చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై వీడని ఉత్కంఠ- త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ
స్కిల్ డెలవప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసుకున్న క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలనం తీర్పు వెల్లడించింది. తనపై చట్ట విరుద్ధంగా కేసు నమోదు చేశారని తనకు 17ఏ సెక్షన్ వర్తిస్తుందని చంద్రబాబు పిటిషన్‌పై దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పు వెల్లడించింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. గతంలో విచారణ పూర్తయిన తర్వాత అక్టోబర్ 20వ తేదీన తీర్పును రిజర్వ్ చేశారు. సుదీర్ కాలంగా రిజర్వ్ లో ఉన్న తీర్పును ఇవాళ ఇచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల నియామకం, ఏఐసీసీ ఉత్తర్వులు
ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలా రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు ఢిల్లీలోని ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని వాటిలో పేర్కొంది. సీడబ్లూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా గిడుగు రుద్ర రాజును నియమించింది. ఇన్నాళ్లు పీసీసీ చీఫ్ గా ఉన్న గిడుగు రుద్రరాజుకు, ఆయన పని తీరుకు అభినందనలు తెలిపింది.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


దావోస్‌లో రేవంత్ టీం- పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలతో సమావేశాలు
ఇన్వెస్ట్ ఇన్‌ తెలంగాణ పేరుతో చేపట్టిన క్యాంపెయిన్‌ను ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా ప్రారంభించింది. సోమవారం దావోస్‌ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు  కూడా ఈ టూర్‌లో ఉన్నారు. అధికారులు కూడా పర్యటనలో భాగమయ్యారు. అంతా కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. దావోస్ చేరుకున్న వెంటనే రేవంత్ టీం ఇథియోఫియా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెమెక్ హసెంటోతో సమావేసమైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


సత్యసాయి జిల్లాలో ప్రధాని పర్యటన, నాసిన్ కేంద్రంలో కొత్త భవనాలు ప్రారంభించనున్న మోడీ
శ్రీ సత్యసాయి జిల్లా(Sri Satyasai District)లో ప్రధాని (Prime Minister) నరేంద్ర మోడీ (Narendra Modi)పర్యటించనున్నారు.  గోరంట్ల మండలం పాలసముద్రం దగ్గర కొత్తగా నిర్మించిన నాసిన్ కేంద్రంలో నిర్మించిన క్యాంపస్ భవనాలను ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. లేపాక్షిలోని వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు మోడీ. ప్రధాని పర్యటన నేపథ్యంలో జిల్లాలో మొత్తం ఆరు హెలిప్యాడ్లను అధికారులు ఏర్పాటు చేశారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఆ తీర్పునకు కనీసం ఆర్నెల్లు! బాబు క్వాష్ పిటిషన్‌పై రఘురామ వ్యాఖ్యలు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో గతేడాది దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ సీజేఐ బెంచ్‌కు రిఫర్ అయిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్వాష్ పిటిషన్ లో నిర్ణయం వెలువరించిన ఇద్దరు జడ్జిలు వేర్వేరు అభిప్రాయాలు వెలిబుచ్చారని అన్నారు. ఈ చంద్రబాబు కేసులో 17ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టంగా చెప్పారని.. మరో న్యాయమూర్తి ద్వివేది మాత్రం ఆ సెక్షన్ వర్తించబోదని అన్నారని గుర్తు చేశారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి