Trinayani Today Episode అంజనం వేసిన ఆకులో పాపగా కనిపించాల్సిన గాయత్రీ దేవి పునర్జన్మకు ముందు ఎలా ఉండేది అలా కనిపించింది ఏంటా అని తిలోత్తమ ఆలోచిస్తూ ఉంటుంది. గాయత్రీ దేవి అలా కనిపించడం వెనుక ఏదో ఉండే ఉంటుంది అని తిలోత్తమ కొడుకుతో అంటుంది. దీంతో వల్లభ అందరి ముందు అంటే తిడతారు అని అనలేదు కానీ నా అంచనా ప్రకారం పెద్దమ్మ పునర్జన్మలో కూడా ప్రాణాలు వదిలి ఉంటుంది.

తిలోత్తమ: నో.. పసిబిడ్డగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయి ఉంటే ఆ ఆత్మ అలాగే కనిపించేది. ఇంకో విషయం ఏంటి అంటే ఆత్మలా వస్తే కేవలం నయనిని మాత్రమే చూడగలిగేది. అందరం చూడగలిగాం అంటే ఇంకేదో ఉంటుంది.వల్లభ: అఖండ స్వామిని అడిగితే అసలు విషయం చెప్తారు కదా అమ్మ.తిలోత్తమ: కరెక్ట్.

మరోవైపు గాయత్రీ పాప పడుకొని ఉంటే విశాల్, పావనా, హాసిని వచ్చి పాపని లేపుతారు. అమ్మ అంజనంలో కనిపించకూడదు అనే ఇలా చేసింది అని అంటుంది. ఇక హాసిని ఈ నిజం ఎంతో కాలం దాచలేమని అంటుంది. పావనా కూడా అదే అంటాడు. 

విశాల్: వదినా కొంచెం ఓపిక పట్టండి. వచ్చే పౌర్ణమికి కన్నతల్లికి పెంచిన తల్లికి ఇద్దరూ ఒకరి మీద ఒకరు పగ ప్రతీకారం తీర్చుకొనే అవకాశం వస్తుందని గురువుగారు చెప్పారు.హాసిని: అంటే ఆ రోజే పాపే గాయత్రీ అత్తయ్య అని తెలిసిపోతుందా.విశాల్: ఏమో ఆరోజు ఏమవుతుందా అనే ఆలోచనలో పూర్తి వివరాలు అడగడం మర్చిపోయాను.పావనా: అల్లుడు ఈ లోపే రహస్యం చేధించాలి అని తెగ ప్రత్నాలు చేస్తున్నారు. అప్పటి వరకు అప్రమత్తంగా ఉండాలి.విశాల్: అవును మామయ్య.

వల్లభ: అఖండ స్వామితో.. స్వామి అంజనం వేశాం. గాయత్రీ పెద్దమ్మ 20 ఏళ్ల క్రితం ఎలా ఉండేదో అలానే కనిపించింది.అఖండ: అదేంటి. తిలోత్తమ: అది అర్థం కాకే ఇలా వచ్చామ్ స్వామి. అఖండ: ఆశ్చర్యంగా ఉందే.. అయితే పసి పాప ఆత్మ పరకాయ ప్రవేశం చేసి ఉండాలి.తిలోత్తమ: పరకాయ ప్రవేశం చేయాలి అంటే పాపగా ఉన్న అక్కయ్య కదలకుండా మెదలకుండా ఉంటేనే సాధ్యమవుతుంది.(అందుకే గాయత్రీ మామ స్ఫృహ కోల్పోతుంది.) స్వామి నాకు పునర్జన్మలో ఉన్న గాయత్రీ అక్కయ్యని చంపే అవకాశమే లేదా..అఖండ: నీకు మాత్రమే గాయత్రీ దేవి ఆయువు పట్టు తెలుస్తుంది తిలోత్తమ. ఒకరికి ఒకరు బద్ధ శత్రువులు అయ్యారు కాబట్టి ఎవరి ప్రాణాలు ఎవరు తీయాలా అని అనుకుంటారు.తిలోత్తమ: తాను ఎలా ఉంటుందో తెలిస్తే నేను 24 గంటల్లో చంపేస్తా స్వామి.అఖండ: తిలోత్తమ ప్రాణం తీయడమే తన లక్ష్యం. నువ్వు ఒక్క అడుగు వేస్తే తాను 100 అడుగులు వేస్తుంది. తిలోత్తమ: పసిబిడ్డగా ఉన్న అక్కయ్య కనిపిస్తే గోరు ముద్దలు తినిపించి.. ఆ ముద్దలతోనే పిండం పెట్టేస్తా..

తిలోత్తమ, వల్లభలు హాల్‌లో ఉంటే గాయత్రీ పాప అక్కడికి వస్తుంది. ఇక నెయిల్ పాలీష్ వేస్తా అని గాయత్రీని పిలుస్తుంది తిలోత్తమ. ఇక హాసిని ఆ మాటలు విని గాయత్రీ పాప కుడి చేయి పట్టుకుంటే తిలోత్తమకు భగ్గు మంటుంది. దీంతో పాప ఎవరో అని తెలిసిపోతుంది అని కంగారు పడి ఐడియా అని బయల్దేరుతుంది. 

పాప కుడి చేయికి నెయిల్ పాలీష్ పెడతా అని కుడి చేయి పట్టుకోగానే షాక్ కొడుతుంది. ఇంతలో విశాల్ పాపని తీసుకుంటాడు. అదే టైంలో హాసిని హారతి తీసుకొని వచ్చి పడిపోయినట్లు కవరింగ్ ఇస్తుంది. తర్వాతా తిలోత్తమకు సారీ చెప్తుంది. దీంతో తిలోత్తమ హాసిని చెంప మీద కొడుతుంది. 

వల్లభ: మమ్మీ మంట కర్పూరం నుంచి రాలేదు.  విశాల్: అన్నయ్య అమ్మ చేయి కాలిందేమో చూడు ముందు.నయని: హారతి పళ్లెం పడిపోయిందా.హాసిని: అవును చెల్లి.విశాల్: వదిన హారతి తీసుకొస్తే కళ్లకు హత్తుకోకుండా ఏం చేశారు.వల్లభ: రేయ్ నన్ను చెప్పనివ్వండిరా..విక్రాంత్: ఏం చెప్తావురా..సుమన: అవునా హారతి ఎందుకు తీసుకురావాలి అక్కా నువ్వు.నయని: పూజ కూడా చేయాల్సిన టైం కాదు కదా..దురుంధర: పిచ్చిది ఇది ఎప్పుడు ఏం చేయాలి అనుకుంటే అది చేసేస్తుంది.వల్లభ: అసలు మంట ఎలా వచ్చిందో తెలుసా మీకు.తిలోత్తమ: ఎలా వస్తే ఏంటిరా చేయి అయితే కాలింది కదా..వల్లభ: మమ్మీ నువ్వు అయినా విను మమ్మీ. చేతి మీద కర్పూరం పడితేనే మంట వచ్చిందని మీరు అనుకుంటున్నారు.విశాల్: అన్నయ్య అవసరమా ఇప్పుడు.వల్లభ: చెప్పనివ్వండిరా..నయని: చెప్పండి బావగారు.వల్లభ: ఈ పిల్ల నీ దత్త పుత్రిక చేతి నుంచే మంట వచ్చింది. అందరూ షాక్ అయిపోతారు.  విక్రాంత్: గాయత్రీ చేతికి మంట వస్తే తను ఏడ్వాలి కదా.వల్లభ: రేయ్ అర్థం లేదా మీకు అర్థం కాదా..తిలోత్తమ: ఏమంటావ్ గాయత్రీ పాప చేతికి నేను నెయిల్ పాలీష్ వేస్తే మంట వస్తుంది అంటావ్ అంతే కదా..నయని: అవును బావగారు మీరు అన్నట్లు పాప చేతి నుంచే మంట పుట్టింది. నెయిల్ పాలీష్ ఫ్లేమబుల్ అంటుకునే గుణం ఉంటుంది. అందుకే పిల్లకు నెయిల్ పాలీష్ వేయకూడదు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: రెడ్ శారీలో గులాబీలా మెరిసిపోతున్న అంజలి- లేటెస్ట్ ఫోటోలు చూశారా?