కాదని ఈ సమస్య  నుంచి ఎలా బయటపడాలో ఆలోచిద్దామని ఈలోపు దాన్నుంచి మీ శీలాన్ని కాపాడుకోమని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో రాజ్‌ కంగారుపడతాడు. మరోవైపు అపర్ణ లాయర్‌ శర్మకు ఫోన్‌ చేస్తుంది. ఏదేదో చెప్పి రేపు మార్నింగ్‌ కల్లా పేపర్స్‌ రెడీ చేసి తీసుకురండి అని చెప్తుంది. శర్మ సరేనంటాడు. తర్వాత అందరూ హాల్లో కూర్చుని ఉంటారు.


రుద్రాణి: ఏంటి వదిన అందరినీ హాజరు కామని చెప్పి ఏమీ మాట్లాడటం లేదు.


అపర్ణ: నేను మాట్లాడటానికి కాస్త సమయం ఉంది.


రుద్రాణి: అసలు దేని గురించి మాట్లాడాలి..?


అపర్ణ: ఆ సమయం వచ్చాక ఏంటి అనేది అందరికీ అర్థం అవుతుంది.


 అనగానే ఇంతలో లాయర్‌ శర్మ వస్తాడు. పేపర్స్‌ తీసి అపర్ణకు ఇచ్చి వెళ్లిపోతాడు. పేపర్స్‌ ఏంటని సుభాష్‌ అడగ్గానే విడాకుల పేపర్స్‌ అని అపర్ణ చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు.


ఇందిరాదేవి: విడాకులా? ఆ మాట ఎవరినోటా వినబడకూడదని మీ మావయ్య చెప్పారు కదా?


అపర్ణ: కానీ తప్పడం లేదు అత్తయ్యా..


ఇందిర: ఎవరికి తప్పడం లేదు.


అపర్ణ: తప్పటడుగు వేసిన వాళ్లకు..


రాజ్‌: ఎవరి గురించి మమ్మీ నువ్వు మాట్లాడేది.


అపర్ణ: నీకు అర్థం అయింది. నీ గురించే.. నువ్వు కావ్య విడాకులు తీసుకోవాలి.


అనగానే అందరూ షాక్‌ అవుతారు. రుద్రాణి, మాయ మాత్రం హ్యాపీగా ఫీలవుతారు. సుభాష్‌ కోపంగా అపర్ణను తిడతాడు. స్వప్న నిలదీస్తుంది. దీంతో రాజ్‌ నిజంగా కావ్యను ఇష్టపడి ఉంటే ఈ పాటికే బిడ్డను కనేవాడు. వాళ్లిద్దరి మధ్య సఖ్యత లేదని వాళ్లు విడిపోవడమే కరెక్టు అని అపర్ణ అంటుంది. వాడు మాయను ఇష్టపడ్డాడు. అందుకే బిడ్డను కన్నాడు అంటుంది. దీంతో సుభాష్‌ ఇది ఇప్పటికిప్పుడు తీసుకునే నిర్ణయం కాదంటాడు.


పరంధామయ్య: అమ్మా అపర్ణ నువ్వు  బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించేదానివి అని ఈ ఇంటి బాధ్యత అప్పజెప్పాము కానీ కావ్యకు ఇప్పుడు విడాకులు ఇప్పించడానికి నువ్వెవరు? నీకేం హక్కు ఉంది.


ఇందిరాదేవి: కావ్య విషయంలో నువ్వు మామయ్యగా మాట్లాడినా.. ఆ పిల్లకు తాతయ్యగా మాట్లాడినా తప్పులేదు బావ. మాట్లాడు నీ నిర్ణయం ఏంటో నిర్భయంగా చెప్పు


పరంధామయ్య: ఇంత పెద్ద నిర్ణయం నువ్వు ఎవరి అనుమతి తీసుకుని తీసుకున్నావమ్మా..


ఇందిరాదేవి: నువ్వు చెప్పు కావ్య వాడికి విడాకులు ఇవ్వడం నీకు సమ్మతమేనా? నిర్భయంగా నీ నిర్ణయాన్ని చెప్పు.


కావ్య: చాలా సంతోషంగా ఉంది అమ్మమ్మగారు తాతయ్యగారు. కనీసం మీరైనా ఈ ఇంట్లో నేను మనిషిని అని నాది జీవితం అని గుర్తించారు.  


  అంటూ కావ్య బాధపడుతుంది. మా పెళ్లై సంవత్సరం అయ్యింది. ఆ బిడ్డ పుట్టి తొమ్మిది నెలలు అయింది. అంటే అంతకు ముందు ఆ బిడ్డను తొమ్మిది నెలలు కడుపులో మోసింది. అంటే వాళ్ల పరిచయం అయ్యి రెండేళ్లు అవుతుంది. రెండేళ్ల ముందే మాయ పరిచయం అయినప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు. ఆయన చేసిన తప్పుకు నేనెందుకు శిక్ష అనుభవించాలి అంటూ కావ్య ప్రశ్నిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  


ALSO READ: పవన్ కల్యాణ్, ప్రభాస్‌లలో నాకు నచ్చేది అదే - ఆసక్తికర విషయాలు చెప్పిన ‘ఓజీ’ డైరెక్టర్ సుజీత్