Health Benefits with Sound Bath : హెడ్ బాత్ గురించి తెలుసు.. కోల్డ్ బాత్ గురించి తెలుసు.. ఈ రెగ్యూలర్ బాత్‌లకు రోటీన్‌గా సౌండ్ బాత్ తెరపైకి వచ్చింది. ఇదేంటి సౌండ్ బాత్ కొత్తగా అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు ఇదే ట్రెండ్‌లోకి వచ్చిన బాత్. శారీరకంగా, మానసికంగా దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇంతకీ ఈ సౌండ్ బాత్ ఏంటి? దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
సౌండ్ బాత్ అంటే ఏమిటి?
సౌండ్ బాత్‌లో చాప మీద పడుకుని ప్రతిధ్వనించే, మనసుని లీనం చేసే సంగీతాన్ని వినడం. సాధారణంగా సాంగ్స్, లేదా మ్యూజిక్ అనేది గ్రూప్స్‌తో ఉన్నప్పుడు వింటారు. అయితే ఈ సౌండ్ బాత్‌లో ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు చేయాల్సిన ప్రక్రియ. ఇది మిమ్మల్ని ధ్వనిలో లీనమయ్యేలా చేయడమే లక్ష్యంగా ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం ప్రతిధ్వనించే టోన్స్, విశ్రాంతిని, సంగీతాన్ని అందించేలా గిన్నెలతో మృదువైన సంగీతాన్ని అందిస్తారు. సౌండ్ బాత్‌లో పాల్గొనేవారు యోగా లేదా ధ్యానం చేస్తూ పడుకుంటారు. శిక్షణ పొందిన ట్రైనర్ మనకి సౌండ్ బౌల్‌తో ధ్వనిని విడుదల చేస్తారు. ఇది శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. వారి మంచి విశ్రాంతి దొరుకుతుంది.
సెషన్లో పాల్గొనేవారి అవగాహన స్థితిని బట్టి దీనిని సున్నితంగా మార్గనిర్దేశం చేస్తూ ముగిస్తారు. వినసొంపైన సౌండ్‌ని అందించే గిన్నెలు.. సౌండ్ బాత్‌లో ప్రధాన సాధనాలు. ఇది టిబెటిన్నుంచి వచ్చి ఓ సాంప్రదాయబద్ధమైన ప్రక్రియగా చెప్తారు. బౌద్ధులు ఎక్కువగా దీనిని ఫాలో అయ్యేవారు. అంతేకాకుండా దీనిని మతపరమైన కార్యక్రమాల్లో కూడా వినియోగిస్తారు. ఆచారపరమైన సంగీతంలో ఈ సంగీత పాత్రలు వినియోగించినప్పటికీ.. చారిత్రాత్మకంగా.. ఆరోగ్య ప్రయోజనాల కోసం వీటిని వినియోగిస్తున్నారు. సౌండ్ బాత్‌లు.. సౌండ్ హీలింగ్ అనే ప్రక్రియగా చాలామంది చెప్తారు. శతాబ్ధాలుగా దీనిని వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు కానీ.. ఎక్కువమందికి దీనిగురించి తెలీదు.
సౌండ్ బాత్ వల్ల కలిగే ప్రయోజనాలివే..
సౌండ్ బాత్‌తో ఒత్తిడి దూరమవుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యాలపై ఒత్తిడి పూర్తి నెగిటివ్‌గా ఎఫెక్ట్ చేస్తుంది. అలాంటి స్ట్రెస్‌ను ఈ సౌండ్ బాత్ కంట్రోల్ చేస్తుంది. ఈ సెషన్లో విడుదలయ్యే ప్రశాంతమైన టోన్స్, వేవ్స్ మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. నాడీ వ్యవస్థ కంట్రోల్ అవుతుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గి.. ప్రశాంతత దొరుకుతుంది.
సౌండ్బాత్తో మనసును రీసెట్ చేసుకోవచ్చు. ఇది వ్యక్తుల మానసిక గందరగోళాన్ని దూరం చేస్తుంది. అయోమయాన్ని దూరం చేసి క్లారిటీ ఇస్తుంది. ముఖ్యమైన విషయాల్లో క్లారిటీగా ఉండేలా చేస్తుంది. అతి ఆలోచించడాన్ని కంట్రోల్ చేసి.. శాంతపరచడంలో సౌండ్ థెరపీ హెల్ప్ చేస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది.
నిద్ర సమస్యలుంటే..
నిద్ర సమస్యలున్నవారికి సౌండ్ బాత్ అనేది ఓ అద్భుతమైన పరిష్కారం చూపిస్తుంది. ఇది నాడీ వ్యవస్థను శాంత పరిచి.. లోపలి నుంచి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. క్రమంగా నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. రెగ్యూలర్‌గా సౌండ్ బాత్ సెషన్లు తీసుకుంటే.. ప్రశాంతమైన నిద్రను పొందవచ్చు. ఇది శక్తిని, మొత్తం ఆరోగ్యాన్ని ప్రమోట్ చేస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా మీరు మంచి అనుభూతిని పొందుతారు. అయితే ధ్వనితో ఇబ్బంది ఉండేవారు, మైగ్రేన్ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ సౌండ్ బాత్‌కి దూరంగా ఉంటేనే మంచిది.
Also Read : అలర్ట్, చైనాలో విజృంభిస్తోన్న వింత దగ్గు సమస్య - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త, కరోనా కంటే ప్రమాదకరమా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.