Bournvita is Unhealthy Drink for Kids : మా పిల్లలు పాలు తాగట్లేదు అండీ.. అందుకే వాళ్లకి పాలల్లో బోర్న్​విటా కలిపి ఇస్తున్నాము. వాళ్లు టేస్టీగా ఉందంటూ లొట్టలేసుకుని తాగేస్తున్నారు. అంతేనా వారికి పాలతో పాటు.. బోర్న్​విటా రూపంలో ఎన్నో పోషకాలు అందుతున్నాయి. ఇవి వారి ఎదుగుదలకు ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తాయి. ఇవి ఒకప్పుడు పేరెంట్స్​లో ఉండే నమ్మకం. కానీ ఇప్పుడు దానికి పూర్తి భిన్నమైన విషయం తెరపైకి వచ్చింది. బోర్న్​విటా వల్ల హెల్త్ బెనిఫిట్స్​ కాదు.. హెల్త్ కరాబ్ అవుతుందని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. 


రీల్ తెచ్చిన తంటా..


బోర్న్​విటాతో సహా హెల్త్​ డ్రింక్స్ పానీయాలుగా చలామణీ అవుతున్న కొన్ని పానీయాలను హెల్త్ డ్రింక్స్ వర్గం నుంచి తొలగించాలని.. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇన్​స్టాగ్రామ్​లో వైరల్​ అయిన ఓ రీల్ ఆధారంగా.. బోర్న్​విటా వివాదంలోకి వచ్చింది. ఇది పిల్లల రోగనిరోధక శక్తిని పెంచుతుందా? ప్రకటనలో చూపినట్లు బహుళ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తడంతో దానిపై అధ్యయనాలు చేసి.. హెల్త్​ డ్రింక్స్ కేటగిరి నుంచి వాటిని తొలగించాలని తేల్చి చెప్పింది. 


మోతాదుకు మించి చక్కెర..


ఆహార భద్రతా ప్రమాణాలను పాటించని వాటిని.. పైగా ఆరోగ్య ప్రమాదాలను రెట్టింపు చేసే వాటిని హెల్తీ డ్రింక్స్​లో ఎలా ఉంచుతారంటూ కేంద్రం సీరియస్ అయింది. అంతేకాకుండా బోర్న్​విటాలో షుగర్​ లెవెల్స్ పరిమితికి మించి ఉన్నాయంటూ వెల్లడించింది. ప్రమాణాలకు తగ్గట్టుగా లేని డ్రింక్స్​ని హెల్తీ డ్రింక్స్​గా ప్రమోట్ చేయడాన్ని పూర్తిగా ఖండించింది. దీనిలోని రంగులు చిన్నారుల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయని, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆందోళన పెరిగిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 


స్థూలకాయానికి కారణమవుతోంది..


బోర్న్​విటా తయారీలో FSSAIకి సమర్పించిన నియమాలు, నింబంధనలు ఏది పాటించలేదని.. ఇదే కాకుండా మరిన్ని పానీయాలు హెల్తీ డ్రింక్స్​ జాబితాలో కొన్నింటిని బాగా ప్రమోట్ చేస్తున్నట్లు పేర్కొంది. బోర్న్​విటాలోని అధిక చక్కెర పిల్లల్లో స్థూలకాయానికి దారితీస్తుందని తేలింది. ఇవే కాకుండా మరిన్ని ఆరోగ్య సమస్యలను ఏర్పరుస్తుందని నిపుణులు గుర్తించారు. రోగనిరోధక శక్తిని పెంచుతుందనే దానికి ప్రతికూలంగా ప్రభావాలను చూపిస్తుందని తెలిపారు. కాబట్టి అన్ని ఇ-కామర్స్ వెబ్​సైట్​లలో దీనికి సంబంధించిన ప్రకటనలను తీసివేయాలని కేంద్రం సూచించింది. 


క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువే..


ప్రతి 100 గ్రాముల బోర్న్​విటాలో 50 గ్రాముల చక్కెర ఉంటుందని తాజాగా నిపుణులు కనుగొన్నారు. అంతేకాకుండా హెల్తీ డ్రింక్స్ పేరుతో దీనిని మార్కెట్​లో అమ్మేస్తున్నారని.. హెల్తీడ్రింక్స్​కి తగిన ఏ లక్షణాలు దీనిలో లేవు అంటున్నారు. ఇది పిల్లలకు ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు అందివ్వట్లేదని తెలిపారు. అంతేకాకుండా ఈ మాల్డ్​లోని కలర్స్​ క్యాన్సర్​కు కారణమయ్యే ఏజెంట్​లు కలిగి ఉన్నాయని నిపుణులు తెలిపారు. అందుకే అధిక చక్కెర ఉన్న ప్రతి పానీయం ప్రమాదకరమైనదనని వెల్లడించారు. ఇవి ఊబకాయం, జీవక్రియ వ్యాధులుక దారితీస్తాయని హెచ్చరించారు. వీటిని పిల్లలు తీసుకుంటే అవి వారిలో మరింత ప్రమాదకరంగా మారుతాయని తెలిపారు. ఊబకాయం, రక్తపోటు సమస్యలు, లైంగిక ఆరోగ్య సమస్యలు, మధుమేహం, నరాల సమస్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అందుకే పిల్లలకు ఇచ్చే ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. 



Also Read : సౌండ్ బాత్ గురించి మీకు తెలుసా? దీనితో శారీరకంగా, మానసికంగా ఎన్ని ప్రయోజనాలున్నాయో