Andhra Pradesh Telangana News Today: ప్రజాపాలన దరఖాస్తులు వచ్చేశాయ్.. ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి
తెలంగాణ(Telangana)లో ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన(Praja Palana) దినోత్సవాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ప్రజా పాలనలో ప్రజల సమస్యలను ప్రభుత్వం వింటుంది. అక్కడికక్కడే సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. ఇందుకోసం నేతలు, అధికార యంత్రాంగం గ్రామ సభలకు హాజరవుతారు. దీంతోపాటు.. ప్రజా పాలన పేరుతో ఏర్పాటు చేసే గ్రామ సభలు ఆరు గ్యారెంటీల(Six Guarantees)పై కూడా ఫోకస్ పెడతాయి. ఆరు గ్యారెంటీల అమలుకి సంబంధించి ప్రజా పాలన దరఖాస్తుల(Praja Palana Application)ను అధికారులు స్వీకరించడం గ్రామ సభల ముఖ్య ఉద్దేశం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు - పార్టీ విలీనానికి సర్వం సిద్ధం ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను ఆ పార్టీ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. గురువారం ఆమె ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. పార్టీ విలీనం, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలపై ఆమెతో కాంగ్రెస్ పెద్దలు చర్చించనున్నట్లు సమాచారం.  ఆంధ్రప్రదేశ్   బాధ్యతలు ఇవ్వడానికి హస్తం అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే షర్మిల భర్త అనిల్ కుమార్ ఢిల్లీలో ఉన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


మద్యం అమ్మకాల లెక్కలు మాయం - సీఎస్‌కు అచ్చెన్నాయుడు ఘాటు లేఖ !
మద్యం అమ్మకాల లెక్కలను వెబ్ సైట్ నుంచి తొలగించడంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి లేఖ రాశారు. దీని వెనుక భారీ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. మద్యం అమ్మాకల డబ్బును హవాలా రూపంలో తరలించడానికి..  ఎన్నికల సమయంలో మద్యాన్ని వైసీపీ నేతలు విచ్చలవిడిగా వినియోగించాడనికి లెక్కలను మాయం చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ విషయంలో అధికారుల్ని బలి పశువుల్ని చేస్తున్నారని తక్షణం పారదర్శకంగా వివరాల్ని బయట పెట్టాలన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఆయన మంత్రి అయితే చూడాలని ఉంది- నెల్లూరులో అలీ ఆసక్తికర వ్యాఖ్యలు
సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ(YSRCP) ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి(Nallapureddy Prasanna Kumar Reddy) మంత్రి అయితే చూడాలని ఉందన్నారు. ఆయన మంత్రి కావాలని ఆకాంక్షించారు. ఆయన్ను మంత్రి చేసుకునే అవకాశం నియోజకవర్గ ప్రజల చేతుల్లోనే ఉందని చెప్పారు అలీ. ప్రసన్న కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ఈసారి ఆయనకు 90వేల మెజార్టీ రావాలని చెప్పారు. ఆ స్థాయి మెజార్టీ వస్తే కచ్చితంగా ఆయన మంత్రి అవుతారని అన్నారు అలీ.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేయడం లేదు- జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వాలంటీర్ల సంఘం
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ సమ్మె చేస్తోందని వచ్చిన వార్తలను వాలంటీర్ల సంఘం ఖండించింది. తాము సమ్మె చేయడం లేదని ఓ ప్రకటనలో తెలిపింది. కొనని పత్రికలు, ఛానెళ్లు, సోషల్ మీడియాలో జరుగుతన్న ప్రచారాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము ఎలాంటి ధర్నాలు, ఆందోళనలు చేయడం లేదని వార్డు, గ్రామ సచివాలయ వాలంటీర్ల సంఘం తేల్చి చెప్పింది. ఇప్పుడు జరుగుతున్నదంతా ఫేక్ ప్రచారమని కొట్టిపారేసింది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి