YS Sunitha reveals key evidence in Viveka murder case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులకు శిక్ష పడేలా వైఎస్ సునీత చేస్తున్న పోరాటంలో ఆమె జస్టిస్ ఫర్ వివేకా పేరుతో ప్రెస్మీట్లు పెట్టి ప్రజలకు నిజాలు చెబుతున్నారు. తాజాగా ఆమె కొన్ని సాక్ష్యాలను మీడియా ముందు ప్రదర్శించారు. వివేకా హత్య కేసులో నిందితులు తనకు తెలియదని అవినాష్ రెడ్డి చెప్పారని సునీత అన్నారు. అవినాష్ మాట్లాడిన కాల్స్, ఫొటోలను ఈ సందర్భంగా ఆమె బయటపెట్టారు. నిందితులతో అవినాష్ రెడ్డి నిరంతరాయంగా టచ్ లో ఉన్న వివరాలు అందులో ఉన్నాయి.
షర్మిలకు ఎంపీ సీటు ఇవ్వాలని వివేకా అడిగారన్నారు. వివేకా పేరును ఓటరు జాబితా నుంచి అప్పట్లో తీసివేశారన్నారు. మొదటి ఛార్జిషీట్‌లో సీబీఐ నలుగురి పేర్లు పెట్టిందని సునీత తెలిపారు. A1 ఎర్ర గంగిరెడ్డి, A2 సునీల్ యాదవ్, A3 ఉమాశంకర్‌రెడ్డి, A4 దస్తగిరి అని పేర్కొన్నారు. A1 ఎర్ర గంగిరెడ్డితో అవినాశ్‌కు పరిచయం ఉందని సునీత వెల్లడించారు. గజ్జల ఉమాశంకర్‌రెడ్డి కాల్స్ మాట్లాడిన ఆధారాలున్నాయన్నారు. వివేకా హత్యకు మూడు వారాల ముందు... అవినాష్ ఇంటికి దస్తగిరి వెళ్లిన్నట్లు ఆడియో ఉందన్నారు.
వివేకా హత్య కేసులో నిందితులు తనకు తెలియదని అవినాష్ చెప్పారని సునీత అన్నారు. అవినాష్ మాట్లాడిన కాల్స్, ఫొటోలను ఈ సందర్భంగా ఆమె బయటపెట్టారు. మార్చి 14న రాత్రి అవినాష్ ఇంట్లో సునీల్ యాదవ్ లొకేషన్ చూపించిందన్నారు. ఉమాశంకర్ రెడ్డి ఇంటికి కూడా హత్యకు ముందు, తర్వాత సునీల్ వెళ్లారన్నారు. నిందితులంతా అవినాష్ ఇంట్లో ఉన్నట్లు సీబీఐ గుర్తించిందన్నారు. అవినాశ్, భాస్కర్‌రెడ్డితో కిరణ్ యాదవ్ ఉన్న ఫొటోలను సునీత తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో సునీత చూపించారు. గంగిరెడ్డి, అవినాష్ మధ్య వాట్సాప్ కాల్స్ మాట్లాడినట్లు ఆధారాలున్నాయన్నారు. హత్య తర్వాత ఉమాశంకర్ రెడ్డి పారిపోతున్న ఫుటేజ్‌ని సీబీఐ సేకరించిందన్నారు. కాల్‌డేటా, గూగుల్ టేకౌట్, ఐపీడీఆర్ డాటా వివరాలను సునీత సేకరించారు.
‘‘ఎం.వి కృష్ణారెడ్డి వివేకాకు చాలా సన్నిహితుడు. శివశంకర్‌రెడ్డికి, కృష్ణారెడ్డి మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయి. భాస్కర్‌రెడ్డి ఫోన్ డేటా చూస్తే 14 నుంచి 16 ఉదయం వరకూ స్విచ్ఛాఫ్ ఉంది. అవినాశ్‌రెడ్డి మాత్రం వీళ్లవరో తెలియదని చెబుతున్నారు. వివేకా హత్యను మొదట సాక్షిలో గుండెపోటుగా ప్రసారం చేశారు. వివరాలు వెల్లడిస్తూ వివేకా కుమార్తె సునీత భావోద్వేగానికి గురయ్యారు. ఐదేళ్ల కింద నాది ఒంటరి పోరాటం. తెలుగు రాష్ట్రాలు నా పోరాటానికి మద్దతిస్తున్నాయి. మద్దతిస్తున్న ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. నాకు తెలిసిన విషయాలు మొత్తం ప్రజల ముందు ఉంచానని తెలిపారు.