Stroke Deaths Increasing Day by Day : ఏ సంవత్సరం లేని విధంగా ఈ సంవత్సరం స్ట్రోక్ అనే పదం అందరికీ హార్ట్ ఎటాక్​ ఇస్తుంది. మునుపెన్నడు లేని విధంగా ఈ ఏడాదిలో 795వేలమందికి పైగా స్ట్రోక్​ గురైనట్లు తాజా అధ్యయనం తెలిపింది. అంటే ప్రతి 40 సెకన్లకు ఒక స్ట్రోక్ కేసు నమోదు అవుతుంది. ప్రతి మూడు నిమిషాలకు ఒకరు స్ట్రోక్​తో మరణిస్తున్నారు. అయితే ఈ స్ట్రోక్ సంకేతాలు పురుషులు, స్త్రీలలో భిన్నంగా ఉంటున్నాయట.. ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా ఈ సమస్యతో మరణిస్తున్నట్లు నిపుణులు గుర్తించారు.


ఇండియాలో మరణాలకు మూడవ ప్రధాన కారణం


ఇండియాలో మెదడుకు ఇబ్బంది కలిగించే అనారోగ్య జీవనశైలి వల్ల సంభవించే మరణాలకు స్ట్రోక్ మూడవ ప్రధాన కారణమవుతుంది. పైగా ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా స్ట్రోక్​ కేసులు, మరణాలు ఎక్కువ అవుతున్నాయని గుర్తించారు నిపుణులు. ప్రజల్లో ఈ విషయం గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల మరణాలు సంఖ్య కూడా పెరిగినట్లు గుర్తించారు. కొన్ని లక్షణాలతో ఈ స్ట్రోక్​ను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవచ్చు అంటున్నారు. మరి యువతను వెంటాడుతున్న స్ట్రోక్​ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


లక్షణాలు గుర్తించకపోతే.. 


స్ట్రోక్​ ప్రారంభ సంకేతాలు అందరిలో ఒకేలా ఉంటాయి. అయితే వాటిని స్ట్రోక్ లక్షణాలని గుర్తించకపోవడం వల్ల దాని ప్రమాదం, తీవ్రత పెరుగుతుంది. ప్రారంభ దశలలో స్ట్రోక్​ని గుర్తించకపోతే.. దానికి చికిత్స చేయడం కష్టతరమవుతుంది. స్ట్రోక్ వల్ల మెదడుకు రక్తాన్ని అందించే ధమనుల్లో అడ్డంకి ఏర్పడుతుంది. ఇవి మెదడుకు రక్త సరఫరాను కష్టతరం చేస్తాయి. దీనిలో రెండు రకాల స్ట్రోక్స్ ఉన్నాయి. రక్తం గడ్డకట్టడం లేదా ధమనిని అడ్డుకున్నప్పుడు ఇస్కీమిక్ స్ట్రోక్ జరుగుతుంది.


స్ట్రోక్ లక్షణాలు ఇవే..


మెదడులోపల రక్తనాళం రక్తస్రావం కావడాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఈ రకమైన స్ట్రోక్ ఎక్కువగా తలకు గాయం, అధిక బీపీ, డ్రగ్స్ దుర్వినియోగం లేదా బ్రెయిన్ ట్యూమర్​గా వస్తుంది. శరీరంలో ఒకవైపు బలహీనత రావడం, ముఖంలో ఓ వైపు వంకరగా మారడం, దృష్టి లోపం, అసమతుల్యత, మాటలు మందగించడం.. చేయి లేదా కాలు బలహీనంగా మారడం వంటివి స్ట్రోక్​ లక్షణాలు. ఇవి అన్ని కొన్ని నిమిషాల్లోనే జరుగుతాయి. కాబట్టి స్ట్రోక్ ప్రారంభ సంకేతాలు గుర్తిస్తే వెంటనే వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. మూర్ఛపోవడం, బలహీనత, గందరగోళం, ప్రతిస్పందన లేకపోవడం, వికారం, వాంతులు, ఎక్కిళ్ల వంటి లక్షణాలు మహిళల్లో ఎక్కువగా ఉంటాయి.


2050 నాటికి.. 10 మిలియన్ల మరణాలు..


ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో చేసిన 2023 లాన్సెట్ జర్నల్ అధ్యయనం ప్రకారం 2050 నాటికి భారతదేశంతో సహా.. ఇతర దేశాల్లో బ్రెయిన్ స్ట్రోక్స్ వల్ల 10 మిలియన్ల మరణాలకు దారితీస్తుందని కనుగొన్నారు. స్ట్రోక్ లక్షణాలను గుర్తించి మూడు గంటలలోపు ఆస్పత్రికి తీసుకెళ్తే.. చికిత్సను త్వరితగతిన అందించేందుకు వీలుగా ఉటుంది. చికిత్సలతో పరిస్థితి మెరుగుపడినా.. అసలు స్ట్రోక్ రాకుండా నివారించడంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 


జీవనశైలిలో ఈ మార్పులు ఉండాలి..


స్ట్రోక్​ను దూరం చేసుకోవాలనుకుంటే.. జీవనశైలిలో కచ్చితంగా మార్పులు చేసుకోవాలి. ఇది రక్తం, ధమనుల ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఏ సమస్యలు రాకుండా ఉండాలంటే రెగ్యూలర్​గా సమతుల్య ఆహారం తీసుకోవాలి. మెదడు శక్తికోసం పిండిపదార్థాలు, పని తీరు కోసం కొవ్వులు అవసరమవుతాయి. కాబట్టి మీ డైట్​లో వాటిని రెగ్యూలర్​గా తీసుకోవాలి. అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు అనేవి కూడా స్ట్రోక్ సమస్యలను పెంచుతాయి. రెగ్యూలర్ వ్యాయామం, మంచి ఆహారం, మానసిక ఒత్తిడి తగ్గించుకుంటే మంచిది. విటమిన్ బి12, ఈ, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 



Also Read : మీ పిల్లలకు బోర్న్​విటా ఇస్తున్నారా? అయితే వారికి క్యాన్సర్​, స్థూలకాయం వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ