Andhra Pradesh News Today: చంద్రబాబు షూ పాలిష్ చేస్తున్న కొడాలి నాని - ఫ్లెక్సీలు కలకలం : గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ఓటమితో పాటు రాష్ట్రంలోనే వైఎస్ఆర్ సీపీ దారుణ స్థాయిలో అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ నాయకులకు కాస్త ఇబ్బంది కలిగించే విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వ హాయాంలో మంత్రి పదవుల్లో ఉన్న కొడాలి నాని, ఆర్కే రోజా, గుడివాడ అమర్ నాథ్, పేర్ని నాని లాంటి వారు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


పాత ప్లాన్ ప్రకారమే అమరావతి, రెండున్నరేళ్లలో మొదటి దశ - నారాయణ
అమరావతిని అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దుతామని పురపాలకశాఖ మంత్రి నారాయణ అన్నారు. ఆదివారం (జూన్ 16) వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నారాయణను రాజధాని రైతులు, జేఏసీ నేతలు అభినందనలు తెలిపారు. రాజధాని అభివృద్ధిగురించి నారాయణ మీడియాతో మాట్లాడారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి నిర్మాణం జరగబోతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు - బక్రీద్ వేళ ఈ మార్గాల్లో వెళ్లకండి!
బక్రీద్ ప్రార్థనల సందర్భంగా మాసబ్ ట్యాంకు సమీపంలోని మీర్ ఆలం దర్గా, హాకీ గ్రౌండ్, లంగర్ హౌస్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఇంచార్జ్ ట్రాఫిక్ జాయింట్ సీపీ విశ్వనాథ్ ట్రాఫిక్ ఆంక్షలు వివరాలను వెల్లడించారు. బక్రీద్ నేపథ్యంలో ఉదయం నుంచి ప్రార్థనలు చేసేందుకు అధిక సంఖ్యలో ముస్లింలు వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


మంత్రి పదవులు ఎక్కువ మందికి ఎందుకివ్వరు? ఏపీలో 26 మందికే ఎందుకు?
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభత్వం కొలువుదీరింది. సీఎం చంద్రబాబు సహా 25 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.  ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి పవన్ కి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. పలు ఇతర శాఖలకు గానూ మరో 23 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇక్కడ వరకూ బాగానే ఉంది. కానీ మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా... కేవలం 25 మందికి మాత్రమే మంత్రి పదవులు ఇవ్వడమేంటి?  చాలా మంది ఆశావహులు ఉంటారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కేసీఆర్ 'కనబడుట లేడు' - గజ్వేల్‌ అంతటా పోస్టర్లు, ర్యాలీలు!
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గంలో తెలంగాణ బీజేపీ నేతలు హడావుడి చేశారు. గజ్వేల్ నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి సొంత నియోజకవర్గానికి కేసీఆర్ రావడం లేదని వారు నిరసనలు చేశారు. ఈ మేరకు గజ్వేల్ పట్టణంలో పలు చోట్ల కేసీఆర్ కనబడడం లేదు అని పోస్టర్స్ ను ముద్రించి అంటించారు. అంతేకాక, ఫ్లెక్సీలు పట్టుకొని నిరసనలు కూడా చేశారు. కేసీఆర్‌ ఎక్కడున్నా గజ్వేల్‌కు రావాలి అంటూ నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి