Hyundai Creta EV Interior: హ్యుందాయ్ మోటార్ ఇండియా భారతదేశంలో తన అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ క్రెటా ఆల్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను నిరంతరం టెస్ట్ చేస్తుంది. క్రెటా ఆధారిత ఈవీ ఇటీవల చాలాసార్లు టెస్టింగ్‌లో కనిపించింది. ఇప్పుడు కొత్త స్పై షాట్‌లలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లోపలి భాగం చాలా కొత్త వివరాలను వెల్లడిస్తుంది.


స్పై షాట్లలో ఏం కనిపించింది?
ఫొటోలను చూస్తే, హ్యుందాయ్ క్రెటా ఈవీ దాని ఐసీఈ మోడల్‌తో సమానమైన డిజైన్‌తో వస్తుందని చూపిస్తుంది. అయినప్పటికీ కొన్ని డిజైన్ అంశాలు దీనిని బేసిక్ క్రెటా నుంచి వేరు చేస్తాయి. వీటిలో ఫ్రంట్ కెమెరాతో బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్, రియర్ బంపర్‌లు, కొత్త ఏరో ప్యాటర్న్డ్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా ఛార్జింగ్ ఫ్లాప్ ముందు భాగంలో ఉంచారు.


ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి?
మొదటిసారి చూసినప్పుడు ఈ ఎస్‌యూవీ క్యాబిన్‌లో ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ట్విన్ డిస్‌ప్లే యూనిట్ ఉంటుంది. ఇది కాకుండా స్టీరింగ్ వీల్ గ్లోబల్ మార్కెట్‌లో విక్రయించే కంపెనీ ఈవీలలో అందించే విభిన్న తరహా లోగోతో కొత్త ట్రీట్‌మెంట్‌ను పొందుతుంది. ఇది కాకుండా డ్రైవ్ మోడ్ సెలెక్టర్ స్టీరింగ్ కాలమ్‌పై అమర్చబడి ఉంటుంది.


హ్యుందాయ్ క్రెటా ఈవీ
క్రెటా ఈవీ పెద్ద సైజు బ్యాటరీ ప్యాక్‌తో అమర్చారు. దీని కారణంగా ఇది 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను అందించగలదు. ఇటీవల హ్యుందాయ్, కియాతో పాటు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల లోకలైజేషన్ కోసం ఎక్సైడ్ ఎనర్జీతో భాగస్వామ్యం చేయడం ద్వారా దాని ఈవీ ప్లాన్‌లకు ఊపందుకుంది. ఫలితంగా దిగుమతి చేసుకున్న బ్యాటరీ టెక్నాలజీతో మోడల్ ధర కొంచెం తక్కువగా ఉండవచ్చు. లాంచ్ అయిన తర్వాత హ్యుందాయ్ క్రెటా ఈవీ... టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ400, ఎంజీ జెడ్ఎస్ ఈవీలతో పోటీపడుతుంది.


గ్రాండ్ i10 నియోస్ కొత్త కార్పొరేట్ వేరియంట్ కూడా
గ్రాండ్ ఐ10 నియోస్ లైనప్‌లో హ్యుందాయ్ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది కార్పొరేట్ వేరియంట్. దీని స్థానం మాగ్నా, స్పోర్ట్జ్ వేరియంట్‌ల మధ్య ఉంది దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.93 లక్షలుగా ఉండటం విశేషం.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!