జగన్‌పై రాయి వేసిన వాళ్లెవరో చెబితే రూ. 2 లక్షలు - పోలీసుల కీలక ప్రకటన
ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి చేసిన ఘటనలో పోలీసులకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో బహిరంగ ప్రకటన విడుదల చేశారు. రాయి వేసిన వ్యక్తి గురించి చెబితే రెండు లక్షల రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచుతామన్నారు. వివరాలు తెలిస్తే 9490619342, 9440627089  సమాచారం ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కోరారు. జగన్‎పై రాళ్లతో దాడి చేసిన కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఆసలు నిందితులను పట్టుకునేందుకు జల్లెడ పడుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కవితకు షాక్ - ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (Mlc Kavitha) షాక్ తగిలింది. రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) ఆమెకు ఈ నెల 23 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించాలని సీబీఐ కోరగా.. 9 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. లిక్కర్ కేసులో (Delhi Liquor Case) మనీ లాండరింగ్ కు సంబంధించి ఈడీ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం కోర్టులో హాజరు పరచగా 3 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


వైఎస్ సునీత మరో సంచలనం - కీలక సాక్ష్యాలు వెలుగులోకి..
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులకు శిక్ష పడేలా వైఎస్ సునీత చేస్తున్న పోరాటంలో ఆమె జస్టిస్ ఫర్ వివేకా పేరుతో ప్రెస్మీట్లు పెట్టి ప్రజలకు నిజాలు చెబుతున్నారు. తాజాగా ఆమె కొన్ని సాక్ష్యాలను మీడియా ముందు ప్రదర్శించారు. వివేకా హత్య కేసులో నిందితులు తనకు తెలియదని అవినాష్ రెడ్డి చెప్పారని సునీత అన్నారు. అవినాష్ మాట్లాడిన కాల్స్, ఫొటోలను ఈ సందర్భంగా ఆమె బయటపెట్టారు. నిందితులతో అవినాష్ రెడ్డి నిరంతరాయంగా టచ్ లో ఉన్న వివరాలు అందులో ఉన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కాంగ్రెస్‌ వైఫల్యాలపై పోస్టుకార్డు ఉద్యమం- బీఆర్ఎస్ కీలక నిర్ణయం
పార్లమెంట్ ఎన్నికల టైంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తప్పుడు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న బీఆర్‌ఎస్‌... అమలు చేయడం లేదని ప్రజల్లోకి వెళ్తోంది. అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసం చేసిందని ఆరోపిస్తోంది. వేదిక ఏదైనా బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు మాత్రం హామీలపైనే ఉంటున్నాయి.  వంద రోజుల్లోనే కీలకమైన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా కొన్నింటిని కూడా అమలు చేయలేకపోయిందని బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


సీఎం జగన్‌పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం- నలుగురి అరెస్టు- రహస్యప్రదేశంలో విచారణ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నలుగురు అనుమానితులను తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వారిని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు విజయవాడ పశ్చిమ డీసీపీ హరికృష్ణ ఆధ్వర్యంలో 20 మందితో సిట్‌ వేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి