Guppedantha Manasu Serial Today April 15th : పేరెంట్స్ మీటింగ్ ప్రారంభమైంది. వసుధార ఒక్కొక్క విద్యార్థి పేరు పిలిచి వాళ్లు ఎందుకు కాలేజీకి రెగ్యులర్గా రావట్లేదు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. వాళ్లు చెప్పిన కారణాలకి జవాబులు చెబుతూ అనవసరంగా  చదువు పాడు చేసుకోవద్దని హితబోధ చేస్తుంది. మధ్యలో మహేంద్ర కూడా  ఇప్పుడు మీరు చేస్తున్నది ఎంజాయ్మెంట్ కాదు ఎంజాయ్మెంట్ అనేది మీరు ఉద్యోగం సంపాదించాక చేసేదే అని బుద్ధులు చెప్తాడు. ఫణీంద్ర కూడా కాలేజీకి ఎగ్గొట్టడం లాంటి పనులు చెయ్యద్దు అంటాడు.

వసుధారకు పక్కనే ఉండి సహాయం చేస్తూ ఉంటాడు మను. ఒక పిల్లాడి పేరు పిలిచి  నీ అటెండెన్స్ ఎందుకు తగ్గింది అని అడుగుతాడు మను. తనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, సహాయం కోసం తన కొడుకుని బయటకు తీసుకువెళ్తానని చెప్తాడు ఆ పిల్లాడి తండ్రి. దీంతో మనో ఆ తండ్రిని దెబ్బలాడుతాడు. మీరు ఇలా చేయడం వల్ల మీ కొడుకు భవిష్యత్తుని మీరే చేతులారా నాశనం చేసుకుంటున్నారు అంటాడు. తండ్రి అనేది వ్యక్తి ఎంతో బాధ్యతగా ఉండాలని పిల్లల ఎదుగుదలకు కృషి చేయాలని చెబుతాడు. మీరు ఎంతో జీవితాన్ని చూశారు కాబట్టి మీ పిల్లలని చదువు దిశ గా ప్రోత్సహించాలి అని చెబుతాడు. అప్పుడు శైలేంద్ర  కనుసైగతో ఒక వ్యక్తి లేచి నిలబడతాడు. తండ్రి గురించి తండ్రి బాధ్యత గురించి మీరు చాలా బాగా చెప్పారంటూ అభినందిస్తాడు. 

ఇంత బాగా చెప్పిన మీరు మీ తండ్రి ఎవరో చెప్పండి, మేము అతని గురించి తెలుసుకొని అభినందిస్తామని చెబుతాడు. ఆదర్శంగా తీసుకుంటామంటాడు. అందరి తండ్రుల పేర్లు చెప్పి మీ తండ్రి పేరు కూడా చెప్పమంటాడు. దీంతో వాతావరణం వేడెక్కిపోతుంది.

నేను మామూలుగానే అడుగుతున్నాను అని అవతలి వ్యక్తి చెబుతున్న శైలేంద్ర విషయాన్ని సీరియస్ చేసే ప్రయత్నం చేస్తాడు. కొన్ని ప్రశ్నలు అడిగి మనుకు కోపం తెప్పించొద్దు అంటాడు. దీంతో వచ్చిన పేరెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనటం మొదలు పెడతారు. తండ్రి గురించి మాట్లాడితే కోపం ఎందుకు వస్తుంది అని ఒకరు ప్రశ్నించడంతో వెంటనే శైలేంద్ర మనుకి తన తండ్రి ఎవరో తెలియదు అంటాడు. దీంతో తండ్రి ఎవరో తెలియని వాడే తండ్రి గురించి బుద్ధులు చెప్పడం ఏంటంటూ వెటకారం చేస్తారు. అసభ్యంగా మాట్లాడటం మొదలు పెడతారు. 

ఇదే అవకాశంగా తీసుకుని దేవయాని కూడా మాటలు విసరటం మొదలు పెడుతుంది. దీంతో మనూకి తల్లిదండ్రులు ఎవరు అన్న ప్రశ్న మొదలవుతుంది. తల్లి అనుపమ అయినప్పుడు ఆ తల్లికి తెలిసుండాలి కదా తండ్రి ఎవరో అంటూ అభ్యంతరకరంగా మాట్లాడటం మొదలు పెడతారు. 

దీంతో మను ఒక్కసారిగా ఆవేశపడతారు. వసుధార మనుని ఆపగా శైలేంద్ర కూడా లేచి నిలబెడతాడు దీంతో వచ్చిన పేరెంట్స్  నీతులు మాకు చెప్పడం కాదు మీరు పాటించాలి అంటూ ఆవేశపడతారు. ఆవేశంలో తనకి తండ్రి లేడు అనే మను అరుస్తుండగా అప్పుడు నోరువిప్పుతాడు మహేంద్ర.. 

నేనే మను తండ్రిని అంటూ ఆవేశంగా సమాధానం చెప్తాడు. మను తండ్రి లేని పిల్లాడు కాదు నేనే మను తండ్రిని అని, అందరూ క్లియర్గా వినండి అంటాడు. ఒక్కసారి స్టేజి మీద ఉన్న వాళ్లే కాదు విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు కూడా అవాక్కవుతారు. ఇంకా ఏదో ప్రశ్నించబోయిన వాళ్ళని ఆపి మీటింగ్ క్లోజ్ చేసేస్తాడు. శైలేంద్ర ఎందుకు అంటూ అభ్యంతరం చెప్పినా వినకుండా మహేంద్ర మీటింగ్ క్లోస్ చేసేద్దాం అంటాడు. వసుధార కూడా మీటింగ్  అయిపోయిందని ప్రకటిస్తుంది. 

బయట మీటింగ్ పెడతారు మహీంద్ర, ఫణీంద్ర,  శైలేంద్ర, దేవయాని, వసుధర. మహేంద్ర తమ కుటుంబం పరువు తీసారంటూ ఆవేశపడుతుంది దేవయాని. ఎందుకు చేసావు అని దేవయాని ప్రశ్నకు  చెయ్యాలనిపించింది చేశాను అన్న ఒకే ఒక్క సమాధానం ఇస్తాడు మహేంద్ర.  గతంలో కూడా తను మహేంద్రతో కోపంగా అన్న ఒక్క మాటకి  రిషి తో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయాడని, ఇంట్లో ఏం జరిగినా నీ వల్లే  అని మీరు  అంటారు అంటూ ఫణీంద్ర మీద మండిపడుతుంది దేవయాని. నేను తప్పు చేసినప్పుడు నా మీద ఆగ్రహం చూపించారు. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు. ఇంత తప్పు చేసిన మీ తమ్ముని వెనకేసుకొస్తున్నారు అడుగుతుంది. వెంటనే మహేంద్ర నేనేం తప్పు చేయలేదు అంటాడు. ఇంత పెద్ద తప్పు చేసావు. ఈ మాట వినగానే మా మీద ఒక బండరాయి పడిన ఫీలింగ్ కలిగింది అంటూ ప్రశ్నలు సంధిస్తుంది. 

నీ వల్ల మీ అన్నయ్య ఎంతో బాధపడుతున్నారో చూడు, ఎందుకు ఇలా చేసావో చెప్పు అని పదేపదే ప్రశ్నించడంతో నేను చేసింది కరెక్టే అని ఒక మాట చెప్పి ఊరుకుంటాడు మహేంద్ర. తరువాత శైలేంద్ర స్వయంగా ప్రశ్నిస్తాడు. అయితే దానికి కూడా మహేంద్ర మను తన కొడుకు అని మాత్రమే చెప్పి మాటలు ఆపేయడంతో   వసుధార,  మహేంద్ర తప్ప అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

Also Read: బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్‌ - 'లవ్‌గురు' సినిమా చూసి మలేషియా చూట్టేయండి!