Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప గుడికి వచ్చి మొక్కుకుంటుంది. తన జీవితాన్ని నాశనం చేసిన తన భర్త నర్శింహ, తన తండ్రిని చంపిన కార్తీక్ ఇద్దరూ ఎప్పుడు తనకు జీవితంలో ఎదురు పడకూడదు అని మొక్కుకుంటుంది. ఇక కార్తీక్ కూడా అదే గుడికి వచ్చి దీపకి నిజం చెప్పే అవకాశం రావాలి అని.. దీప తనని క్షమించాలి అని వేడుకుంటాడు. ఇక దీప కార్తీక్ ఒకర్ని ఒకరు చూసుకోరు. దీప బయటకు రాగానే నర్శింహ కనిపిస్తాడు.
నర్శింహ: ఊరికి పోకుండా ఇక్కడేం చేస్తున్నావే. మాట్లాడితే సమాధానం చెప్పవేంటే..
దీప: ఇప్పుడు నీకు నాకు ఏ సంబంధం లేదు. అని దీప వెళ్లిపోతుంటే నర్శింహ దీప కొంగు పట్టుకుంటాడు. ఇంతలో కార్తీక్ వచ్చి నర్శింహ చెంప పగల గొడతాడు. కాలర్ పట్టుకొంటాడు.
కార్తీక్: లోపల నుంచి చూస్తున్నా ఎవడ్రా నువ్వు. దీప చీర పట్టుకొని లాగడానికి ఎంత ధైర్యంరా నీకు.
నర్శింహ: నేను ఎవరో నీకు తెలీదు అన్నమాట. చెప్పవే చెప్పు. నేనే నీ మెడలో తాళి కట్టిన మొగుడుని అని చెప్పు. కార్తీక్ షాక్ అయిపోయి కాలర్ వదిలేస్తాడు. దీప వైపు చూస్తాడు. మొగుడుని కొట్టించే అంత బరితెగించావ్ అన్నమాట.
దీప: నోటికి వచ్చినట్లు మాట్లాడు.
నర్శింహ: నువ్వు కూతుర్ని వేసుకొని వీడితో కారులో తిరగడం నేను చూశానే. పోవే అంటే ఊరికి పోతావ్ అనుకున్నా. ఎవడో డబ్బున్నోడిని బాగానే పట్టావ్.
దీప: ఆయన్ను ఏమైనా అన్నావ్ అంటే పళ్లు రాలిపోతాయ్ చెప్తున్నా.
నర్శింహ: ఓ కథ అంత దూరం వచ్చిందా మాట కూడ పడనీయడం లేదు. కూతుర్ని కూడా చూసుకుంటా అన్నాడా..
దీప: నీకు దండం పెడతానురా. పోరా..
నర్శింహ: నువ్వు ఊరు వెళ్తాను అంటే పట్టించుకోకుండా వదిలేశాను. నువ్వు ఇక్కడే ఉండి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తా అంటే ఊరుకోను చెప్తున్నా..
దీప: చెప్పు తీసి ఇక్కడి నుంచి పోతావా పోవా..
నర్శింహ: పోతానే పోతా. కానీ నువ్వు ఈ ఊరిలో ఉండటానికి వీళ్లేదు. మళ్లీ ఇక్కడ కనిపించావ్ అనుకో అప్పుడు చెప్తా. ఈ రాత్రికే బస్సు ఎక్కి వెళ్లిపో మళ్లీ ఇక్కడ కనిపించావ్ అనుకో బాగోదు చెప్తున్నా.
మరోవైపు సౌర్య తాత దశరథతో కబుర్లు చెప్తుంది. ఇంతలో సుమిత్ర వచ్చి పాయసం తీసుకొని వస్తుంది. తినిపిస్తాను అని సౌర్యను దగ్గరకు తీసుకుంటుంది. ఇక సౌర్య ఇళ్లు, మీరు, తాతయ్య అందరూ నాకు బాగా నచ్చారో అని అంటుంది. ఎప్పుడైనా మీరు గుర్తొస్తే రావొచ్చా.. మీరు ప్రేమగా మాట్లాడుతారు అని నానమ్మ ప్రేమగా ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు అని అంటుంది. ఇక సుమిత్ర మీకు వెళ్లనివ్వను అని ఇక్కడే ఉండిపోమ్మంటాను అని అంటుంది. ఇక్కడే చదివిస్తాను అని చెప్తుంది. ఇక పాయసం తినిపిస్తే తన తల్లి వంటలు సూపర్‌గా చేస్తుందని బన్ ఇడ్లీ గురించి చెప్తుంది.
సుమిత్ర: అసలు మీ అమ్మ ఏం చేస్తుందే.
సౌర్య: మా అమ్మ టిఫిన్స్ చేస్తుంది. సైకిల్ మీద వెళ్లి టిఫిన్స్ పెడుతుంది. అందరూ ఎంత ఇష్టంగా తింటారో తెలుసా. పాయసం అయితే సూపర్‌గా చేస్తుంది. అందుకే మా అమ్మని అందరూ ముత్యాలమ్మ గూడ అన్నపూర్ణ అంటారు.
సుమిత్ర: మనసులో.. నిన్ను అడిగినా చెప్పని ఎన్నో విషయాలు ఇప్పుడు అడగకుండానే తెలిశాయి దీప. కానీ అర్థం కాని విషయం ఏంటంటే.. భర్త ఆదరణ లేని ఆడదానివా భర్త వదిలేసిన ఆడదానివా ఎవరే నువ్వు.
మరోవైపు దీప నర్శింహ మాటలు తలచుకొని ఆవేశంగా రోడ్డు మీద నడుస్తుంది. ఇంతలో దారి మార్చిపోతుంది. ఇంటికి ఎలా వెళ్లాలి అని కంగారు పడుతుంది. ఇంతలో కార్తీక్ కారులో వస్తాడు. దీప దగ్గరకు వచ్చి తన నీ భర్త అని తెలీక ఇలా మాట్లాడాను అని చెప్తాడు.
కార్తీక్: మా నాన్న కోసమే వచ్చాను అని సౌర్య చెప్పింది. ఆయన నీచంగా మాట్లాడుతున్నాడు. ఏమైందో చెప్పండి.. ఇక దారి తప్పిపోయారని చెప్తాడు. ఇంతలో దీప వేరే వారికి అడ్రస్ అడిగితే కార్తీక్ చెప్తాడు. దీంతో ఆ పెద్దాయన ఆయనతో వెళ్లమని చెప్తాడు. దీప వద్దు అంటే కార్తీక్ వదలడు. ఆయన బలవంతం చేయడంతో దీప కారు ఎక్కుతుంది.
మరోవైపు కార్తీక్ తల్లి నగలు ముందు వేసుకొని ఏవి బాగున్నాయా అని అడుగుతూ ఉంటుంది. తన కోడలు పుట్టిన రోజు అని ఓపీనియన్ చెప్పమని అంటుంది. మీరు బెస్ట్ ఏం ఇస్తారు అని అడిగితే నా కొడుకును ఇస్తానని చెప్తాడు. ఇక రెండు నెక్లెస్ సెట్‌లు పంపించి జ్యోత్స్నకు నచ్చింది సెలక్ట్ చేయమని సుమిత్రకు ఫొటోలు పంపిస్తుంది. ఇక జ్యోత్స్నకు బిజినెస్ పనులు అప్పగిస్తామని అనుకుంటారు శివనారాయణ, దశరథలు..
ఇక సుమిత్ర నగలు ఫొటోలు కూతురుకి చూపిస్తుంది. ఇక కాంచన కోడల్ని తన ఇంటికి పంపమని మెసేజ్ చేసిందని చెప్తుంది. ఇక పారు పెళ్లి విషయం తీసుకొస్తుంది. తొందర పడమని చెప్తుంది. శివనారాయణ పెళ్లి విషయంలో నిర్ణయం ఎప్పుడూ మారదని కాంచన కొడుకుతోనే సుమిత్ర కూతురి పెళ్లి అని అంటారు. అప్పుడే దీప, కార్తీక్‌లు ఇంటికి వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.